Criminal Record

Criminal Record

Download Telugu Subtitle

Season 1

Release info

Criminal Record S01E07 WEB H264-RBB/TVD
A Commentary by sash35

Tags

web
x264
Web-DL
web-dl
WEB-DL
720p
720
1080
HD
Published on: 2024-02-14
Downloads: 18
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

తను వేసవిలో చనిపోయింది.

తను చనిపోయిన ఆ వేసవి కాలాన్ని...

వర్ణించడం చాలా కష్టం.

ప్రత్యక్షంగా ఉంటేనే అర్థమవుతుంది.

శాంతికి, అల్లర్లకు తేడా ఏంటో నీకు తెలుసా?

అయిదు అంగుళాల అద్దం.

దొబ్బేయండి!

దుకాణం కిటికీ తాలూకు వెడల్పు అది. అంతే.

అదే శాంతికి, అల్లర్లకి తేడా.

జరగండి! వెనక్కి వెళ్లండి!

ఆ వేసవిలో వాళ్లు ఆ అద్దాలను పగలగొట్టారు.

ప్రతీ రాత్రి అదే తంతు.

మీ ఎర్రొల్ కూడా ఆ అల్లర్లో పాల్గొన్నాడు.

అది జరిగిన మూడు వారాల తర్వాత...

వాళ్ల పొరుగు వ్యక్తి కాల్ చేశారు.

కింద ఉన్న ఒక ఫ్లాటులో గొడవ జరుగుతోంది.

ఆమె కేకలు పెడుతోంది.

అతను తలుపును బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాడు!

సరే. ఇటు నన్ను చూడండి.

నన్ను చూడండి. ముందుకు చూడండి.

- ముందుకు నన్నే చూస్తూ ఉండండి. - పాట్. లేయ్.

హలో, మేము అగ్నిమాపక సిబ్బంది. అలాగే ఉండండి.

- నన్ను చూడండి. - పాట్, లేయ్.

లేయ్. పాట్, లేయ్. కానివ్వు.

పాట్!

నువ్వు దీన్ని భయపెడుతున్నావు. ఇలా రా.

అయితే, నీకు అది నచ్చిందా, లీసా?

లీసా?

హా, నాకు ఇది బాగా నచ్చింది.

ఇంతకీ నువ్వేమంటావు? నాన్నా?

నాన్నా?

హా, నేను... నేను ఇప్పుడు దాన్నే చూస్తున్నాను.

ఏమంటావు?

అది మంచి పనే. నిజంగానే చాలా మంచి పని.

కానీ ఒక విషయం, మనం ఒక మాట అనుకున్నాం కదా?

ఆ కుక్క ఇప్పుడు నీదే. అంటే, నువ్వే దాన్ని నడకకు తీసుకెళ్లాలి.

నువ్వే దానికి ఆహారం పెట్టాలి. దాని బాధ్యత అంతా నీదే. అర్థమైందా?

అంటే, మంచి పనులు చేయడం అనేది మంచి విషయమే.

అదేమీ తప్పు కాదు.

చెడ్డ పని కూడా కాదు అది.

లీసా?

అమ్మ గురించి ఒకటి చెప్పనా!

నువ్వు సంతోషంగా ఉండటమే తనకి కావాల్సింది.

పని ముగించుకొని ఇంటికి ఎప్పుడు వస్తున్నావు?

ఇంకాసేపట్లో వచ్చేస్తా.

నిన్న కూడా అదే అన్నావు. మొన్న కూడా.

హా, త్వరలోనే ఇంటికి వచ్చేస్తా. ప్రమాణపూర్తిగా చెప్తున్నా. వచ్చేస్తా ఇంకాసేపట్లో.

గుడ్ నైట్, నాన్నా.

గుడ్ నైట్, బంగారం.

ఎర్రొల్ మ్యాథిస్, అడిలైడ్ బరోస్ ని హత్య చేశారన్న

అనుమానంతో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. మీరేమీ చెప్పాల్సిన పని లేదు.

కానీ మీరేమైనా చెప్తే, అది మీకు వ్యతిరేక సాక్ష్యంగా ఉపయోగించబడవచ్చు.

అతడిని వదలండి! వదలండి!

- ప్యాటీ! - సంకెళ్లు వేయండి.

- ప్యాటీ. - శాంతించు, బంగారం.

- పదండి. - అమ్మా!

నేను కూడా వస్తున్నా.

నీ వెనుకే ఉన్నా.

అయితే, మీరు లవరుని అరెస్ట్ చేశారన్నమాట.

