The first 200 lines.
ప్రీవియస్లీ ఆన్ రైడ్ ఆర్ డై…
నీ ప్లాన్ ఏంటి, పిల్లా?
ఆనాను చంపేస్తాను.
టాక్.
కారు ఆన్ చేయి! వెనుక నుండి బయటకు వస్తుంటారు!
ఆ తర్వాత డబ్బును తిరిగి ఇచ్చేస్తాను, డెబ్బీ నుండి వీలైనంత దూరంగా పారిపోతాను.
న్యూ యార్క్‌లోని న్యాయ సంస్థకు చేసిన వినతిని నువ్వు వివరించగలవా?
ఆమెకు ఆ ఉద్యోగాన్ని ఇవ్వజూపే తొలి ఈమెయిల్‌ను డిలీట్ చేశాను.
డెబ్బీ!
నాకు కంబోడియాలోని ఈ చిన్న చోటు తెలుసు.
దానర్థం, "సూదూరమైనది, కంటికి సులభంగా కనపడనిది."
నాతో రా.
కారు ఆపు!
సరే, కాల్చేయ్! కాల్చేయ్, సామ్!
ఆమె పారిపోతోంది!
భావోద్వేగ బంధం ఒక సమస్యా?
ఆమెతోనా?
అసలు కానే కాదు.
ఈమె ఎవరు?
ఆమె ఒక హంతకురాలు.
లండన్
అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై, 12 మందికి పైగా పార్లమెంటు సభ్యులను
విచారణకు పిలిపించారు,
వీళ్ళు యూకే రవాణా బిల్లును అడ్డుకోవడానికి అల్బేనియా నేర ముఠా నాయకుడైన
ఎర్గాన్ క్రెష్నిక్ ఒత్తిడి వల్ల లంచం తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ,
ఇతను కొద్ది రోజుల ముందు హతుడయ్యాడు.
దర్యాప్తు సంస్థలను ప్రధాన మంత్రి అభినందించారు,
ఈ పరిస్థితిని, "బ్రిటీష్ రాజకీయాలపై మాయని మచ్చ," అంటూ వర్ణించారు.
కెమెరా పట్టుకో!
- అదిగో వచ్చాడు! - మరింత మంది పాత్రికేయులు.
నేను నా ముఖం దాచుకోవాలా? జనాలు అలాగే చేస్తారా?
- డేవిడ్. - అలా చేస్తే నేరం చేసినట్టు కనపడతామా?
- నేను నవ్వాలా? అది విడ్డూరంగా ఉంటుంది. - ఇలా చూడు, డేవిడ్!
డెబ్బీ, నువ్వు లేకుండా ఇది ఒంటరిగా చేయలేను, సరేనా? నీ సాయం అవసరం.
ఒక మాట చెప్పనా, డేవిడ్?
నువ్వు వెళ్ళిపో.
డేవిడ్!
ధైర్యంగా ఉండు.
సీన్ చేయకు.
డెబ్బీ!
మిసెస్ క్లేబార్న్…
ఈ మీట నొక్కితే, ప్రతీ మాటా వినవచ్చని తెలుసుగా.
నేను అతన్ని వినాల్సిన పని లేదు. అతనేం చెబుతున్నాడో నాకు తెలుసు.
శుభవార్త.
నీపై అన్ని కేసులు ఎత్తివేశారు.
డేవిడ్ ఏం చేస్తున్నాడో నీకేమీ తెలియదు, దాంతో…
మరి పాస్‌పోర్ట్?
అది సాక్ష్యాల ఫైలు నుండి ఎలాగో కనపడకుండా పోయింది.
నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు.
అల్బేనియా ముఠా నుండి నీకు ముప్పు ఉందని మేము అనుకోవడం లేదు,
కానీ నిన్ను రక్షించడానికి మీ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేయగలం.
నన్ను రక్షించాలని చూసే జనాలతో విసిగిపోయాను.
డెబ్బీ?
