The first 200 lines.
సిఐఎ యొక్క నిర్బంధ మరియు విచారణ ప్రోగ్రామ్
యొక్క సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ అధ్యయనం ఆధారంగా
ఈ ప్రాజెక్ట్ లో నువ్వు ఎంత కాలంగా పని చేస్తున్నావు, డాన్?
ఐదు సంవత్సరాలు.
ఐదు. వావ్.
ప్రతి రోజూ? రాత్రులు, వారాంతాలు?
నేను ఇందులో చాలా మునిగిపోయాను.
నీకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా, డాన్? కుటుంబం?
నువ్వెవరో బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, అంతే.
నేను ఇక్కడ మొదలు పెట్టినప్పుడు, ఒకరిని కలిసాను, కానీ మీకు తెలుసు కదా,
ఈ పని స్వభావం మరియు ఈ పని గంటలు...
నేనొక మంచి భాగస్వామిని కాదు.
ఐదేళ్ళు, అదంతా చెరిగిపోవచ్చు.
ఈ ఆరోపణల ముసుగులో అదంతా మాయమైపోతుంది.
నీలాంటి ఒక పట్టుదల కల యువకుడు,
ఒక భయంకరమైన సంఘటనలో తలమునకలై కొన్నేళ్ళు గడిపిన తరువాత,
ఈ ప్రక్రియతో విసిగిపోయి, నిజాన్ని వేగంగా బయటకు తీసుకురావడానికి
ఒక అవకాశం కనిపిస్తే, బహుశా గీత దాటతాడని నేను ఊహించగలను.
నువ్వు భాగంగా ఉన్నవాటిలో ఇది అత్యంత ముఖ్యమైన విషయం
- అని నేను ఊహిస్తున్నాను. - నేనిది చేయలేదు.
లేదా అంతే పట్టుదలకల సెనేటర్ నిన్నిలాంటిది చేయమని ప్రోత్సహించడాన్ని ఊహించుకోగలను.
నువ్వు నాకు చెప్పడానికి ఇదే మంచి సమయం.
అది అలా జరగలేదు. నేను చేసింది, నేను సొంతంగా చేసాను.
నేను ఒంటరిగా పని చేసాను.
నువ్వు ఎప్పుడైనా పడుకుంటావా, మిత్రమా?
పడుకునే వాడిని. అది పనికి అడ్డం వచ్చింది.
ఆ బ్యాగులో ఉన్న దేనిలోనైనా
సిఐఎ ఆఫీసర్లు, ఆసెట్లు లేదా భాగస్వాముల అసలు పేర్లు,
లేదా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మరియు యునైటెడ్ స్టేట్స్ సెనేట్
మధ్య ఉన్న ఒపందాన్ని ఉల్లఘించే
సమాచారం ఏమైనా ఉందా?
- గుడ్ నైట్, జే. - నీకు కూడా, డాన్.
- అయితే, నువ్వా పత్రం దొంగిలించావా? - దొంగిలించలేదు. ఇంకొకచోటుకి మార్చాను.
ప్రతివారికీ వారి సొంత పదాలు ఉంటాయి. భాష అనేది పక్షం వహించటానికి సృష్టించబడింది.
ఇప్పుడు, నువ్వు దాని చోటు ఎందుకు మార్చావు?
వారు నిన్ను జైలుకు పంపగలరు, డాన్.
నేను ప్రారంభం నుండి మొదలు పెట్టాలనుకుంటాను.
సెనేటర్లు మాత్రమే
- మీరు డాన్ జోన్సా? - అవును.
- డెనిస్ మెక్ డోనాగ్. - హాయ్.
- నన్ను కలుస్తున్నందుకు ధన్యవాదాలు. - లోపలికి రా, అవును. తప్పకుండా.
వచ్చినందుకు ధన్యవాదాలు. నాకు నీ కథ చెప్పు.
సెప్టెంబర్ 11, గ్రాడ్ స్కూల్ లో నా రెండవ రోజు.
ఒక లెక్చర్ కి వెళ్ళాను, అంతే... అంతా ఆగిపోయింది.
తరువాతి రోజు, నేను నా క్లాసులన్నీ జాతీయ భద్రతకు మార్చుకున్నాను.
మంచి వాడివి.
అయితే, నీ దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటి? పదేళ్ళ తరువాత నిన్ను నువ్వు ఎక్కడ చూసుకుంటావు?
నువ్వు ఆఫీసుకు పోటీ చేస్తున్నావా?
లేదు, లేదు. రాజకీయాలు నాకు చేతకావు.
నేను తెర వెనుక బాగా ప్రభావవంతంగా ఉంటాను,
అక్కడ నేను మంచి తేడా చూపించగలను.
