Criminal Record

Criminal Record

Download Telugu Subtitle

Season 1

Release info

Criminal Record S01E06 WEB H264-RBB/TVD
A Commentary by sash35

Tags

web
x264
Web-DL
web-dl
WEB-DL
720p
720
1080
HD
Published on: 2024-02-07
Downloads: 31
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

మిస్టర్ గిల్ఫోయిల్, మీరు కొని తెప్పించిన వస్తువులన్నింటినీ సర్దాను.

మీ వార్తాపత్రికని కూడా బయట పెట్టి ఉంచా.

అయిదు పౌండ్లు తీసుకున్నా. మరేం పర్వాలేదనే అనుకుంటున్నా.

అది తేనెనా?

అవును. చూస్తావా?

చూడవచ్చా?

ఇదుగో. ఇది వేసుకో.

భయపడకు. ఇవేమీ చేయవు.

లోపల ఏం కనిపిస్తోందో చెప్పు.

- ఏమీ కనిపించట్లేదు. - హా.

అది మంచి విషయం కాదా?

అంటే తేనెటీగల రాణి ముసలిది అయిపోతోందని అర్థం.

అక్కడ గుడ్లు ఉండాలి, కానీ అది ఎక్కువ గుడ్లు పెట్టలేదు.

డిటెక్టివ్ సార్జెంట్ లెంకర్? 2011 ఆర్కైవ్ నుండి మీరు కోరిన ఎర్రొల్ మ్యాథిస్ ఫైల్స్ ఇవిగోండి.

ఒక విషయం చెప్తా, విను.

లోపల అన్నీ హై పిచ్ శబ్దాలు చేస్తున్నాయి. వాటికి ఏమీ అర్థం కావట్లేదు.

ఏదో మార్పు రాబోతోందని వాటికి అర్థమైంది, దానితో వాటిలో గుబులు మొదలైంది.

దయచేసి తలుపు తట్టి, తీసే దాకా ఆగండి

ఇప్పుడు అవి ఏం చేస్తాయి?

అంటే, వర్కర్ తేనెటీగలు కొత్త రాణిని ఎన్నుకోవాలని చూస్తాయి,

తేనెటీగలన్నీ చక్కగా జీవించాలంటే అది తప్పదు.

కానీ ముసలి రాణికి అది ఇష్టం లేదు. రాణి కాగల వాటిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తుంది.

ఎందుకంటే, రాణి అనేది ఒక్కటే ఉండాలి.

మరి ఇప్పుడేం జరుగుతుంది?

యుద్ధం జరుగుతుంది.

ఆ రెండు తేనెటీగల్లో ఏదోకటి చనిపోయేదాకా ఆ యుద్ధం ఆగదు.

ఆపు. ఆపు, ప్రెస్టన్.

బయటి ప్రపంచం నుండి కానుక అనుకోండి.

ఇక్కడ దొరికే పాలు, కాఫీ పౌడర్ కలుపుకొని తాగీ తాగీ మీకు విసుగు వచ్చేసుంటుందని తెచ్చా.

మంచి పని చేశారు.

లంచ్ దాకా ఆగకుండా అర్జంటుగా వచ్చారు, ఏంటి సంగతి?

మీతో మొదటిసారి మాట్లాడినప్పుడు

మీ బాధను దూరం చేయలేను అని అన్నాను.

కానీ నేను చేయగలిగింది ఏంటంటే, నాకు వీలైనంతగా ప్రయత్నించి...

మీ కుటుంబానికి ఇంతటి శోకం కలిగించిన వాడికి,

జీవితాంతం జైలు శిక్ష పడేలా చేయడం.

హత్యాయత్నం కేసు ఫైల్ చేయడానికి చూస్తున్నాను, సరేనా?

సరే.

ఈరాత్రి మాకు చిన్నారుల రక్షణ సేవల విభాగంతో సమావేశం ఉంది.

ఈ క్షణంలో నేనేమీ మాట ఇవ్వలేను.

ఇదివరకు చెప్పా కదా, వీటికి కాస్త సమయం ఎక్కువ పడుతుంది.

ఖాన్ & కో సొలిసిటర్స్

- ఏమంటావు? - ఇది ఆర్కైవ్స్ లోదా?

హా, అది హెగర్టీ లాగ్ బుక్.

దాని ప్రకారం, ఎర్రొల్ తను నేరం చేయలేదని, అమాయకుడినని గట్టిగా చెప్పాడు.

ఆ తర్వాత రెండు రోజులు కూడా గడవక ముందే, తనే ముందుకు వచ్చి నేరాన్ని ఒప్పుకున్నాడు.

ఆ మధ్యలో వాళ్లు నేరం జరిగిన చోటుకు వెళ్లారు.

- అక్కడ ఏదో జరిగింది. - అవును.