జెనీవాలో నీ స్నేహితురాలి గురించి చెప్పినది…
ఆమె నా స్నేహితురాలు కాదు.
అంతకు మించి నేను ఇంకేమీ చెప్పను.
కంటి చూపు నరం మామూలుగానే ఉంది.
ఆ కుట్లు బాగున్నాయి. వాటిని ఎవరు కుట్టారు?
మొనాకోలో ఒకతను.
అతను చనిపోయాడు.
పనికి వెళ్ళే అనుమతివ్వు. నేను రెడ్‌బ్యాక్‌ను కనుక్కోవాలి.
సరే. నువ్వు పనికి వెళ్ళచ్చని సంతోషంగా చెప్తున్నా…
మరో మూడు వారాలలో.
రెండు వారాలలో.
నువ్వు వెళ్ళవచ్చు. నీ ఆరోగ్యం బాగుంది.
నువ్వు వెళ్ళడానికి సిద్ధం, విప్‌టైల్. వెళ్ళడానికి సిద్ధం.
వ్యక్తిని తొలగిస్తున్నా
పూర్తయింది
కాల్ తిరస్కరణ సామ్
క్యూ.హెచ్.బీ.డీ.
క్యూ, పుట్టినరోజు శుభాకాంక్షలు.
క్యూ, పుట్టిన…
క్వీనీ
"నా క్వీనీ.
ఈ ఉత్తరాన్ని ప్రతీ ఏడాదీ రాస్తా, ప్రతీ ఏడాదీ, దీన్ని అసలు చదవవని ఆశిస్తా.
ప్రతి బిడ్డ జీవితం తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది,
నేను మంచి నిర్ణయాలు తీసుకోలేదు.
కానీ ఈ మొత్తం ప్రపంచంలో అన్నింటికన్నా మిన్నగా నిన్ను ప్రేమించానని తెలుసుకో.
ఇందులో తగినంత డబ్బు,
తగినన్ని భిన్నమైన పేర్లు ఉన్నాయి, నీ జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టడానికి.
ఇక్కడి నుండి దూరంగా పారిపో.
నీకు మెరుగైన జీవితాన్ని ఇచ్చే బాధ్యత…
జనన ధృవీకరణ పత్రం
…నీకు నిజం చెప్పాల్సిన బాధ్యతా నాదే.
ఇందులో అన్ని జవాబులు ఉన్నాయి.
నువ్వంటే నాకిష్టం.
అమ్మ."
ఛత్.
సరే.
హాయ్. క్షమించాలి. మేము దుకాణం మూసేశాం.
నువ్వున్న చోటు ఎంతో బాగుంది.
- మేము దుకాణం మూసేశామని చెప్పాగా. - చెప్పుల పని, కదా?
నువ్వు షూలను బాగు చేస్తావు.
క్షమించు, నా ఇంగ్లీష్… క్షమించు.
కానీ "చెప్పుల పని," అనే మాటను
నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేసేవాళ్ళకు మనం ఉపయోగించే మాట కూడా ఇదే కదా?
నీకేం కావాలి?
ఇంటర్‌పోల్.
నాకు కొన్ని జవాబులు కావాలి.
జెనీవాలో నువ్వేం చేస్తూ ఉన్నావు?
జెనీవానా?
నేనెప్పుడూ జెనీవాకే వెళ్ళింది లేదు. కానీ అది నా జాబితాలో అయితే ఉంది.
ఆ, జెనీవాకు వెళ్ళావు.
అక్కడి నుండి ఇక్కడి దాకా నీ జాడ పసిగట్టాం.
దొంగ పత్రాలు తయారు చేసే ఈ దుకాణం దాకా కనుగొన్నాం.
నేను పందెం కాయాల్సి వస్తే, వీటిని నువ్వే తయారు చేశావని పందెం కాస్తా.
చూడు, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదు.
నీ వికారమైన షూలను బాగు చేయనైనా చేస్తాను,
లేదా నువ్వు నా దుకాణం నుండి దొబ్బేయవచ్చు.