మంచిది. సరే మరి.

పేస్ చట్టం సమయం ప్రారంభమైంది. మనకి 24 గంటల సమయం ఉంది.

నీకు మేము అండగా ఉన్నాం, డాన్.

అంటే ఏంటి? "అండగా ఉండటం" అంటే?

ఈ కేసులో ఏంటి ప్రత్యేకత?

అంటే, ఈ కేసు విషయంలో కాస్త ఒత్తిడి ఉంది.

ఒత్తిడా? అంటే?

ఇతడిని ఉదాహరణగా చూపించాలని అనుకుంటున్నారు.

ఇటీవలి జరిగిన సంఘటనల కారణంగా, మన మీద అందరికీ సదభిప్రాయం లేకుండా పోయింది.

ఉదాహరణగానా? అల్లర్ల కారణంగానా?

ఒకసారి ఆలోచించు.

వరుసగా అయిదు రాత్రుళ్లు లూటీ చేశారు, తగలబెట్టారు, ఎంత ఆస్థి నష్టం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి.

దేవుడా.

కాబట్టి, మనం ఆ కథనాన్నే వేరుగా చెప్పవచ్చు కదా?

అదే సందేశం.

వాళ్లందరినీ అరెస్ట్ చేయాలి.

అందరినీ చెడ్డవారిగా చూపాలి. అదేనా సందేశం?

- అదే కదా నీ ఉద్దేశం? - కాదు.

నీకు... నీకు విషయం చెప్తున్నానంతే.

నిర్ణయం నీ చేతుల్లో ఉంది. అంతే.

చేతులకు, బట్టలకు రక్తం ఉందా?

20-9-11 కెమెరా మానింగమ్ ఫ్లాట్స్

అవును. అతని మీద చనిపోయిన మహిళ రక్తం ఉంది.

ఆ ఒక్క దాన్ని బట్టే అతనే ఆమెని పొడిచాడని చెప్పలేం కదా?

ఆమెని తన చేతుల్లోకి తీసుకొని కూడా ఉండవచ్చు కదా.

- హా, అవును. - హేయ్, హేయ్. డిఫెన్స్ వాళ్లు అలాగే వాదిస్తారు.

మ్యాథిస్ కారు ప్రమాద ఘటన

అదుగో. అతను కారులో ఉన్నాడు. పిల్లాడు వెనుక ఉన్నాడు.

గుద్దేసింది.

గతంలో ఎప్పుడైన హింసకు పాల్పడ్డాడా?

హా, అతను టీనేజ్ లో ఉన్నప్పుడు 2005లో పొరుగువారు పోలీసులకి కాల్ చేశారు... కానీ అది ముందుకు పోలేదు.

- ఆ రిపోర్ట్ నేను చూడవచ్చా? - తప్పకుండా.

అప్పుడు నాన్నతో గొడవపడ్డాను, కానీ నాన్న కేసు ఫైల్ చేయాలనుకోలేదు.

అతనికీ, చనిపోయిన వ్యక్తికి ఏమైనా గొడవలు జరిగాయా? పోనీ అతనికి, అతని పాత లవర్లకు అయినా?

- పిల్లాడితో అయినా? ఏంటి... - పాట్రిక్.

- గతంలో ఏమైనా జరిగిన దాఖలాలు ఉన్నాయా? - లేవు.

కానీ అప్పుడు అతను బెడ్ రూమ్ లో ఉన్నాడు, తలుపు లాక్ చేసి ఉంది, తాళం చెవి కనిపించలేదు.

విని ఉంటాడు కదా.

అ పిల్లాడు హత్య తతంగాన్ని అంతా విని ఉంటాడు కదా.

ఆమె తరఫు బందువులు ఎవరూ లేరా?

లేరు. తను ప్రభుత్వ అనాథాశ్రమంలో పెరిగింది, తనకి ఎవరూ లేరు, అందులో ఏ సందేహమూ లేదు.

- ఆ పిల్లాడికి తండ్రి అతను కాదు కదా? - కానే కాదు.

తాగి ఉన్నప్పుడు ఒక రాత్రి జరిగిన దానికి ప్రతిఫలంగా... పాట్రిక్ పుట్టాడట.

అలాంటివి చాలానే జరిగి ఉంటాయి.

తనకి నల్లవాళ్లంటే ఇష్టమని తెలిసిపోతోంది.

అబ్బా. నేనేమీ తనని అనట్లేదు.

ప్రతీఒక్కరికీ ఇష్టాయిష్టాలు ఉంటాయి కదా, అదే చెప్తున్నాను నేను.