అయితే, హార్వార్డ్ కి ముందు సంగతి ఏంటి? అప్పుడు నీ రోజులతో ఏం చేసేవాడివి?
బాల్టిమోర్ లో టీచ్ ఫర్ అమెరికాకి మూడేళ్ళు పని చేసాను. ఏడో తరగతి విద్యార్ధులకి.
నువ్వు సెయింట్ పాల్, మినెసోటాలో హై స్కూల్ స్పానిష్ నేర్పించావని చదివాను?
ఎల్.బి.జె మొదటి ఉద్యోగం సౌత్ టెక్సాస్ లోని మెక్సికన్ స్కూల్ లో చదువు చెప్పడం.
పిల్లలతో వ్యవహరించడం తెలిస్తే,
హిల్ లో పని చేసేటప్పుడు అది ఒక మంచి నైపుణ్యం అవుతుంది.
కానీ సెనేట్ సిబ్బందిగా, నా దృష్టిలో,
నేనైతే ఇక్కడ కాస్త పరిస్థితులు మారే దాకా ఆగుతాను.
సెనేటర్ డాషిల్ కూడా అదే అంటారని అనుకుంటాను.
కౌంటర్ టెర్రరిజంలో, విదేశాంగ విధానంలో...
కొంత వాస్తవ ప్రపంచ అనుభవాన్ని పొందు.
సిఐఎలో, ఎఫ్.బి.ఐలో ప్రయత్నించు.
ఒక తరగతి గదిలో బోధించని దానిని వారు నీకు నేర్పించేలా చెయ్యి.
తరువాత నువ్వు ఇక్కడికి వచ్చి...
బుష్, చేనీ పాడు చేసిన వాటిని సరి చేయడానికి సహాయం చెయ్యి.
మెక్ డోనాగ్.
అవును, సెనేటర్, ఒక్క క్షణం.
బాస్. ఇదుగో.
కలుస్తూ ఉండు, సరేనా?
- మీ సమయానికి ధన్యవాదాలు. - తప్పకుండా.
ఇప్పుడు నా దగ్గర ఆ సమాచారం లేదు,
కానీ నేను మీకు ఆ సమాచారాన్ని 15 నిమిషాల్లో ఇవ్వగలను.
అవును.
జర్మనీలో బాంబు కుట్రలకు సంబంధించి,
1,500 పౌండ్ల హైడ్రోజెన్ పెరాక్సైడ్ మరియు మిలిటరీ శ్రేణి డెటోనేటర్లను
కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను మెడెబాక్ లో అరెస్టు చేసారు.
సిఐఎ ఇస్లామిక్ జిహాద్ యూనియన్ ను అనుమానిస్తోంది...
ఎక్స్క్యూజ్ మి.
నీతో ఒక నిమిషం మాట్లాడచ్చా, డాన్? సెనేటర్ నిన్ను కలవాలనుకుంటున్నారు.
అలాగే, తప్పకుండా.
సెనేటర్ డయేన్ ఫైన్ స్టైన్ కాలిఫోర్నియా
- గుడ్ మార్నింగ్, డాన్. - గుడ్ మార్నింగ్, సెనేటర్.
ది న్యూ యార్క్ టైమ్స్ లో నేటి కథను చదివావా?
లేదు, నేను చదవలేదు, సెనేటర్.
ఆల్-ఖైదా నిర్బంధితుల విచారణల టేపులను సిఐఎ నాశనం చేసిందట.
ఇంటెల్ కమిటీకి టేపులు ఉన్నాయని తెలుసా?
లేదు. నేను దీని గురించి వినడం ఇదే మొదటిసారి.
అందుకని నాకు టేపులలో ఏముందో,
వాటిని ఎందుకు నాశనం చేసారో తెలుసుకోవాలని ఉంది.
నువ్వు ఈ దర్యాప్తుకు నాయకత్వం వహించాలని అనుకుంటున్నాము, డాన్.
కానీ ఆ టేపులు నాశనం అయితే, మనం ఎలా...
వారి వద్ద రాసిన రికార్డులు ఉన్నాయని అంటున్నారు.
వేల కొద్దీ పేజీలు. అది చూద్దాము.
వారి వద్ద అసలు ఏం ఉన్నాయో నువ్వు తెలుసుకోవాలి
ఇంకా దానిలోని ప్రతి పదాన్ని చదవాలి.
సిఐఎ నాశనం చేసిన ఈ టేపుల గురించి నివేదికను
- తయారు చేయడానికి రెండేళ్ళు పట్టింది. - ధన్యవాదాలు.
కనుగొన్నవి చాలా ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి...
ఇంటలిజెన్స్ మీద సెనేట్ సెలెక్ట్ కమిటీ
కానీ అది రహస్యంగానే ఉంచబడుతుంది.
