The first 200 lines.
ద పెరిఫరల్
లండన్ 2099
నువ్వు ఎలాంటి చెత్తలోకి దిగావు, ఎలీటా?
నువ్వు నన్ను దింపిన చెత్త అంటున్నావా?
అలాంటి ప్రమాదకరమైన స్నేహితులతో స్నేహం చేస్తావని ఎవరు ఊహిస్తారు?
ఒకసారి షూస్ లేకుండా నేను ఆరు నెలలు ఉన్నాను.
గుర్తుందా?
మనిషి పాదాలు రాటుదేలి గట్టిగా మారడం లేదా మృదువుగా మారడం అద్భుతం.
తమ పరిసరాలకు అనుగుణంగా. అంటే ఆ మనిషి మనసులా.
వాటికి ఏమయిందో గుర్తుందా? నా షూస్‌కు?
వాటిని నాకు ఇచ్చావు.
నిన్ను తొలిసారి కలిసినప్పుడు, శపథం చేశా.
వీలైతే నిన్ను కాపాడుతానని.
కాపాడావు కూడా.
కాపాడానా?
ఏం చేస్తున్నావు, ఎలీటా?
ప్రపంచాన్ని కాపాడుతున్నా.
మన ప్రపంచం ఆ స్థాయిని దాటిపోయింది. నువ్వే అన్నావు.
నేను మన ప్రపంచం అని చెప్పలేదే.
ఉంటాను, వూల్ఫ్.
ఎలీటా?
ఎలీటా?
బ్లూ రిడ్జ్ పర్వతాలు
మార్నింగ్, అమ్మా.
నీ కోసం కాఫీ తెచ్చాను. జాగ్రత్త. కొంచెం వేడిగా ఉంది.
థాంక్యూ.
తీసుకో. నీకొక శాండ్విచ్ చేశా. ఫ్రిడ్జ్‌లో ఉంచాను.
బర్టన్‌కి కావాలంటే, వాడే చేసుకుంటాడు.
నిన్న నీది తిన్నాడు. మాట మార్చకు.
నాకు ఆకలి అనిపించలేదు.
నువ్వు బరువు కోల్పోకూడదు.
మళ్ళీ ఆసుపత్రిపాలు అవుతావు.
బర్టన్!
ఛత్.
బర్టన్, తలుపు తెరువు!
బర్టన్.
అమ్మ వేసుకున్న టామొసీన్ 10 ఎంజీలే ఎందుకుందో చెప్తావా?
ఇది చూసుకో. బాత్రూంకి వెళ్ళాలి.
మాత్రలు మారుస్తున్నావా?
బర్టన్, అమ్మ మాత్రలతో నీవి మారుస్తున్నావా?
దేవుడా, ఫ్లిన్. నేనలా చేస్తానని అనుకుంటున్నావా?
ఆమెకు ఉన్నది 10 ఎంజీల మాత్ర.
కేవలం ఒక్కటే ఉంది.
అంటే నువ్వు మార్చుకోవడమే కాదు, దొంగలిస్తున్నావు కూడా.
నాకు డబ్బు కావాలి.
-ఎంత? -నీ దగ్గర ఎంతుంది?
తరువాతి స్థాయికెళ్తే, వెయ్యి వస్తాయి. నువ్వూ సాయం చేయవచ్చు.
-వాటితో ఒక మాత్రే వస్తుంది. -ఒక రోజుకి సరిపోతుందిగా?
ఈ రాత్రి నాకో పెద్ద అవకాశం రాబోతోంది, మిగిలిన మాత్రలు రేపటికి వచ్చేస్తాయి.
స్థితి చెప్పు.
హెడ్‌సెట్ కనెక్ట్ అయింది
ఇంట్లో నాజీ దళముంది. పశువులపాకలో ఉన్నాం.
"మేము" అంటే?
నేను, రీస్ అలాగే కాలిఫోర్నియా నుండి ఒకడు.
20వ స్థాయి దాటడానికి తీసుకున్నాడు.
ఎప్పుడూ "నిదానం" అంటుంటాడు. అది పరమ చిరాకుగా ఉంది.
రీస్ టోపీ పెట్టుకున్నాడు.
త్వరగా! నాకు ఇప్పటికే ఆలస్యమైంది.
ఆట కొనసాగుతుంది: ఈజీ ఐస్
ఈజీ ఐస్ రీస్106 - టామ్217
మీకు అసలు కొంచమైనా--
మంచితనం లేదా?
కనీసం ఆ గొర్రెల్ని వదిలేయచ్చుగా.
నాకు నీ టోపీ నచ్చింది, రీస్. చాలా చక్కగా ఉంది.
ఫ్లిన్?
బర్టన్ ఎక్కడ?
బాత్రూమ్‌కి వెళ్ళాడు.
-దేని కోసం వెతుతుకున్నాం? -అదొక మ్యాప్ అయ్యుండాలి.
మీరు కనిపెట్టారా?
ఏం చేస్తున్నావు?
ఆ తలుపు తెరువు.
