Girls State

Girls State

Download Telugu Subtitle

Release info

Girls State 2024 WEB H264-RBB
A Commentary by sash35

Tags

web
webrip
x264
720p
720
BRip
1080
TS
YTS
HD
Web-DL
web-dl
WEB-DL
Published on: 2024-04-05
Downloads: 21
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

నాకు, 1964లో వచ్చిన డిస్నీ క్లాసిక్ మేరీ పాపిన్స్ సినిమాలో,

మిసెస్ బ్యాంక్స్ తలుపు నెట్టుకుని ఇంటిలోకి వచ్చి,

మహిళా ఓట్ల కోసం గర్వంగా దట్టీ కట్టుకునే సీన్ ఇష్టం.

ఇంగ్లీష్ మహిళల ఓట్లు రాబట్టుకునేందుకు, పాట రూపంలో తను చేసిన పనులు చెప్తుంది,

మృదువైన, గిలిగింతలు పెట్టే స్వరంతో తన బలాన్ని పాటగా ప్రదర్శిస్తుంది.

తను గట్టిగా అరవాల్సిన పని లేదు.

ఆమె శక్తిమంతమైన మహిళ, మన గాళ్స్ స్టేట్‌ కూడా అంతే.

మహిళలుగా మనం, మన స్వరం తగ్గించి మాట్లాడాలనే మాట వింటుంటాం,

మనం తప్పకుండా మగాళ్లలాగే మాట్లాడాలి, చర్చకి దిగాలి.

మనం బలంగా, శక్తిమంతంగా ఉండాలి, అందరి దృష్టిని మనవైపు తిప్పుకోవాలి.

నిజంగా, సత్యానికి మించింది ఏదీ లేదు.

స్త్రీత్వం శక్తివంతమైంది అనేది సత్యం.

సరే, లోపలికి రా.

వెళ్లి కూర్చో.

- రండి. - అక్కడ చాలామంది ఉన్నారు.

ఒకరితో ఒకరు మాట్లాడటమే ఉంటుంది అనుకున్నా.

దయచేసి, మీ గురించి మాకు చెప్తారా?

నేను 2040లో ప్రెసిడెంట్‌గా పోటీ పడాలి అనుకుంటున్నా,

కాబట్టి గాళ్స్ స్టేట్ గవర్నర్‌గా పోటీ చేయబోతున్నా.

గాళ్స్ స్టేట్‌లో అందరూ నన్ను ఇష్టపడాలి అని కోరుకుంటున్నా,

నేను పోటీ చేస్తున్నందుకు కాదు అది.

నేనొక నాయకురాలిని. నేను అథ్లెట్‌ని, సంగీతకారిణిని, నటిని, మేధావిని.

ఇంకా, ఇంగ్లీష్ హానర్స్ సొసైటీకి ప్రెసిడెంట్‌ కాబోతున్నాను.

క్షమించాలి. నా గురించి నాకు ఏమీ తెలియదు.

నాకు రాజకీయాలు అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా,

దీన్ని తప్పక నా కెరీర్‌గా చేసుకోవాలి అనుకుంటున్నా.

ప్రజారోగ్యం నాకు చాలా ఇష్టమైన విషయం.

వ్యక్తిగత ఆయుధాలు కలిగి ఉన్నవారిలో

జవాబుదారీతనం పెరగాలని నమ్ముతున్నా.

అబార్షన్‌ని నిషేధించినట్టున్నారు, దీనికి మద్దతు, వ్యతిరేకత ఉన్నాయి,

అయితే అబార్షన్‌ని నిషేధించడం వల్ల ప్రసూతి మరణాల రేటు

పెరుగుతుందని అందరూ అంగీకరించాల్సి ఉంటుంది.

- థ్యాంక్యూ. - అందరికీ థ్యాంక్యూ.

ఓకే.

అమెరికన్ లీజియన్, అమెరికన్ లీజియన్ ఆక్సిలరీ 1930ల నుంచి

టీనేజర్లు ప్రజాస్వామ్యం గురించి తెలుసుకోవడానికి,

వారితోనే ప్రభుత్వాన్ని నిర్మించే కార్యక్రమాన్ని

వారం పాటు నిర్వహిస్తున్నారు.

యాభై రాష్ట్రాల్లో అబ్బాయిలు, అమ్మాయిలకి విడిగా ఈ కార్యక్రమం ఉంటోంది.

ఒక్క హవాయిలో తప్ప

అది "ఐస్ ఐస్ బేబీనా?"

