Dungeons & Dragons: Honor Among Thieves

Dungeons & Dragons: Honor Among Thieves

Download Telugu Subtitle

Release info

Dungeons & Dragons Honor Among Thieves 2023 1080p AMZN WEB-DL DDP5 1 H 264-Kitsune
A Commentary by sub.Trader
అనువాద కర్త అలేఖ్య

Tags

Web-DL
web-dl
web
WEB-DL
1080
TS
Published on: 2023-05-02
Downloads: 51
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

వచ్చేస్తున్నారు!

సిద్దంగా ఉండండి.

మరో ఇద్దరు ఖైదీలు వస్తున్నారు!

లింక్ చేయడానికి సిద్ధం చేయండి!

సక్రమమైన స్థానంలో ఉంది!

మెల్లగా!

ద్వారం సురక్షితంగా ఉంది!

ఖైదీ నడుస్తున్నాడు!

సూపర్. ఇంకో ఖైదీ.

తప్పుగా అనుకోకు, గురూ. నువ్వు భలే ఉన్నావు.

నీకు అంతా పరిచయం చెస్తా ఆగు. నీకు కొత్త అనిపించకుండా చేస్తా.

ఈ బకెట్ లో మనం ఒంటేలు పోస్తాం, అది గడ్డకట్టుకుపోతుంది, ఇంకా…

హా, అదే.

నీ పేరేంటి, పాపా?

తన పేరు హోల్గ. నా పేరు ఎడిన్. మరి నీ పేరేంటి?

నేను చాలా జైళ్ళలో ఉన్నా కానీ, ఒక మహిళతో కలిసి ఉండటం ఇదే తొలిసారి.

ఈ అనుభవం రంజుగా ఉంటుంది అనుకుంటా.

నాదొక సలహా,

హోల్గ ఆలుదుంపలను తినేటప్పుడు ఎవరైనా ఆటంకం కలిగిస్తే, తనకి నచ్చదు.

-తనకి చిర్రెత్తుకొస్తుంది. -నువ్వు మూసుకో!

నీ ఇష్టం. పండగ చేస్కో.

సిగ్గా?

ఒకసారి నా గురించి తెలిశాక, నేనెంత పిస్తానో నీకు తెలిసిపోతుంది.

అలా ఉండకు.

మనం ఆనందంగా…

దీనికి వేళ్లు పెట్టుకొనేలా విడివిడిగా చేయకుండా మిట్టెన్ లా ఉపయోగించేసుకుంటాలే.

అయినా, ఇక్కడ బిల్డప్ ఇచ్చి వృథాలే!

డబ్బలు పెద్దగా లేవు, తలరాత మారలేదు

కానీ మందు కోసం ఎగబడదాం

సీసాని దింపకుండా తాగేసి

పీకల్లోతు దాకా తాగి పడిపోదాం

పాట ఆపు!

అలాగే, టోబయస్.

అబ్సోలుషన్ కౌన్సిల్ సమావేశమయ్యేది రేపే.

ఆశలు పెంచుకోకు, ఎడ్.

ఎందుకలా మాట్లాడతావు?

ఈసారి కౌన్సిల్ లో జర్నాథన్ కూడా ఉంటాడు. అతను ఆరాకోక్రా జాతికి చెందినవాడు.

మనల్ని విడుదల చేస్తే, అది అతనే చేయాలి.

అది జరగని పని.

ఒక విషయం చెప్తా విను, హోల్గ, ఈ ఐసును మనం రేపటి నుండి కొట్టం చూడు.

ప్రభువు కుదిర్చిన కూటమికి ఉన్న అధికారం చేత,

ఈ అబ్సోలుషన్ కౌన్సిల్ ఇప్పుడు

ఎడిన్ డార్విస్, ఇంకా హోల్గ కిల్గోరే కెసు విచారణ చేపడుతోంది.`

దొంగతనం, ఇంకా అవినీతి కార్యకలాపాలకు పాల్పడినందుకు

వీళ్లు రెండవ సంవత్సరం శిక్షను అనుభవిస్తున్నారు.

