A Good Person

A Good Person

Download Telugu Subtitle

Release info

A Good Person 2023 720p AMZN WEB-DL DDP5 1 H 264-FLUX
A Commentary by sub.Trader
అనువాద కర్త నాగులవరం సుజాత దేవి

Tags

Web-DL
web-dl
web
WEB-DL
720p
720
Published on: 2023-07-02
Downloads: 38
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

మోడల్ ట్రైన్ అభిరుచి గల వ్యక్తిగా ఉండటంలోని

ఆనందం గురించి హెర్మన్ విలియమ్స్ సెమినల్ వర్క్లో

అతను ఇలా రాశాడు, "నా స్వంత సృష్టి అనే ప్రపంచంలో

నేను చాలా గంటలు ఆనందంగా గడిపాను.

మోడల్ రైలు ఔత్సాహికుల కోసం,

క్రమం, సమరూపతలతో కూడిన రహస్య ప్రపంచం ఉంది.

మన నేలమాళిగలు, అటక మూలల్లో దాగి ఉండి, రైళ్ల నమూనాల అభిరుచి గలవాడు

తన ప్రపంచానికి తానే సర్వశక్తిమంతుడైన సృష్టికర్తలా ఆధిపత్యం చెలాయిస్తాడు.

అక్కడ, 1:87 స్కేల్లో

పొరుగువారు ఎప్పుడూ దయతో ఉంటారు,

ప్రేమికులు ఎప్పుడూ కలిసి ఉంటారు,

ఇంకా రైళ్లు మీరు వెళ్లాలని నిశ్చయించుకున్న

సుదూర ప్రాంతాలకు ఎప్పుడూ మిమ్మల్ని తీసుకెళ్తాయి."

అయితే, జీవితంలో...

ఏదీ దాదాపుగా శుభ్రంగా, చక్కగా ఉండదు.

పాడండి!

మళ్ళీ, ఆలి!

వద్దు!

నేను జనం ముందు పాడలేనంతగా తాగి ఉన్నాను.

కానీ నువ్వంటే మాకిష్టం! కానీయ్!

దాన్ని అలా ఉంచుకోవాలి అనుకుంటున్నా.

సరే, అది నా అందమైన, చక్కని, ప్రియమైన కాబోయే భర్త నాథన్ కోసం...

తనకు ఆ పాటంటే చాలా ఇష్టం.

బుబ్బా, ఇటు వస్తావా?

వద్దు.

వెళ్ళు అక్కడికి!

కానీయ్! ఇది నీ ఎంగేజ్మెంట్ పార్టీ.

తను చాలా సిగ్గరి!

నాథన్!

రా!

-నచ్చిందా? -అద్భుతంగా ఉంది.

హే, అందరూ...

నేను క్లుప్తంగా చెప్తాను తను నా కోసం ప్లే చేసింది

మా మొట్టమొదటి డేట్లో

ఖాళీ బార్లో వెనుక తనకు దొరికిన చక్కని పాత పియానో మీద.

-అయితే, నువ్వు వెళితే బాగుంటుంది పాప! -కానీయ్.

-ఎల్లప్పుడూ బంధాన్ని ఏర్పరచుకోండి. -ఖచ్చితంగా! కుటుంబంలోనికి స్వాగతం!

-అలిసన్. -చెప్పు?

నా జీవితంలో నేను గుర్తుంచుకునే ప్రతీ జ్ఞాపకంలో నువ్వుంటావు.

వాటిల్లో కొన్ని కొద్ది సెకన్లే.

ఏదైనా రుచి చూడాలంటే

నువ్వు ఒక కన్ను మూసి చూస్తావు.

నేను అలానే చేస్తాను. ఇలా చేస్తాను...

-ఇది నిజమంటే నమ్మలేకున్నా. -ఇది నిజమే బంగారం.

-హమ్మయ్య. ఐ లవ్ యు. -ఐ లవ్ యు.

-సరే. -హే...

-తాగండి, తినండి, ఆనందంగా ఉండండి. -హా.

చిప్తో పడుకోవాలనుకుంటే, తను 11 కండోమ్లు వేసుకునేలా చూసుకోండి.

నేను నిజంగా వర్జిన్ను.

తను తమాషా చేస్తున్నాడు.

వద్దు. అరే, బంగారం. ఫోన్ వద్దు.