సరే ఆగండి, కలవండి, వినండి

సరికొత్త ఆవిష్కరణతో ఐస్ మళ్లీ వచ్చింది

ఏదో నన్ను గట్టిగా తగులుకుంది

హార్పూన్‌లా పగలూ, రాత్రీ ప్రవహించండి

ఇది ఎప్పుడైనా ఆగేనా?

బై. గుడ్ లక్.

మసోరీ

వాళ్ల 80 ఏళ్ల చరిత్రలో,

మసోరీ గాళ్స్ మరియు బాయ్స్ స్టేట్ కార్యక్రమాలు ఒకే చోట నిర్వహిస్తున్నారు.

లిండెన్‌వుడ్ యూనివర్శిటీ సెయింట్ చార్లెస్, మసోరీ

అదుగో జనం చేతులు ఊపుతున్నారు.

అది ఉత్సాహంగా ఉంది.

ఎమిలీ, నీ ఫోటో తీసుకుంటున్నా.

బాగుంది. ఇప్పుడు నవ్వడం ఆపొచ్చు, ఫర్వాలేదు.

థ్యాంక్యూ.

చాలా ఉత్సాహంగా ఉంది, ఉదయం 4:30కే లేచాను,

మ్యాన్యువల్ అంతా చదివా.

నేను స్కూలులో నాలుగో తరగతి నుంచి

పాల్గొన్న ప్రతి ఎలక్షన్ గెలిచాను.

మా స్పిరిట్ టన్నెల్ చూస్తావా?

చూస్తా.

మా స్కూల్‌లో, నాకు మంచి గుర్తింపు ఉంది.

కల్చర్ క్లబ్, కీ క్లబ్, పర్యావరణ సమతుల్యత, ఎఫ్‌సీఏ...

విద్యార్ధి సంఘం, కనెక్ట్, మెల్‌విల్ మీడియా, స్టెప్ టీమ్, లక్రాస్.

కొన్ని మర్చిపోతున్నా. సైన్స్ క్లబ్ చెప్పానా?

ఓహ్, ఇంకా స్కూల్‌లో బైబిల్ స్టడీ మొదలుపెట్టా. అంతే.

కాబట్టి, నువ్వు ఫెడరలిస్ట్, నేషనలిస్ట్ అయితే...

- అవును! - నలభై! అది నా లక్కీ నంబర్.

- అయ్యో. - ఆ ఏడాది ప్రెసిడెంట్‌గా పోటీచేస్తా.

ఎమిలీ వర్త్‌మోర్, "వర్త్ మోర్ ఫర్ అమెరికా, 2040."

- నచ్చింది. - అమ్మబాబోయ్.

థ్యాంక్యూ సో మచ్.

తొలిఏడాది నా టాప్ త్రీ కెరీర్స్ ఎంచుకోమన్నారు,

అమెరికా ప్రెసిడెంట్, బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్,

రాక్ స్టార్ అని చెప్పాను.

ఆ మూడూ చేయగలనని అనుకుంటున్నా.

రాక్ అండ్ రోల్

నేను కన్జర్వేటివా లేక లిబరలా అన్నది

మా స్కూల్‌లో ఎవరికీ తెలియదు.

నేను ఏ పార్టీ అని జనం అడిగినప్పుడు, ఏంటనేది నేను చెప్పాలనుకోను

దాంతో నేను మాట్లాడేలోపే సగం మంది సైలెంట్ అయిపోతారు.

కానీ గాళ్స్ స్టేట్‌ విషయానికి వస్తే,

నేను కచ్చితంగా చెప్తాను,

"నేను కన్జర్వేటివ్‌ని. దానిపై మాట్లాడుదాం" అని.

ఇది నా దేశభక్తి సరుకు.

ఇది నా దేశభక్తి సరుకు.

- నాకది చాలా ఇష్టం. - చూడు.

ఇంకా ఎరుపు హెడ్‌బ్యాండ్ ఉంది, ఇంకా ముత్యాలున్నాయి.

ఓహ్, నాకు చాలా ఇష్టం.

ఇంకా ముత్యపు చెవిరింగులు ఉన్నాయి,

ముత్యాలు ప్రభుత్వానికి ప్రతీకలా ఉంటాయని నాకు తెలియదు.

రాజకీయ భిన్నత్వం ఇప్పుడు నాకు అర్ధమవుతోంది,

మనమందరం చర్చలు చేయాలి.