మీకు క్షమాభిక్ష ప్రసాదించవచ్చో, లేదో నిర్ణయించే బాధ్యత ఈ కౌన్సిల్ కి ఉంది.

మరి నువ్వేమటావు?

థ్యాంక్యూ, ఛాన్సలర్ ఆండర్టన్, ఇంకా కౌన్సిల్ లో ఉండే గౌరవనీయ సభ్యులకు కూడా థ్యాంక్యూ.

మొదలుపెడతాను కానీ, ఛాన్సలర్ జర్నాథన్ వచ్చినట్టు కనబడట్లేదు.

మనం ఆయన కోసం వేచి ఉందామా?

తుఫాను కారణంగా ఆయనకు ఆలస్యమవుతోంది. నువ్వు మొదలుపెట్టవచ్చు.

సరే. కానీ విషయం ఏంటంటే…

ఆయన వస్తాడని మేము కోటి ఆశలు పెట్టుకున్నాం.

చెప్పు, లేకపోతే అవతలకి పో.

సరే మరి.

ముందుగా నేను మీకు సందర్భాన్ని కూడా తెలపాలి.

నేను మొదట్నుంచీ దొంగను కాదు, ఆ విషయం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు.

చాలా ఏళ్ల క్రితం, నేను హార్పర్స్ బృందంలో సభ్యుడిని అయ్యాను,

నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడలని, అలాగే అణగారిన వర్గం తరఫున పోరాడి,

బదులుగా ఏమీ ఆశించకూడదు అని ప్రమాణం చేసే గూఢచారుల బృందం అది.

నా భార్య జియా, నా నిర్ణయాన్ని స్వాగతించింది, తనకి అందులోని ప్రమాదాలు తెలిసి ఉండి కూడా.

పగలు, నేను దురాగంతకుల మాటలను చాటుగా వినేవాడిని,

దొంగలను అడ్డుకొనేవాడిని…

థాయన్ రెడ్ విజార్డ్ శిక్ష పడేలా కూడా చేసేవాడిని.

రాత్రయ్యేసరికి, నా ప్రాణమైన నా భార్య, ఇంకా కూతురు కిరా చెంతకు చేరుకొనేవాడిని.

నిజం చెప్పాలంటే, అప్పుడప్పుడూ నేను పునరాలోచనలో పడిపోయేవాడిని,

నా ప్రమాణంలోని "బదులుగా ఏమీ ఆశించకూడదు" అనేది ఎంత వరకు సరైన పని అని.

కానీ నా భార్య ఎప్పుడూ అనేది,

"నువ్వు మాకు ఏమీ ఇవ్వనవసరం లేదు, మాకు నువ్వు ఉంటే చాలు," అని.

మరి జర్నాథన్ ఎక్కడ ఉన్నాడో చెప్పగలరా?

దగ్గర్లోనే ఉన్నాడా? అతడిని చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంది.

మేము చెప్పింది నీకు వినిపించలేదా?

హా, తుఫాను. కానీ విషయం ఏంటంటే, జర్నాథన్ గురించి నాకు తెలిసిన దాన్ని బట్టి,

నా కథ పట్ల ఆయన సానుభూతి చూపగలడు అని నా ఆశ.

మళ్లీ ఇక్కడికి రావడానికి ఇంకో సంవత్సరం ఆగాలంటే చిరాగ్గా అనిపిస్తుంది, అదీ గాక…

సోది ఆపి, విషయం చెప్పు.

తప్పకుండా. చెప్తున్నా మరి.

హార్పర్ బృందంలో ఉన్నామంటే, మనకు శత్రువులు తప్పక తయారవుతారు.

ఒక్కోసారి ఆ శత్రువులు పగబడతారు.