నువ్వు నాకు ఏదైనా చెప్పాలనుకుంటే…
ఇదే నా నెంబర్.
నిజానికి, నాకు నా షూస్ అంటే ఇష్టం.
వాటిది ఫ్రెంచి నాణ్యత.
రైడ్ ఆర్ డై
మెకాలన్ 35,
ఒకే ఒక్క ఐసు ముక్క వేస్తున్నా.
ఇలా చేయడం తప్పు, కానీ నీకు ఇలానే నచ్చుతుంది.
నిన్ను పనిలో నియమించిన సంవత్సరమే ఆ విస్కీ కొన్నాను.
ఇది నా విలువైన ఆస్తుల్లో ఒకటి.
నాకు ఫైలు ఇవ్వు.
రెడ్‌బ్యాక్ గురించిన నాకు తెలిసిన ప్రతీ విషయం ఇందులో ఉంది.
నాకు పని చేసే ఏజెంట్‌నే హత్యకు లక్ష్యంగా చేయడం ఇదే మొదటిసారి.
నువ్వు ఇది ముగించాలి.
దీన్ని పూర్తి చేయి, తర్వాత నా దగ్గరకు తిరిగిరా.
మనం, అంటే నువ్వు, నేను మళ్ళీ ఒక జట్టు అవుతాం,
లండన్‌లో నా పని పూర్తయింది, నా ముసుగు వ్యక్తి అన్నీ తెలిసిపోయాయి.
నేను మరో చోటుకు వెళ్ళిపోవాలి.
జ్యూడిత్ బర్టన్ చనిపోయింది.
మరి డెబ్బీ క్లేబార్న్?
ఆ బంధం ముగిసింది.
డేవిడ్!
ఎవరొచ్చారో చూడు!
డేవిడ్!
క్షమించు. ఇది నీకొక సర్‌ప్రైజ్‌గా ఉండాలనుకున్నా.
ఏది సర్‌ప్రైజ్?
- డెబ్బీ, హలో! - బుక్ క్లబ్? బుక్ క్లబ్‌ను ఆహ్వానించావా?
- నీకు అదంటే ఇష్టం. - నిన్ను ఇబ్బందిపెట్టాలని లేదు, బంగారం.
- బుక్ క్లబ్. - నిన్ను ఉత్సాహపరచాలని.
- నువ్వు మంచం నుండి లేవలేదు. - నువ్వింకా ఇక్కడే ఉన్నావు కనుక.
- నేను వెళ్ళడానికి అనుమతి లేదు. - జీవించడానికి నా ఇల్లు
కాకుండా మరో చోటును నువ్వు వెతుక్కుని ఉండాలి.
- "మన ఇల్లు", ఏమనుకున్నానంటే… - ఏంటి?
నీతో ఒక చోట చిక్కుకుపోతే మనం మళ్ళీ కలిసిపోతామనా?
నువ్వు చేసిన పాపాలకు ఒక పూట వంట చేయడం పరిహారం అవుతుందనా?
ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాం.
- నేను ఆ తలుపు తీయడం లేదు. - వాళ్ళు నీకోసం వచ్చారు.
ఈ కష్టాన్ని నువ్వొక్కదానివే భరించనక్కర్లేదు.
వాళ్ళు సాయం చేస్తారంటావా?
- ట్రైఫెల్. - ఇది సరైన సమయం కాదా, డెబ్బీ?
- ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాం. - అది వండాల్సిన వంటకం కాదు.
అయితే, ఎవరైనా దీని గురించి తొలిపలుకులు చెప్పాలనుకుంటున్నారా?
నాకు బుక్ క్లబ్ అంటే ఇష్టం లేదు.
ఎప్పుడూ ఇష్టపడలేదు.
నేను పుస్తకం చదవను.
మీరు ఛండాలమైన పుస్తకాలను ఎంపిక చేస్తారనుకుంటా.