ఈ వెల్లడుల ఆధారంగా,
పూర్తి సిఐఎ యొక్క నిర్బంధ మరియు విచారణ కార్యక్రమం గురించి
స్పష్టంగా ఒక పెద్ద అధ్యయనం అవసరం ఉంది.
అందుకు అంగీకరించే వారు, "అవును" అనండి.
- మిస్టర్ వైట్ హౌస్? - అవును.
- మిస్టర్ బర్? - అవును.
- మిస్టర్ రాకెఫెల్లర్? - అవును.
మిస్టర్ చాంబ్లిస్?
- కాదు. - మిస్టర్ రిష్?
ఇది సమయం వృధా అని అనుకుంటాను.
మీరు దీనికి వ్యతిరేకంగా వోటు చేసారని నాకు తెలుసు, సాక్స్బీ...
కానీ ఇప్పటికే మీకు మీ టేపుల దర్యాప్తు పూర్తయ్యింది.
అవును, కానీ మనలో మిగతావారందరూ 14 కి ఒకటితో ముందుకు వెళదామని వోటు చేసారు.
పర్యవేక్షణ అందించడం మన బాధ్యత.
ప్రచార సమయంలో అంతా అభ్యర్ధి ఒబామా తాను ఎలా
మొట్ట మొదటి పక్షపాత రహిత అభ్యర్ధి కావలనుకున్నారో చెప్పారు.
సాక్స్బీ, మీకు నా గురించి తెలుసు. ఈ నివేదిక కేవలం డెమొక్రాట్ల నుంచే కాకుండా
పూర్తి ఇంటలిజెన్స్ సమాజం నుంచి వచ్చేలా
చూడడం నా ఉద్దేశ్యం.
అయితే, దీనికి నేతృ త్వం ఎవరు వహిస్తారు?
నేను డాన్ జోన్స్ అనుకుంటున్నాను.
అతను ఎఫ్.బి.ఐలో, నాలుగేళ్ళు కౌంటర్ టెర్రరిజంలో పనిచేసాడు.
అతనికి ఇప్పటికే భద్రతా అనుమతులు ఉన్నాయి.
దీని నియమాలు టేపుల దర్యాప్తు నియమాలలాంటివే.
రాజకీయాలు ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు,
సెనేటర్ కి అభిప్రాయలు లేదా కథనాల మీద ఆసక్తి లేదు, కావలసింది కేవలం నిజాలు.
ఇప్పటిక్ర్ నువ్వు కనుగొన్నదానిని బట్టి, ఇది చాలా దారుణమైన వాటికి దారి తీయవచ్చు.
నువ్వు నీ వ్యక్తిగత భావాలను దీని నుండి దూరంగా ఉంచాలి.
రిపబ్లికన్లు చూసే మొదటి విషయం అదే అవుతుంది.
ప్రెస్ తో లేదా నీ ప్రేమికురాలితో లేదా నీ కుటుంబ సభ్యులతో మాట్లాడకూడదు.
కమిటీ బయట ఎవరితోనూ మాట్లాడకూడదు.
నీకు ఆరుగురి టీము ఇవ్వబడుతుంది - ముగ్గురు రిపబ్లికన్లు, ముగ్గురు డెమోక్రాట్లు...
కానీ అందులో ఎటువంటి రిపబ్లికన్ వాక్యాలు
డెమొక్రాట్ వాక్యాలు ఉండకూడదు.
మాకు ఇచ్చే సమయం ఎంత?
మీరు దీనిని సుమారు ఒక సంవత్సరంలో పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము.
మీరు చేస్తున్న పని గురించి సెనేటర్ కి ఎప్పటికప్పుడు తెలియజేయాలి.
ఎవరికీ ఆశ్చర్యాలు నచ్చవు.
వర్జీనియాలో ఒక రహస్య సిఐఎ ఆఫ్-సైట్ ఉంది. మీరు రేపటి నుంచి పని మొదలుపెడతారు.
- జోన్స్, కదా? - షాన్.
- హాయ్. నేను డాన్. - నేను ఏజెన్సీ నుంచి షాన్ మర్ఫీ.
- మనం లోపలికి వెళదాము. - సరే.
మీ గుర్తింపు, జెంటిల్మెన్.
మేము కేటాయించిన ఈ గది ఒక ఎస్.సి.ఐ.ఎఫ్.
ఇక్కడ ఫోన్లు కలవవు, ఫోటోలు తీయకూడదు. మీకు నియమాలు తెలుసు కదా. మాట బయటకు వెళ్ళకూడదు.
ఒప్పందం ప్రకారం, ఈ గదిలోకి
కమిటీ సిబ్బందికి తప్ప మరెవరికీ అనుమతి లేదు.