రెడ్ విజార్డ్ ల కత్తికి బలి అయితే, ఎంత గొప్ప మత గురువు అయినా ఏం చేయలేడు.

తనకి మళ్లీ ప్రాణం పోయగల అవకాశమే లేదు.

జియాతో పాటే, నా ప్రమాణంపై నాకున్న నమ్మకమూ చనిపోయింది.

మన్నించాలి, కానీ జర్నాథన్ లేకుండా…

ఇవన్నీ చెప్పడం కొంచెం కష్టంగా ఉంది.

మళ్లీ మొదలుపెడుతున్నావా?

కానీ అతను నా ఫ్లాష్ బ్యాక్ లోని ముఖ్యమైన భాగాన్ని అతను మిస్ అవుతాడు.

నేనెందుకు ఇలా అయ్యానో ఆయనకి తెలీకపోతే నాకు సరైన తీర్పు ఆయన ఎలా ఇవ్వగలరు?

జర్నాథన్ లేకుండా నీ కేసును విచారించే సమర్థత మాకు ఉంది.

-ఇక నువ్వు చెప్పడం కొనసాగించు! -సరే. నేను ఎక్కడిదాకా చెప్పాను?

రాత్రయ్యేసరికి, నా ప్రాణమైన నా భార్య, ఇంకా కూతురు కిరా చెంతకు చేరుకొనేవాడిని.

నువ్వు చాలా వెనక్కి వెళ్లిపోయావు. సమయం వృథా చేయకు!

హా, సారీ. ముఖ్యమైన విషయం కదా.

తర్వాతి కొన్ని నెలలు చాలా చండాలంగా బతికాను.

అప్పుడే నేను హోల్గని కలిశా.

తను నాపై జాలి చూపింది.

నిజానికి, తను బిడ్డపై జాలి చూపింది.

తను కూడా నాలానే దుర్దశను అనుభవించింది.

చాలా ఏళ్ల క్రితం, బయటివాడితో ప్రేమలో పడింది అని

తన తెగ నుండి తనని వెలివేసేశారు.

వేగంగానే మేము అన్నాచెల్లెళ్లం అయిపోయాం.

మా బంధం నమ్మకం, ఇంకా పరస్పర గౌరవం ఆధారంగా ఏర్పడింది.

మా ఇద్దరి వద్దా డబ్బులు లేవు, సంపాదించడానికి సక్రమమైన మార్గాలు కూడా లేవు,

కాబట్టి "నిజాయితీ"ని పక్కకు పెట్టేసి, మేము కొత్త దాన్ని ప్రయత్నించాలనుకున్నాం.

మన చిరకాల స్వప్నం సాకారమవ్వకుండా

మనకు అడ్డుగా ఉండేది, ఒక చిన్న గీతే అని మనం గ్రహించాక

అది మనల్ని ఓ మత్తులో ముంచేస్తుంది.

ఇంట్లో చిన్న పాపని పెట్టుకొని, ఈ నేరాలకు ఎలా పాల్పడగలిగారని

మీరు మమ్మల్ని అడగవచ్చు.

మేము తనని ఇంట్లో వదిలిపెట్టలేదు.

త్వరగా! పరుగెత్తు, పరుగెత్తు!

మా బృందంలో చేరింది కిరా మాత్రమే కాదు. సైమన్ అనే ఒక సాదాసీదా మాంత్రికుడు,

ఇంకా ఫోర్జ్ అనే ఒక మాయగాడు మా బృందంలో చేరారు, ఇతను మమ్మల్ని ఇంకా పేట్రేగిపొమ్మని ప్రోత్సహించేవాడు.

కొంత కాలానికే మేము మంచి జట్టు అయ్యాం.

హా, మేము దొంగలమే, కానీ ఒక పద్ధతి ఉండేలా నేను చూసుకున్నాను.

మేము ఎప్పుడూ ఎవరికీ హాని తలపెట్టలేదు.