సోదరుడే ఆ పని చేశాడా?
అవును.
విస్కీ తీసుకుంటున్నావా, డెబ్బీ?
నువ్వు మామూలుగా విస్కీ తాగవు.
మీకు నా గురించి ఏమీ తెలియదు.
నేను గంజాయి లాగించా.
తను ఎక్కడుంది?
వద్దు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, తను నిన్ను చూడాలనుకోవడం లేదు!
- బయటకు పో. - డెబ్బీ.
నాకు అది వినాలని లేదు.
బయటకు…
- పో. - వెళ్ళిపోతున్నా.
- నువ్వు నన్ను మళ్ళీ ఎప్పుడూ చూడవు. - మంచిది.
- కానీ నువ్వు కొన్నిటిని విని తీరాలి. - "విని తీరాలా"?
"విని తీరాలి." నిజానికి, నేను వినను.
నాకు ఇష్టంలేని ఏ పనిని నేను చేయాల్సిన పని లేదు.
నా చేతకాని భర్తనో అతను వంటింట్లో చేస్తున్న
దరిద్రపు ప్రయత్నాలనో ప్రోత్సాహించాల్సిన పని లేదు.
ఆ సోది పుస్తకం చదివినట్టు నేను నటించాల్సిన పని లేదు,
నువ్వు వేడుకుంటూ చెప్పే నీ క్షమాపణను నేను వినాల్సిన పని లేదు.
- బయటకు పో. - వెళ్ళను.
మంచిది! అయితే, నేనే వెళ్ళిపోతా.
డెబ్బీ.
డెబ్బీ.
దేవుడా.
డెబ్బీ, ఆగు! డెబ్బీ. డెబ్బీ.
ఓరి నీయబ్బా. డెబ్బీ, ఆగు!
- దొబ్బేయ్, డేవిడ్. - దొబ్బేయ్, డేవిడ్.
నువ్వు నన్ను ఎలాగూ ద్వేషిస్తోంటే, నీకు చెప్పాల్సిన కొన్ని విషయాలున్నాయి…
ఇంకా ఉన్నాయా? నాపై నీ అభిప్రాయాలు ఇంకా వినాలా?
నేను ఎలా విసుగుపుట్టించే, సగటు, మధ్య వయసు మహిళనో మరిన్ని విశేషణలు వినాలా?
నేను అబద్ధమాడాను. అవి నిన్ను రక్షించడానికి చెప్పాల్సి వచ్చింది.
ఇక నా ఉద్యోగ ఆఫర్‌ను డిలీట్ చేయడం, అది కూడా నన్ను రక్షించడానికేనా?
సరే. అవును, అది నన్ను నేను రక్షించుకోవడానికి.
నేను అప్పుడే… ఒక దారుణమైన పని చేశాను,
దాంతో నన్ను నువ్వు వదిలేసే ఆలోచనను వెంటనే భరించలేకపోయా. కనుక, అవును… చేశాను.
అవును, నేను డిలీట్ చేశాను. నన్ను నమ్ము, ఆ విషయంగా జీవితాంతం పశ్చాత్తాపపడతాను.
అది ఒక ఉద్యోగం మాత్రమే. కేవలం ఒకసారే జరిగింది.
నీకు మరెన్నో ఉద్యోగావకాశాలు వచ్చేలా చేశా.
- మెరుగైనవి. - అవి నీవల్ల వచ్చాయా?
అవును, నా వల్ల వచ్చాయి!
- వాటిలో నువ్వు ఏదీ తీసుకోలేదు! - ఎందుకంటే నేను ఆ ఉద్యోగాలకు
అర్హురాలిని కాదు, పైగా అవి వచ్చిన సమయం సరైనది కాదు.
డేవిడ్ కెరియర్ ముందుకెళుతోంది, పిల్లలు న్యూ యార్క్ వెళ్లారు.
చూశావా? ఇలాగే చెప్పుకొస్తావు!
No comments yet. Be the first to leave one.