ఏదో జరిగింది...

దాని వల్ల లాభం ఉండకపోవచ్చు, కానీ ఏదో జరిగింది.

ఇది నీకు అనుమానాస్పదంగా అనిపించలేదా?

అది అనుమానాస్పదంగా లేదని నేను అనట్లేదు. అది అందరికీ తెలిసిందే. విచారణలో అది భాగమే కదా.

అప్పీల్ లో దీన్ని ప్రస్తావించాం కూడా. అది మంచి పని కాకపోవచ్చు.

"హేయ్, రెండు రోజుల క్రితం నీ లవరును క్రూరంగా హత్య చేసిన చోటుకు

ఓ సారి వెళ్దామా?" కానీ అదేమీ నేరం కాదు.

సరే. ఆ ఎక్స్ ప్రెషన్ కి అర్థం ఏంటి?

అంటే నువ్వు అందులో ఏదో ఆసక్తికరమైన అంశం ఉన్నట్టు ముఖం పెట్టావు.

ఉందేమో. నాకు ఖచ్చితంగా తెలీదు.

అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఏడున్నరకి ఏమైందో చూడు.

ఏడున్నర, డాక్టర్ హాలింగ్ వర్త్ నుండి అనుమతి లభించింది.

ఎర్రొల్ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాడు.

- ఆ తర్వాత? - ఆ తర్వాత ఇంటర్వ్యూ జరిగింది.

పదిన్నర, ఎర్రొల్ మ్యాథిస్ తో పర్యవేక్షణలో ఇంటర్వ్యూ.

మధ్యలో ఏం జరిగింది?

ఏమీ జరగలేదు.

ఏమీ లేదు.

కదా?

ఏడున్నరకి డాక్టర్ అతనికి అనుమతి ఇస్తాడు. ఆ తర్వాత కొత్తగా ఏ ఆధారాలు లభించలేదు కూడా.

అరెస్ట్ చేయాలని పోలీసుల మీద ఒత్తిడి ఉంది.

వైద్యుడు అనుమతి ఇచ్చిన వెంటనే

వాళ్లు ఇంటర్వ్యూ చేసేయవచ్చు కదా?

మూడు గంటలు ఆగారు. ఎందుకు?

బహుశా అతను ఉదయం త్వరగా లేచే రకం కాదేమో. బహుశా ఆరోజు ఎక్కువ సేపు పడుకున్నాడా, లేదా...

విధిలో ఉన్న లాయర్ మారడం కోసం వేచి చూశారేమో.

- అన్నీ పకడ్బందీగా చేశారు... - తప్పులు, లొసుగులు లేని దారి కోసం.

- వారికి సహకరించే లాయరు కోసం చూశారు. - లొసుగులు ఉండకూడదు కదా.

ఎర్రొల్ కి న్యాయం

న్యాయం దక్కితేనే శాంతి

ఎర్రొల్ ని చూడటానికి ఇవాళ వైట్ క్రాస్ జైలుకు వెళ్తున్నా. అతను బాగుండాలని ప్రార్థించండి!

మీ ప్రేమే మాకు దీవెన #ఎర్రొల్ ని విడుదల చేయాలి

#ఎర్రొల్ ని విడుదల చేయాలి #ఎర్రొల్ కి న్యాయం దక్కాలి

ఆ కాల్ చేసిన వ్యక్తిని వారు కనిపెట్టగలిగితే...

నేనేం చెప్తున్నానో అర్థమైందా? ఇది చాలా పెద్ద విషయం.

ఆమె మాటలను ఫోనులో రికార్డ్ చేశారు తెలుసా? హత్య ఎవరు చేశారో ఆమెకి తెలుసని ఆమె చెప్పింది రికార్డ్ అయ్యుంది.

ప్రతీ ఒక్కరినీ ఇందులో భాగం చేస్తాను, సరేనా? నేను...

ఎర్రొల్!

- బంగారం, ఇది మనకి శుభవార్తే. - అమ్మా, నా వల్ల కాదు.

నీకు అర్థం కావట్లేదా? ఇక నా వల్ల కాదు.

నువ్వు ఇలా చేసిన ప్రతిసారి, నాకు చాలా కష్టం అవుతుంది.

- లేదు, బంగారం, నేను... - లేదు, నాకు మీ సాయం అక్కర్లేదు.

నీకది అర్థం కావట్లేదా?

నాకు...

నాకు ఆశ అనేదే వద్దు.

నేను మర్చిపోవాలనుకుంటున్నా, అమ్మా.

కాబట్టి నన్ను మర్చిపోనివ్వు.

నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు. నువ్వు రాత్రి త్వరగా పడుకోవాలి...

- నువ్వు ఇలా చేసిన ప్రతిసారి... - షేవ్ చేసుకోవాలి.