ఇంకా, వీళ్ల దగ్గర దోచుకున్నా వీళ్లకొచ్చే నష్టం ఉండదు అని మాకు అనిపించినవాళ్ల దగ్గరే మేము దోచుకున్నాం.

కానీ సొఫినా అనే మంత్రగత్తె మాకు పరిచయమైనప్పుడు, అంతా మారిపోయింది.

మాకు తన గురించి ఏమీ తెలీదు.

కోరిన్స్ కీప్ ని దోచుకోవడానికి, తనకి మా సాయం అవసరమైంది, అదే మాకు తెలుసు.

అది హార్పర్ల ముఖ్యమైన ప్రదేశం. మీకు దాని గురించి తెలుసో లేదో.

కానీ జర్నాథన్ కి మాత్రం బాగా తెలుసు.

ఆ ప్రదేశమంతా, చెడ్డవాళ్ల నుండి చేజిక్కించుకున్న గొప్ప గొప్ప కళాఖండాలతో నిండి ఉంటుంది,

ఆ ప్రదేశానికి కేవలం హార్పర్లకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.

అందుకే సొఫినా మా సాయం కోరింది.

మొదట నేను దానికి ఒప్పుకోలేదు. అంత దిగజారడానికి నా మనస్సు ఒప్పుకోలేదు.

కానీ ఫోర్జ్ నాకు ఒక విషయం చెప్పాడు, కోరిన్స్ కీప్ లో ఉండే కళాఖండాలలో

పునరుజ్జీవం యొక్క మాత్రా అనేది ఒకటుందట,

అది చనిపోయినవారిని బతికిస్తుందని చెప్పాడు.

రెడ్ విజార్డ్ ల కత్తికి బలైనవారిని కూడా.

ఇది ఎటు వెళ్తోందో మీకు అర్థమయ్యే ఉంటుంది.

-నన్నెందుకు వద్దు అంటున్నావు? -సారి, కిర్, ఇది చాలా ప్రమాదకరమైనది.

అయితే నువ్వు కూడా వెళ్లకూడదు.

మనకి కావలసినవన్నీ ఉన్నాయి కదా.

పూర్తిగా లేవు. కానీ ఇదే ఆఖరిది.

నా మీద నమ్మకం ఉంచు.

కంగారుపడకు. మేము త్వరలోనే వచ్చేస్తాం.

నేను ఆ కళాఖండం గురించి తనకి చెప్పలేదు.

ఏదైనా జరగరానిది జరిగితే, తను కుదేలైపోతుంది.

కానీ చివరికి

జరగరానిదే జరిగింది.

త్వరలోనే మళ్లీ ఏకమవుతాం, బంగారం.

దొంగలు!

అక్కడున్నారు!

మేము ఎవరికీ హాని తలపెట్టం.

తను టైమ్ స్టాప్ లో ఇరుక్కుపోయింది! దానికి విరుగుడు మంత్రం వేయ్, సైమన్!

నా వల్ల కావట్లేదు. సోఫినా చాలా శక్తివంతమైనది.

కళాకండాన్ని తీసుకో. కిరా జాగ్రత్త.

నేను నీకు మాట ఇస్తున్నా.

నిజం ఏంటంటే, ఈ కౌన్సిల్నా కు ఇంకో రెండేళ్లు శిక్ష ఇచ్చినా,

ఇరవై ఏళ్లు ఇచ్చినా,

నేను చేసిన ఘోరాతి ఘోరమైన నేరానికి, ఏ శిక్షా సరిపోదు…

కూతురికి దూరంగా ఉంటున్నాననే నేరానికి.

కానీ ఒక విషయం చెప్తున్నాను, నన్ను విడుదల చేయాలని మీరనుకుంటే,

నేను చేసిన ఆ తప్పును సరిదిద్దుకోవడానికే నా తక్కిన జీవితం అంకితం చేస్తాను.

ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా?

ఏం లేదు.