కచ్చితంగా. మీ అనుమతి లేకుండా ఎవరూ లోపలి రారు.
- మరి కంప్యూటర్లు? - ఇక్కడే ఉన్నాయి.
మీకే పని చేసే ఒక సర్వర్, ఎయిర్-గ్యాప్ ఉన్న పని కేంద్రాలు.
పని చేసుకుంటూ వెళుతూ, డేటాబేసులను అప్డేట్ చేస్తూ ఉంటాము.
ఏజెన్సీ నుంచి అందుకున్న ఫైల్స్ ఇక్కడ లోడ్ చేయబడతాయి.
మంచిది. మాకు సంబంధిత పత్రాలన్నీ వీలయినంత తొందరగా కావాలి.
- మేము ముందు వాటిని తనిఖీ చేయాలి. - తనిఖీనా?
అక్కడ చాలా...
డైరెక్టర్ పనెట్టా ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రతిదీ ఇవ్వడానికి అంగీకరించారు.
దానిని ఎవరు తనిఖీ చేస్తారు?
ఇది చాలా పెద్ద ఏజెన్సీ.
మీరు చూడకూడనిది మీ చేతులలోకి రాకూడదని మేము నిర్ధారించుకోవాలి.
యునైటెడ్ స్టేట్స్ సెనేట్ ఇంటలిజెన్స్ కమిటీ సిబ్బంది మాత్రమే
సౌకర్యంగా ఉండండి.
ఇక్కడ... ప్రింటర్ లేదా?
పేపర్ లేదు.
సిఐఎ అనుమతి లేకుండా ఎటువంటి పత్రాలు ఈ గదిని దాటి బయటకు వెళ్ళకూడదు.
మా ఆఫీసులో పేపర్ ప్రజలకు సమస్యలను సృష్టిస్తుంది.
మాకు ఏదో ఒక సమయంలో ప్రింటర్ కావాల్సి ఉంటుంది.
ఇంకా పేపర్ కూడా.
ఆఫీసులో...
పేపర్ ద్వారానే మేము చట్టాలను ఆచరిస్తాము.
సరే.
"సెప్టెంబర్ 11" "ఆల్-మిధార్"
అత్యంత రహస్య సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ
ఆల్-ఖైదా - ఇద్దరు అనుమానిత హైజాకర్లు మలేసియా సమావేశం
వర్ల్డ్ ట్రేడ్ సెంటర్
...అందుకున్న ప్రాధమిక సమాచారం ప్రకారం దీనిని స్పష్టంగా...
11 సెప్టెంబర్ 2001 కౌంటర్ టెర్రరిజం సెంటర్
...ఒక ఉగ్రవాద దాడిగా పేర్కొంటున్నారు.
ఇంటలిజెన్స్ అధికారులు అందుకుంటున్న సమాచారం...
నీకిది నచ్చదు.
...ప్రకారం ఒక హైజాక్ చేయబడిన విమానం,
మరియు ఆ విమానం యొక్క భయంకరమైన వీడియో...
మనం కొన్ని పేర్లను ధృవీకరించాము.
హైజాకర్లవా?
మలేసియా సమావేశాల నుండి ఇద్దరు వ్యక్తులు.
సాన్ డియాగో వ్యక్తులు. వారు ఫ్లైట్ 77 ను కూల్చేశారు. పెంటగాన్.
...రెండు విమానాలు ఆ టవర్లను గుద్దేలా చేయడానికి
చేసిన సమన్వయం...
అందరూ దయచేసి వినండి.
కౌంటర్ టెర్రరిజం సెంటర్ ఒక సంభావ్య టార్గెట్
అని నమ్మే సమాచారం లభించింది.
మేము సిబ్బంది అందరినీ వెంటనే ఖాళీ చేసి వెళ్ళమని అడుగుతున్నాము.
నేను పెంటగాన్ నుంచి జిమ్ మిక్లాజేవ్స్కి.
అవును, ప్రెసిడెంట్ కి మిలిటరీ బలగాన్ని పంపించడానికి అధికారం ఉంది,
కానీ ఈ కేసులో, స్పష్టంగా,
ఇది కనుక ఒక ఉగ్రవాద దాడి అయితే,
దీనికి ప్రతిదాడి ఆలోచించబడుతుంది.
మనం ఒక విధంగా పని చేయాలి, చీకటి కోణంలో, మీరు కనుక ఒప్పుకుంటే.
సిఐఎ క్వార్టర్స్ సెప్టెంబర్ 16, 2001
మనం ఇంటలిజెన్స్ ప్రపంచంలో నీడల్లో సమయం గడపాల్సి ఉంటాము.
No comments yet. Be the first to leave one.