రాజకీయంగా నువ్వు ఏంటో తెలియదు.

నాకు బెర్నీ శాండర్స్ ఇష్టం, నువ్వు అర్ధం చేసుకో.

మనం మంచి స్నేహితులం అవుతాం.

అవును. అవుతాం.

నేను గే, కాబట్టి...

నేను బై. అయినా బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు, కాబట్టి...

లేదు, దాన్ని గౌరవిస్తా.

- అవును. - బాగుంది.

ఒకేసారి ఎన్ని పనులు చేయగలనో చూసుకోవాలి,

ఒకేసారి రకరకాల పనులు చేస్తే ఏమవుతుందో చూసుకోవాలి.

రేపు సుప్రీంకోర్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి.

నాకు చేయగలిగే విషయాలకు గాళ్స్ స్టేట్ దగ్గరగా ఉంది.

మాట్లాడటం, రాజకీయాలు, కాస్త స్కూలు విషయాలు ఇందులో ఉన్నాయి.

చూడు. ఇది చాలా బాగుంది.

అయితే దీన్ని గాళ్స్ స్టేట్ ఒప్పుకోదేమో, కదా? వచ్చే వారం వేసుకోగలవా ఇది?

నిజం ఏంటంటే, ఈ పట్టీలు మూడు వేళ్ల పొడవు ఉన్నాయి.

సామాజిక నైపుణ్యాల విషయంలో ఎప్పుడూ నేనంత కాన్ఫిడెంట్‌ కాదు.

నాకు మంచి జరగాలని కోరుకో, బ్రూజర్.

న్యాయ విద్యార్ధిగా ఇది నాకు తొలి క్లాస్.

లీగల్లీ బ్లాండ్ సినిమా చూడలేదని నా ఫ్రెండ్స్‌కి చెప్పాను.

దానికి అందరూ షాక్ అయ్యారు.

నేను చూసిన అత్యంత తెల్లటి మనిషి తనే.

సామాజిక నైపుణ్యాలు, సరదాగా గడిపే మనస్తత్వం పొందడానికి

లీగల్లీ బ్లాండ్ సినిమాలో చూపింది సరైన దారి.

నేను చాలా సీరియస్‌గా ఉంటాను.

కానీ అక్కడికెళ్లాకే ఇది అర్ధమైంది అనుకుంటా.

అవును.

నేను స్నాప్‌చాట్ గ్రూప్ చాట్‌లో చేరాలి అనుకుంటున్నా.

హేయ్, పార్టీ.

ఈ వారం చివరికి మనం ఎంత దగ్గరవుతామో చూడాలని ఆత్రుతగా ఉంది.

- కొన్నిగంటల్లోనే ఇలా ఉన్నాం. - ఇవి తొలి నాలుగు గంటలే.

ఇప్పటికే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం.

అవును.

బస్ దిగడం గొప్పగా ఉంది, ఎందుకంటే బాయ్స్ స్టేట్ వాళ్లతో ఉన్నాం మేము,

వాళ్లు అబ్బాయిల్లానే ఉన్నారు.

ఎలా ఉందంటే, స్త్రీవాదం ఇంకా ఒకరితో ఒకరం కలవడం లాంటి విషయాలు

ఎప్పుడు మొదలవుతాయా అనిపించింది.

అది జరిగాక, "అబ్బా, ఇది బాగుంది" అనుకున్నా.

సరే, కంటెంట్ చేద్దాం.

గాళ్స్ స్టేట్ చాలా సాధికారికంగా ఉంటుందని భావిస్తున్నా.

మిగతా మహిళలు, తాము ప్రభుత్వంలో ఉండాలని కోరుకుంటారని ఆశిస్తున్నా.

నా కలల దృశ్యం కుంబాయా,

అందులో అందరం మంట చుట్టూ తిరుగుతూ, చేతులు పట్టుకుని పాడుతుంటాం.

గాళ్స్ స్టేట్‌లో నా భయం ఒక్కటే,

"ఇది నేనుండటానికి తగిన చోటు కాదు"

అనే భావన వచ్చే చోటుకి వెళ్తానేమో అని.

గాళ్స్ స్టేట్‌లో మనం చేసే కొన్ని పనుల్లో,

ముఖ్యమైంది, ఎప్పుడూ ఎక్కడికీ ఒంటరిగా వెళ్లవద్దు.

సరేనా? ఈ క్యాంపస్‌లో మనం ఒంటరిగా లేము, కాబట్టి ఒంటరిగా ఎప్పుడూ ఉండకూడదు.