వచ్చేశాను.
ఒక నిమిషం ఆగు.
ముందుకు కదలండి!
నిదానం, బాబు.
-ఆ మ్యాప్ మీరెందుకు కనుక్కోలేదో తెలుసా? -ఎందుకు?
అదింకా రాలేదు.
నా ఫోనుకి డబ్బులు పంపు.
ఫర్వాలేదు.
రీస్!
అసలేం జరిగి చచ్చింది?
ఫ్లిన్ చేసిన పని.
ఏటీఎం - హెఫ్టీ 24 గంటల నగదు
విత్ డ్రా
జరిగే ప్రతి విత్ డ్రాయల్ ని హోంశాఖ పరిశీలిస్తుందా?
అలా చేయడం మంచిదే.
ఈ రోజుల్లో ఏదో తేడా పని చేయటానికే నగదు వాడుతున్నారు.
నీ మాటల్లో ఏదైనా ప్రశ్న దాగుందా, టామీ?
మీ అమ్మకు ఎలా ఉంది?
ఆమె బాగుంది.
అవును. అడిగినందుకు థాంక్స్.
ఇక్కడేం చేస్తున్నావు?
మేకన్, ఎడ్వర్డ్‌లు చివరికి ఏదైనా నేరం చేశారా?
ఇంకా చేయలేదు, కానీ కొంత సమయంలో చేస్తారు.
డీడీ కోసం ఒక ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను.
మా పెళ్ళి కేకుపై అలంకరణల ముద్రణకు.
నేను వెళ్ళి వారికి సాయం చేయాలేమో.
పెద్దవారి పర్యవేక్షణ లేకపోతే చెడగొడతారు.
బిల్లీ యాన్ నీ కోసం వేచి చూస్తోంది. కొన్ని నబిన్లతో.
-నిన్ను హెచ్చరిస్తున్నా. -థాంక్యూ.
ఉంటాను, టామీ.
నువ్వేమీ చెప్పలేదు కదా?
-నేను ఏం చెప్పి ఉండాలి? -ఇలా చెప్పుంటే...
ఫారెవర్ ఫాబ్ 3డీ ప్రింటింగ్
"నీలా ఉంటే ఎలా ఉంటుందా అని ఊహిస్తున్నాను,
"అలా నిలబడి ఉంటే."
ఆ తర్వాత, "కానీ ఊహించలేను. నువ్వు చాలా అందగాడివి.
"సింహం లోపల నేను ఉన్నట్టుగా ఊహించుకున్నట్టు అనిపిస్తోంది."
బిల్లీ, సింహమా?
ఏదో ఒక జంతువు.
ఆ తర్వాత, కైపుతో ఆకట్టుకునేలా,
"నీ సమయానికి విలువనిస్తావా?"
"అవును" అంటాడు, ఎందుకంటే వేరే ఏం అనగలడు?
ఇక నువ్వు, "ఈ విలువైన క్షణాలని ఇలా మాటల్లో వృధా చేయడమెందుకు..."
ఫ్లిన్? ఇక్కడ టామీ ఆర్డర్ ఉంది.
"...మనం చెమటలు పట్టిన వాటిని రుద్దుతూ..."
ఇద్దరు వరులను, ఒక వధువును ఎందుకు ఆర్డర్ చేశారంటావు?
"బిల్లీ యాన్! నబిన్ తీసుకోనా?" అని అడగొచ్చు.
నువ్వు పత్రం తప్పుగా చదవటం వల్లా?
ఛత్.
లెక్క సరిపోయింది.
"నిన్ను చూడటం బాగుంది! నబిన్స్‌కు థాంక్స్!"
నీకిది చెప్పాల్సిందే.
ఈ మూర్ఖుల సంతలో నీ నైపుణ్యాలు, వ్యక్తిత్వం వృధా అవుతున్నాయి.
15వ ప్రింటర్ ఆగింది.
ముఖ్యంగా వీడియో గేమ్స్ ఆడడం ద్వారా
తేలిగ్గా డబ్బు సంపాదించచ్చు.
ధనవంతులకు పనులు చేస్తూ బర్టన్ ఎంత సంపాదిస్తున్నాడు?
వాడి అర్హతకు మించే.
నువ్వింకా ఎక్కువ సంపాదించవచ్చు. తన అవతార్‌ని వాడితే.
నువ్వు అమ్మాయని వాళ్ళకు తెలియదు.
వాటి జోలికి ఇక వెళ్ళను, బిల్లీ యాన్. చెప్పాగా.
అవును, చెప్పావు. కానీ, ఎందుకనేది చెప్పలేదు.
ఆ చర్చకు కీలకభాగం అదే.
అది నిజం కాదు.
నచ్చినా నచ్చకపోయినా, ఇక్కడ ఉన్నదే నాకు ప్రపంచం.
అయితే,
ఆ విధంగా, నేను ఈ ప్రపంచాన్ని శుభ్రమైన ప్రదేశంగా చేయటానికి వెళ్ళే ముందు,
దీనిపై చివరిగా ఒక మాట చెప్పాలి.