మీ నిర్ణయాన్ని మీరు చెప్పే ముందు, దయచేసి మీరు ఆగండి కాస్త…

-జర్నాథన్! -ఆలస్యమైనందుకు క్షమించాలి.

నిన్ను చూస్తున్నందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను!

-హొల్గ, ఇప్పుడే! -గార్డులారా!

నన్ను వదలండి, సర్!

తను ఆలుగడ్డలు విసిరేస్తోంది!

ఓహ్, జర్నాథన్!

కానీ మేము నీకు క్షమాభిక్ష ప్రసాదించాం!

ఎగరవే పక్షి, ఎగురు!

ఇతనికి శ్వాస ఆడుతోంది.

మనల్ని బయట పడేస్తాడని చెప్పా కదా!

డంజన్స్ & డ్రాగన్స్ హానర్ అమాంగ్ తీస్స్

కిరా ఉందా?

చాలా కాలంగా ఇది ఖాళీగా ఉంది.

తనని ఫోర్జ్ ఎక్కడికి తీసుకెళ్లుండంటావు?

స్వోర్డ్ కోస్ట్ ని అతను వదిలిపెట్టి వెళ్ళడు అనిపిస్తోంది. ఫోర్జ్ కి నగరాలంటే చాలా ఇష్టం.

మీకు, మీ భార్యకు మంచి ఆహారం ఇమ్మంటారా?

-ఏంటి? కాదు. -ఇతను నాకు భర్తనా?

-ఆ పెదాలు చూడు. -అది అస్సలు బాగోదు. డ్రింక్స్ ఇవ్వు చాలు.

కాబట్టి, మనం బల్దూర్ గేట్ కి పడవలో వెళ్దాం,

అక్కడి నుండి ఉత్తరం వైపుకు వెళ్దాం.

మనం ఫోర్జ్ కోసం వెతుకుతూ ఉంటాం కదా, అప్పుడు నేను ఒకసారి మార్లమిన్ ని కలుస్తాను.

తప్పదంటావా?

-అతనికి నీతో మాట్లాడాలని లేకపోతే? -వాడికి ఏం కావాలో, ఏం వద్దో నాకెందుకు!

-సరే. -పూర్తిగా ముగించేద్దామని.

నీకు నేను ఇక నుండి భర్తని కాదు అని ఒక ఉత్తరం రాసి కూడా పంపాడు కదా.

అది ముగించేసినట్టు కాదా?

-నీకు అర్థం కాదులే. -అవునులే.

నాకు అస్సలు అర్థం కాదు.

అది…

దరిద్రుడు.

ఫోర్జ్, నెవర్ వింటర్ కి ప్రభువు అయ్యాడా!

అ పిచ్చోడు ఎలా అయ్యాడబ్బా?

వాడి దగ్గర కిరా ఉన్నంత వరకు, వాడు ఎలా అయ్యాడు అనేది నాకు అనవసరం.

వెళ్దాం పద.

థ్యాంక్స్, గురూ. ఇంతకీ నా పెదాలకి ఏమైంది?

-నీ ముఖానికి అవి చాలా పెద్దవి. -ఏంటి?

నా పెదాలంటే చాలా మందికి ఇష్టం.

ఇక్కడ ఇంత మంది జనాలు ఉండటం నేనెప్పుడూ చూడలేదు.

హై సన్ గేమ్స్ టోర్మమెంటుకు వచ్చి ఉంటారు.

హా, మా నాన్న చివరిగా జరిగిన టోర్నమెంటుకు తీసుకెళ్లాడు, ఆ తర్వాత వాటిని నిషేధించేశారు.

ఎవరైనా గెలిచారా?

ఒక పోటీదారు చివరి రౌండు దాకా వచ్చాడు,

కానీ ఒక రాకాసి వాడిని సగం తినేసింది, కాబట్టి…

More Telugu subtitles for Dungeons & Dragons: Honor Among Thieves

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left