నాకు తప్ప. నాకు అమ్మాయి అయితే చాలబ్బా.

సరే మరి. సీసీటీవీ వీడియోను ఆధారంగా చూపిద్దాం, సరేనా?

ఈలోపు, ఎమర్జెన్సీ కాల్ చేశారు కదా, ఎర్రోల్ ఆ సమయంలో ఫ్లాటులోనే ఉన్నాడని

ఆ వ్యక్తి నుండి నాకు సాక్షి వాంగ్మూలం తీసుకోండి.

ట్రేస్ చేయండి, ఆ ఫ్లాట్ బయటకు ఎవరైనా వచ్చినట్టు తెలిస్తే, వాళ్లని ఇంటర్వ్యూ చేయండి.

ఆ ప్రాంతంలో గతంలో హింసకు ఎవరైనా పాల్పడినట్టు రికార్డుల్లో ఉందేమో చూడండి.

ఆ ఫ్లాట్ లో ఉన్న వాళ్లందరి డీఎన్ఏ నాకు కావాలి. నేను చాలా అడుగుతున్నానని నాకు తెలుసు,

కానీ ముందుగానే దర్యాప్తు చేస్తే, మనం బలమైన ఆధారాలు సంపాదించవచ్చు.

- అతను నేరాన్ని ఒప్పుకుంటే ఇవన్నీ అవసరం లేదు. - కావచ్చు.

బాస్... ఇలా అడుగుతున్నందుకు మన్నించాలి, కానీ,

ఇక్కడ సమస్యగా మీకు ఏం అనిపిస్తోంది?

నా సమస్యనా? గాయం తాలూకు తీవ్రతే నా సమస్య, టోనీ.

కొరికిన మచ్చలు ఉన్నాయి కదా? అవి ఎలా వచ్చాయి?

ఇతగాడి దగ్గర కత్తి కూడా లేదు.

- అలా అని మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. - ఖచ్చితంగా చెప్పలేమా?

అతడిని తొమ్మిదిసార్లు ఆపి, వెతికారు. తొమ్మిదిసార్లు.

ఒక్కసారి కూడా అతని దగ్గర కత్తి కనిపించలేదు.

కాబట్టి, నా సమస్య ఏంటంటే...

నాకు వాస్తవాలు కావాలి, టోనీ. అదే సమస్య.

అతనికి నేర చరిత్ర ఉందని చూపించండి.

సరేనా? ఆనందంగా ఉందా? సూపర్.

విచారణ ప్రారంభించే ముందు, నా క్లయింట్

ఒక చిన్న స్టేట్ మెంట్ ఇచ్చారు, దాన్ని చదవమని నన్ను కోరారు.

"సెప్టెంబర్ 20, 2011న జరిగిన నా లవర్, అడిలైడ్ బరోస్ హత్య విషయంలో

మీరు జరిపే దర్యాప్తుకు

నేను పూర్తిగా సహకరిస్తాను.

కానీ ఆమె చనిపోయిన కారణంగా నేను పడిన మానసిక క్షోభ వలన

మానింగమ్ ఫ్లాట్స్ లో నేను ఉండే ఫ్లాట్ అయిన, ఫ్లాట్ నంబరు 616లోకి నేను ప్రవేశించిన తర్వాత నుండి,

ఆసుపత్రిలో నాకు స్పృహ వచ్చేదాకా

నాకు అసలు ఏమీ గుర్తు లేదు."

సరే, మీరు అన్నది అర్థం చేసుకున్నాను.

మీ ఎంఆర్ఐ స్కాన్ లో మీ తలకి గాయం కాలేదని ఉంది,

దాన్ని ఎలా అర్థం చేసుకున్నానో, ఇప్పుడు మీది కూడా అలాగే అర్థం చేసుకుంటున్నా.

మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారో తెలుసు కదా,

మిస్టర్ మ్యాథిస్?

అయిదేళ్లుగా మీ లవరుగా ఉన్న అడిలైడ్ బరోస్,

మీరిద్దరూ ఉండే నివాసం అయిన 616, మానింగమ్ ఫ్లాట్స్ లో

కత్తిపోట్ల కారణంగా చనిపోయారు.

మిస్ బర్రోస్ ఏ సమయంలో అయితే హత్యకు గురయ్యారో, ఆ సమయంలో మిస్టర్ మ్యాథిస్

ఆ ఫ్లాటులో లేడని కూడా చెప్తున్నారు.

ఆ సమయంలో ఆయన పని కోసం వెతుకుతున్నారు.

పని కోసమా?