జాస్పర్‌ని పెళ్ళాడే ముందు ఏ మగాడైనా
నన్ను ప్రణయపు కళ్ళతో చూసుంటే,
ఆ విషయమేంటో కనుక్కోవాలని చూసేదాన్ని.
ఎందుకంటే నువ్వు ఇందాక అన్నట్టు, జీవితం చిన్నది,
కాబట్టి పిరికితనంతో ఒక నిమిషాన్ని ఎందుకు వృధా చేయాలి?
ఇది ఒక మాటకంటే చాలా ఎక్కువే.
నీ రోజు మంచిగా గడవాలి, బుజ్జి.
ఏదైనా ధైర్యంగా చేయి, మా అందరికీ గర్వకారణంగా నిలువు.
-బై, బిల్లీ యాన్. -బై. హలో లేడీస్.
క్లీన్స్
ఛత్.
ఏంటి?
బర్టన్ ఇది ఇంటికి చేర్చమన్నాడు.
ఇదేంటి?
మనం రూపొందించిన ఉత్తమ వస్తువుల్లో ఇదొకటి.
-దీనికెలా కట్టాడు? -అతను కట్టలేదు.
మీలాగ్రోస్ కోల్డ్‌ఐరన్ అన్నది కట్టింది.
ఆ డబ్బులు మన నెల ఖర్చులకు సరిపోతాయి.
ఇదేం చేస్తుంది?
దూరం నుండే కదలికలు నియంత్రించే పరికరంలాంటిది.
అంటే, అది మా ఉత్తమ అంచనా.
మాకు తెలిసినంతలో ఇందులో సగం భాగాలకు పేటెంట్లు కూడా లేవు.
ఇది కిరాయి హంతకుల చెత్తని నా అభిప్రాయం.
-ఎక్కడ నుండి వచ్చింది? -మిలాగ్రోస్ కోల్డ్‌ఐరన్.
కొలంబియా దేశపు కంపెనీ. ఆరా తీశాం.
-ఎలాంటిది? -బొగొటాలో నమోదైన కంపెనీలాంటిది.
వాళ్ళంతే చెప్తారు, అంతకు మించి చెప్పి చావరు.
బర్టన్ ముఠాకు పనిచేస్తున్నాడా?
నోర్ముయ్.
వాడు దీనికి ఏమీ చెల్లించలేదని మీరిద్దరు కచ్చితంగా...
-చెబుతున్నారా? -పైసా కూడా కట్టలేదు.
దీని కోసం నువ్వు స్కాన్ చేయాలి.
ఆగు. నిజంగానా?
తప్పుగా అనుకోకు. కస్టమర్ ఆధీన ఆధారాలు కోరుకున్నాడు.
అమ్మ మాత్రల గురించి పనికొచ్చే విషయం చెబుతావా?
చెప్పు. నీకు తెలుసుకోవాలని ఉందని నాకు తెలుసు.
ఏంటి?
ఇదేంటో అడుగు.
చివరిసారిగా ఈ కిటుకు నాపై ఎప్పుడు పని చేసింది?
నా దృష్టి మళ్ళించడానికి బొమ్మని ఇవ్వడం?
ఆశ్చర్యపోతావు. ఇది పని చేస్తే, అలా చేస్తున్నట్టు కూడా నీకు తెలియదు.
అదే కీలకమైన విషయం.
ఇది వింతగా ఉంది.
ఈ వెండి ముళ్ళన్నీ దేని కోసం?
స్క్రీన్ కూడా లేదు.
అత్యాధునిక వీఆర్, ఫ్లిన్.
దీని మాదిరి పరీక్షను నన్ను చేయమంటున్నారు, భారీ మొత్తానికి.
నెలల ఖర్చుకు ఢోకా ఉండదు.
నువ్వే ఎందుకు?
హాల్సియోన్ ఆటలో 100వ స్థాయి దాటిన కొంతమంది ఆటగాళ్ళలో నేను ఒకడిని.
ఏంటి, నువ్వు అగ్ని గుహలున్న 83వ స్థాయే దాటలేదు.
నిజమే, కానీ వేరెవరో నా అవతార్‌ని వాడారు. ఈజీ ఐస్ పేరుతోో ఆడారు.
ఆమె ఏకంగా 107వ స్థాయికే చేరుకుంది.
నావల్ల కాదు, బర్టన్.
సమయం లేదు. భోజనం సిద్ధం చేయాలి.
అమ్మకు టామొసీన్ కొనడానికున్న మార్గం ఇదే.
ఇందులో నీకున్న ప్రతిభకు గర్విస్తున్నాని తెలుసుగా.
నోర్ముయ్. నీది చెత్త వాగుడు,
నిన్ను నువ్వు ఎలా భరిస్తున్నావో ఏంటో.
నాకు తెలుసు. కానీ ఇది నిజం.
నేను గర్విస్తున్నా.
No comments yet. Be the first to leave one.