మనం తొలిసారి మసోరి బాయ్స్ స్టేట్‌తో కలిసి ఉంటున్నాం.

అందరికీ అది తెలుసో లేదో తెలియదు.

మీరు మరియు అబ్బాయిల నుంచి ఏం ఊహిస్తామో

నేను మాట్లాడాల్సిన అవసరం లేదని ఆశిస్తున్నా.

ఇంకా, లో-కట్ బ్యాక్స్ వేసుకోకూడదు.

కాబట్టి, మీరు అలాంటి డ్రెస్‌లు వేసుకుంటే,

కవర్ చేసుకోవడానికి ఏదొకటి ఉంచుకోండి.

ఇక, మెడలో బ్యాడ్జ్‌లు ఎర్రగా ఉంటే, వాళ్లు ఫెడరలిస్ట్‌ అని,

బ్లూ అయితే, వాళ్లు నేషనలిస్ట్ అని.

ఎంతమంది గవర్నర్ కోసం పోటీ పడుతున్నారు?

ఎవరూ లేరా, అంటే, "ఎవరూ చేతులెత్తడం లేదా?" అని.

సరే, మీరున్నారు. ఓకే.

ఆఫీస్ కోసం పోటీ పడటానికి గాళ్స్ స్టేట్ పౌరుల్ని

పార్టీలుగా విభజిస్తారు, ప్రభుత్వంలో మూడు శాఖలు ఏర్పాటుచేస్తారు.

అత్యున్నత ఆఫీస్ అంటే గవర్నర్.

హాయ్, నా పేరు ఎమిలీ. మీ పేరు?

- మీ పేరు? - నా పేరు యాలీ.

యాలీ. నైస్ టు మీట్ యు.

హాయ్, మీ పేర్లు ఏంటి?

హాయ్, నా పేరు కైలీ.

- కైలీ. - అలిస్సా.

- అలిస్సా. - కేలీ.

- కేలీ. - జోలీ.

జోలీ, జోలీ, జోలీ. నైస్ టు మీట్ యు, జోలీ.

జోలీ. జూలీ. జూలీ?

- జో... జో. - జోయీ? జోడీ?

జో... లీ.

- జోలీ. జోలీ. ఐరిష్ పేరా? - సరిగా చెప్పావు. కాదు.

కాదా?

ముద్దుగా ఉన్నారు.

బ్రేస్‌లెట్ స్టేషన్

కప్‌కేక్ డెకరేటింగ్

గ్రేట్! పార్టీ ప్రారంభం కాబోతోంది

ఎందుకంటే మనం గాళ్స్ స్టేట్ పాట నేర్చుకోబోతున్నాం.

మేము రెడీ. ఓహ్, మేము రెడీ.

మనమే భవిష్యత్ నిర్మాతలం

ఒక్కటైన నిర్మాతలం

గాళ్స్ స్టేట్ నుంచి వచ్చినవాళ్లం

భూమిపైనే ఇది ఉత్తమ స్టేట్

రా, రా, రా మేము కదిలాం, వస్తున్నాం

ఇందులో ఏదో స్త్రీ వివక్ష ఉంది.

అబ్బాయిలు ఇది చేయకపోతే, నాకు మండుతుంది.

నాకు కూడా.

మన గాళ్స్ స్టేట్ కోసం గర్వంగా పాడుదాం మన పాట

క్రౌడర్ సిటీ

అదుగో చందమామ.

ఈ వాతావరణం అంతా...

...ఉత్సాహంగా ఉంది.

పరిచయాలు పెంచుకోవడం, ఎంతమంది తెలుసు, అనేదే ఇక్కడ ముఖ్యం.

చివరికి, కప్‌కేక్ మేకింగ్ దగ్గర కూడా...

...సరదాగా గడిచిపోయింది, ఈ గాలిలోనే ఏదో గమ్మత్తు ఉంది.

అవే రాజకీయాలు.

నేను ద్వైపాక్షిక మద్దతు కోసం చూస్తున్నా.

నాకు తెలిసి... నువ్వు లిబరలా?

- అవును. - సరే, నేను కన్జర్వేటివ్, కానీ...

నేను ద్వైపాక్షికతపై పోటీ చేస్తున్నా, కాబట్టి...

- దేనికి పోటీ చేస్తున్నావు? - గవర్నర్‌కి పోటీ పడుతున్నా.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left