అయితే మీకు గుర్తుంది అన్నమాట?

అంతకు ముందువి గుర్తున్నాయి.

సరే. పని కోసం ఎక్కడికి వెళ్లారు?

వీఐపీ కట్స్. అదొక బార్బర్ షాప్.

సరే, బార్బర్స్ షాప్ అన్నమాట.

అక్కడ మీరు ఎవరినైనా కలిశారా?

అక్కడ ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడారా?

- మాట్లాడాను. -"మొస్తాఫా డెమీర్" అనే వ్యక్తితో.

మొస్తాఫా డెమీర్.

దీని గురించి మనకి తెలీలేదు ఎందుకు?

సర్, మనం లోపలికి వెళ్లే ముందు నేను కార్డోనాతో మాట్లాడాను.

అలిబై గురించి అతను ఒక్క ముక్క కూడా చెప్పలేదు.

సరే. ఇక మీ ఇద్దరూ అక్కడికి వెళ్లండి.

ఈ మొస్తాఫాతో మాట్లాడండి.

నిన్ను నిరశపరచం. కంగారుపడవద్దు, బాస్.

లేదు, లేదు, కిమ్. నాకు కావాల్సింది వాస్తవాలే.

అవి ఇప్పుడే తెలుసుకోవడం మంచిది,

- తర్వాత ఏ పురోగతి లేకుండా చతికిలబడకూడదు మనం. - సరే.

సర్, లైనులో డెప్యూటీ కమిషనర్ ఉన్నారు.

మూడుసార్లు కాల్ చేశారు.

డాన్, నేను కమాండర్ బ్లూమ్ ని. అరెస్ట్ చేశారనే తీపి కబురు తెలిసింది.

నీకు గుడ్ లక్ చెప్దామని చేశాను.

నీకు తెలిసే ఉంటుంది, ఈ విషయంలో పబ్లిసిటీ చాలా ఉందని, అదీగాక...

నాన్నా, ఎక్కడ ఉన్నావు?

సాక్షి వాంగ్మూల - జేసన్ 18కు పైనే - ఏం చేస్తున్నాడో అతనికే తెలీట్లేదు

నువ్వు... నువ్వు ఆమ్లెట్ విషయంలో మార్సెల్లాతో మాట్లాడతానని మాటిచ్చావు కదా.

డాన్. మళ్లీ నేనే, లారీని.

- ఇంకో విషయం ఏంటంటే, నీకేమైనా కావాలంటే... - ఆమ్లెట్?

హా, గుర్తొచ్చింది. సరే.

- ఫోన్ మార్సెల్లాకి ఇస్తావా? - సరే.

- థ్యాంక్స్, బంగారం. - నేను డీసీఐ హెగర్టీ కోసం కాల్ చేస్తున్నా.

నేను పీఆర్ శాఖలో పని చేస్తున్నాను.

చూడండి, మీరు ఇచ్చిన స్టేట్ మెంట్ విషయంలో...

- మార్సెల్లా. - హా, చెప్పండి.

హా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే,

నీకు ముందే చెప్పాను అనుకున్నా, కానీ...

- టొమాటోలు వేయవద్దు. - టొమాటోలు వద్దా?

వద్దు. అస్సలు వద్దు.

డాన్, మళ్లీ నేనే.

ఈ వ్యక్తి మీద కేసు వేయడానికి అవకాశం ఉందా?

ఫోన్ లీసాకి ఇస్తావా? చాలా చాలా థ్యాంక్స్.

హాయ్, బంగారం. ఇప్పుడు అంతా ఓకే... నేను తనతో మాట్లాడా.

ఇంతకీ ఇంటికి ఎప్పుడు వస్తున్నావు?

త్వరలోనే. త్వరలోనే వచ్చేస్తా.

సర్, మొస్తాఫా డెమీర్ నాల్గవ గదిలో ఉన్నాడు.

టోనీ, కిమ్ ఏం అడుగుతున్నారంటే,

అతడిని మీరు వచ్చి అడుగుతారా, లేకపోతే వాళ్లనే కానిచ్చేయమంటారా అని.

సరే.

సరే అంటే మీరు అడగడానికా, వాళ్లే కానివ్వడానికా?

వాళ్లే కానివ్వడానికి. డెనీస్?

సెయింట్ లూక్స్ ఆసుపత్రికి వెళ్లి డ్యూటీలో ఉన్న నర్సులని అడుగు.

ఆసుపత్రిలో అతడిని ఎవరు సందర్శించారు?

More Telugu subtitles for Criminal Record

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left