మనకు పెళ్ళయ్యాక, మంచం మీద ఫోను విషయంలో కొన్ని నియమాలు పెట్టుకోవాలి.

నోరు మూసుకో. నువ్వు నాకంటే పదింతలు నీ ఫోనులో ఉంటావు.

తుప్పుపట్టిన పాత ట్రక్కులను చూస్తూ.

'67 గుడ్డతో పైకప్పు ఉన్న బ్రోంకో అనేది ఓ కళాఖండం, బేబీ.

అది ట్రక్కు కాదు.

నేను కళను చూస్తున్నాను.

ఈ పిరుదుల్లాగా.

నువ్వు ఇచ్చిన ఆ బబుల్ గమ్తో నాకు చాలా మత్తు వచ్చింది

అదేంటి అసలు?

-నాకింకా మడమలో స్పర్శ లేదు. -ప్రస్తుతం నీకు మడమలు అవసరం లేదులే.

హా, కానీ నా మడమల్లో స్పర్శ కావాలి.

ఏయ్, వచ్చి నాకు ముద్దుపెట్టు.

-ఏయ్ బంగారం? -చెప్పు?

నా సేల్స్ లిస్టులోని ఆ చెత్త డాక్టర్

ఇంస్టాగ్రాంలో నాతో సరసాలాడాలని చూస్తున్నాడు.

నువ్వు అతనికి తప్పుడు అభిప్రాయం కలిగించావేమో.

ఏంటి? ఇంక ఆపు! అలాంటి దాన్ని అయినట్లు!

నేను అక్కడికి వెళ్ళి, నా ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని అందరికీ చూపిస్తుంటాను.

నువ్వు ఎప్పుడూ అంటావు, "సరసాలాడడం అనేది ఉద్యోగంలో భాగం" అని.

ఎవరైనా తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది.

చిన్న సరసాలే లే.

-సరే. -అవును!

అంటే... అది కేవలం... నవ్వుతూ సుషీ తినడమే.

దాంతో అతను ఆ ప్రిస్క్రిప్షన్ రాస్తే,

నాకు పెద్ద బోనస్ వస్తుంది, తరువాత

నువ్వు, నేను ఏదో ఒక రోజు సిటీకి వెళ్లిపోవచ్చు.

ముందు మనం నరకానికి వెళ్లకుండా ఉండాలి.

ఎందుకలా అంటావు?

-సరేలే! -క్షమించు.

నేను హుమిరాను ప్రోత్సహిస్తున్నాను, ఎందుకంటే

ఒక మోస్తరు సోరియాసిస్ వ్యాధి తీవ్రం అయి నేను నరకాన్ని చూడటం ఇష్టం లేదు.

చూడు, అది చాలా అన్యాయం.

-హా. నోరు మూసుకో.

ఏయ్. అది నిచ్చెన మెట్టు లాంటిది, బంగారం.

నాకు తెలుసు.

ఆస్ట్రోనాట్ స్కూల్కు మరీ ఆలస్యమైందంటావా?

-ఏంటి? -ఏం లేదు.

నేను ఒక ప్రొఫెషనల్ డాన్సర్ కాగలను.

-ఓహ్, అవునా? -అవును.

నీ ఒళ్లు కదిలిస్తావా?

ఆగు, నేను నిలబడతాను. నిలబడితే ఇంకా బాగా చేయగలను.

-సరే. -నిలబడితే ఇంకా బాగా చేయగలను.

-నువ్వు సిద్ధమా? -హా.

-ఇది ఏ శైలి? -తెలియదు, కానీ నా శరీరం...

కానీయ్. ఇది మోడరన్ కదా? ఇది...

ఇది ప్రొఫెషనల్.

-అబ్బో. -నన్ను సీరియస్ గా తీసుకుంటే

-నేను.సంతోషిస్తాను. -చాలా సీరియస్గా తీసుకుంటున్నా.

ఆ తరువాత, అది ఇలా ముగుస్తుంది

కానీ ఇక నీకు చూపించను, ఎందుకంటే అది ఇంకా నేర్చుకునే దశలోనే ఉంది.

ఇక ఈ ప్రొఫెషనల్ అలసిపోయింది, ఇంక నేను కౌగిలించుకోవాలి.

నిశ్శబ్దంగా ఉండండి.