...నా పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది.

నా పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది.

దేవుడా.

దయచేసి నా మాట విను.

నన్ను ఒంటరిగా వదిలేయ్.

ఎలా?

ఈ మేకులు... ఈ మేకులన్నీ ఒకేలా ఉన్నాయి, గుర్తుపట్టడం ఎలా అంటావు?

బహుశా నీ టేబుల్ అవసరం లేదేమో.

లీసా?

- ఇతను నీకెలా తెలుసు? - నీకో నమస్కారం!

అసలు మీరెలా కలిశారు?

నేనేం చేయాలి, ఎవరిని కలవాలి, ఎవరితో సమయం గడపాలి అని

నువ్వు నాకు చెప్పక్కర్లేదు.

మీరిద్దరూ బలహీన స్థితిలో ఉన్నారు. నేను నీ మంచి కోసమే అడుగుతున్నాను.

లేదు, నువ్వు నన్ను నియంత్రించాలనుకుంటున్నావు, నేను కూడా నీ దృష్టిలో ఒక కేసు అన్నట్టుగా.

లీసా.

- నా ప్రయత్నం నేను చేశాను. పునరావాసాలు, మెథడోన్... - ప్రయత్నం చేశావా?

...నువ్వు ఉండే ఇళ్లని చెల్లాచెదురు చేసినప్పుడు వాటికి డిపాజిట్లు కూడా ఇచ్చాను.

పరిష్కారాన్ని కనిపెట్టడానికి నాకు చేతనైనంత నేను చేస్తున్నాను.

అదేనా ఇది కూడా? అదేనా?

అదేనా?

నీ దగ్గరే ఉండేలా ప్రతి రోజు రాత్రి నీ కన్న కూతురుకి డ్రగ్స్ ఇవ్వడం?

- నేను నీకు కన్న తండ్రిని. - తొక్కేం కాదు.

- నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాది. - నువ్వు నాకు డ్రగ్స్ ఇచ్చే వ్యక్తివి, అంతే.

అదెంత చండాలమైన పనో నీకు తెలుసా?

ఆ పని నేను చేయకపోతే, నువ్వు చస్తావు. అది మనిద్దరికీ బాగా తెలుసు.

- ఇంకా చండాలమైన విషయం ఏంటో తెలుసా? - కారు ఎక్కు.

మళ్లీ ఆ పనే నువ్వు చేస్తావని నీకు తెలుసు.

- నీకు అదే కావాలి. - ఏంటి?

నేను నిన్ను వదిలేసి పోతానేమో అని,

అప్పుడు నువ్వు బాధతో నిండిన ఒంటరి ముసలాడిగా బతకాల్సి వస్తుందని నీ భయం.

నువ్వు ఒంటరిగా బతకడమే నాకు కూడా కావాలి, కాబట్టి ఆ ప్రస్తావన కూడా తీసుకురాకు.

అంటే, నీకు మిత్రులు లేరు, కుటుంబం లేదు...

- కారు ఎక్కు. - ఎక్కను. నేను చెప్పేది నిజమేగా?

- కారు ఎక్కి కూర్చో. - ఒకటి చెప్పనా? చికిత్స కావాల్సింది నాకు కాదు, నీకు!

కారు ఎక్కు. కాస్త...

నీ పెంపుడు జంతువులా నాకు డ్రగ్స్ ఎక్కిస్తూ ఉండు.

ఇంకోటి చెప్పనా? అమ్మ కూడా వదిలేసింది అందుకే.

నీతో ఉండాలంటే నరకం కదా?

వెళ్లి కాస్త బట్టలు వేసుకో.

- దొబ్బేయ్. దొబ్బేయ్. - హా, దొబ్బేయ్. దొబ్బేయ్.

అసలు మా పరిచయం ఎలా అయిందని అనుకుంటున్నావు?

ఛ!

ఛ!

ఇది 2011లో జరిగిన విషయం, మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు,

అప్పుడు మీరు ఎర్రొల్ మ్యాథిస్ కి డిఫెన్స్ లాయరుగా పని చేశారు.

అతను ఒప్పుకున్నాడుగా.

దర్యాప్తు జరిపిన పోలీసులతో మీకు ఉన్న సంబంధం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా.

అంటే, కేసుకు ముందే వాళ్లలో ఎవరైనా మీకు తెలుసా?

- అది నా రికార్డులు చూసి చెప్పగలను. - ఆ... ఆ అవసరం లేదు. నేను...

ఆ సంఘటనకు రెండు వారాల ముందు, మీరు మిసెస్ డెస్టినీ బొలేసీ అనే వ్యక్తికి డిఫెన్స్ లాయరుగా పని చేశారు,

ఆమె దగ్గర డ్రగ్స్ ఉన్నాయి అనే కేసులో.

ఆ కేసుని దర్యాప్తు చేసింది కూడా అదే వ్యక్తి.

డీసీఐ డ్యానియల్ హెగర్టీ.

మీకేం కావాలో నాకు అర్థం కావట్లేదు.

నేరం జరిగిన చోటుకు మీరు వెళ్లినప్పుడు ఏమైనా జరిగిందా?

ఏంటి?

మొదట్నుంచీ చివరిదాకా మీరు మీ క్లయింటుతోనే ఉన్నారా?

ఉన్నానుగా.

ఎర్రొల్ నేరాన్ని ఒప్పుకున్నాడని మీకు డిటెక్టివ్ చీఫ్ ఇన్స్ పెక్టర్, హెగర్టీ స్పష్టంగా చెప్పారా?

చూడండి, ఆఫీసర్ లెంకర్, మీకు ఇంకా ఎక్కువ సమాచారం చెప్పలేను,

అది వృత్తిపరంగా నా ప్రత్యేక హక్కులని తుంగలో తొక్కడమే అవుతుంది,

అవి నా క్లయింటుకు మాత్రమే ప్రత్యేకమైనవి,

లీగల్ సర్వీసుల చట్టం, 2007లోని సెక్షన్ 1.3eలో అది స్పష్టంగా పేర్కొనబడి ఉంది.

అది మీకు తెలుసనే ఆశిస్తున్నా.

కానీ మీరు ఇంకా నన్ను బలవంత పెడితే,

మీ పై అధికారికి నేను కాల్ చేసి,

వాటిని మీకు వివరించమని చెప్పాల్సి ఉంటుంది.

థ్యాంక్యూ, మిస్టర్ కార్డోనా.

కానీ, ఏదైనా మోసం చేయాలనే కుట్రలో ఇంకో విధంగా చెప్పాలంటే నేరం చేయాలనే కుట్రలో

లాయరుకు కూడా భాగం ఉందని బయటపడినప్పుడు, ఆ హక్కులేవీ వర్తించవనే విషయాన్ని

వివరించమని ఆయనకి చెప్పండి.

ఇక బయలుదేరుతాను.

లీసా ఎక్కడ ఉంది?

ఇప్పుడు తనకే మెసేజ్... ఒక్క నిమిషం. తను మీతోనే ఉందనుకున్నా.

ఏం జరుగుతోంది?

- తను... - ఏమైంది?

తను కాల్ చేయలేదా?

- తనతో ఏమన్నారు మీరు? - మళ్లీ మొదలుపెట్టకు, సరేనా?

- చూడు... - నేను తన కోసం వెతుకుతా.

వద్దు, వద్దు. తను ఇంటికి వెళ్తూ ఉంటుంది.

ఎక్కడికీ వెళ్లకు. నేను ఇంటికి వెళ్తా.

తలుపు దగ్గర కూర్చొని ఉంటుంది.

తాళం చెవులు పోయాయి, అందుకే నిన్ను అడిగా.

- మీరు ఎక్కడికైనా వెళ్లాలా? - హా, ఇంకో 45 నిమిషాల్లో నాకు ఒక సమావేశం ఉంది.

పార్కులో పిల్లాడిని కాల్చిన కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు కదా.

- అవును, తను ఏమందంటే... - తనంటే నా కూతురా?

ఆ విషయంలో తను చాలా ఆనందపడింది.

- ఆనందపడిందా? - హా.

- నాకలా అనిపించట్లేదు. - మీరు తన తండ్రి అయినందుకు తను గర్వపడింది.

నన్ను చూసి తను గర్వపడదు.

పనికి వచ్చే పని చేయ్. తన స్నేహితులకు కాల్ చేయ్, వాకబు చేయ్.

తనకి స్నేహితులెవరూ లేరు.

హా.

డోరిస్, దయచేసి చెప్పేది విను.

- వెళ్లిపో, లటీషా. - నాకు వివరించే అవకాశమివ్వు.

లేదు. నీకు పిల్లలు దూరమవ్వవచ్చు అని చెప్పావు. అందుకు నీకు అండగా ఉన్నాను.

- అది నిజమే. - నాకు ఏమీ వినాలని లేదు.

- నేను సాయపడాలనుకుంటున్నా. నిజంగా. - లేదు, అది అబద్ధం. సాయపడాలని ఎవరికీ లేదు.

నీకు కానీ, నా భర్తకి కానీ, ఎర్రొల్ కి కానీ ఎవరికీ లేదు.

ఒక విషయం చెప్పనా? ఎవరెలా పోతే నాకేంటి?

నాకు మీ అవసరం లేదు.

నేను పట్టు విడవను.

More Telugu subtitles for Criminal Record

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left