నా జీవితాంతం ఈ రోడ్డును వేస్తూనే ఉంటారు.

న్యూ జెర్సీ ఎప్పటికి పూర్తవుతుంది?

-ఇంకా నిర్మాణంలో ఉంది. -అది కాదు.

-సరే కానీ, ర్యాన్ ఎలా ఉంది? -నీ కాబోయే మేనకోడలు అంటావా?

అబ్బో, చాలా ముద్దుగా ఉంది!

తను వచ్చే ఏడాది మొదలుపెట్టొచ్చని వర్సిటీ కోచ్ చెప్పారు.

-ఓ అవునా? -పోయిన సీజన్లో 19 గోల్స్ చేసింది!

-ఆమెకు చెప్పు. -వావ్. అబ్బో.

తనని చూస్తే మీకు గర్వంగా ఉంటుంది కదా. తనను కలవలేదంటే నమ్మలేకున్నా.

క్షమించు నాథన్, నేనింకా అక్కడికి రాలేకపోయాను.

బాధపడకు, అది చాలా దూరం.

మా నాన్నకు వయసు పెరుగుతోంది కాబట్టి తరచు రావడానికి ప్రయత్నిస్తాం.

హా, సరే, మీ నాన్నని కొన్నిసార్లే కలిశాను కానీ...

దాన్ని దూరం మీదకి నెట్టలేం.

ఇది చాలా సిల్లీగా ఉంది. క్షమించు.

మనం చూస్తున్న ఈ పెళ్లి డ్రెస్ల గురించి చెప్పు.

హా, చెప్పు. దాని గురించి ఆలోచిస్తూ రాత్రి నిద్ర పట్టలేదు.

-నోరు మూయ్! -నువ్వు భలే సరదా మనిషివి.

లేదు, తను కాదు. మనం డ్రెస్లు చూసిన తర్వాత

పబ్ల వెంట తిరుగుతామని అనుకుంటున్నాడు, కానీ నిజానికి నాటకం చూడడానికి వెళ్తాం.

-అవునా? -లేదు, వెళ్ళడం లేదు.

మనం ముందే టికెట్లు తీసుకోవాలి అన్నావు.

లేదు, ఎవరూ చూడాలనుకోని చెత్తని ఇందాక చూశాం.

-మంచి విషయం. అద్భుతం. మంచిది. -అవును కదా?

ఏయ్, చూడు, ఇప్పుడు విషయం బయటకొస్తోంది.

సరే, అయితే మిమ్మల్ని నాటకానికి తీసుకెళ్లడం కొంచెం కష్టమైన విషయమే,

కానీ ఒకసారి చూడనీ.

సరే, ఇప్పుడు ఇది ఏం చెబుతోందంటే…

ఇదిగో వచ్చేశాం.

చాలా తొందరగా తీసుకొచ్చేశావు.

హా, అంటే, అది...

అరగంట ముందే రావడం మేలు

నిమిషం ఆలస్యం చేసే కంటే.

తాత, నువ్వెప్పుడైనా వీడియో గేమ్స్ ఆడావా?

లేదు.

నీకు చిన్ని చక్కని బుర్ర ఉంది

కానీ ఆ చెత్తతో నువ్వు దాన్ని పాడుచేసుకుంటున్నావు.

సరే.

నాథన్.

నాథన్ అంకుల్ చేశారు, మాట్లాడు.

నాకెందుకు కాల్ చేస్తున్నట్లు?

ఎత్తు.

మనం ఇక మాట్లాడుకోమని అనుకున్నా.

నాథన్.

నాతో పాటు కారులో ర్యాన్ ఉంది.

తనని స్కూల్లో దించడానికి వచ్చాను.

ఇప్పుడే మళ్ళీ కాల్ చేస్తా.

హా, నువ్వు ఏం చెప్పావో వినబడింది. అక్కడికే బయలుదేరాను.

నేను తనను దించాలి, సరేనా?

చూశావా, అది అంత చెడ్డగా ఏం లేదు.

మీరు కలిసిపోడానికి దారి దొరకాలని తను కోరుకుంటుందని అమ్మ అంటుంది.

నేను బయలుదేరాలి, తల్లీ.

కానీ ఇంత త్వరగా వచ్చినందుకు తెలివితక్కువదానిలా కనిపిస్తాను.

క్షమించు.

నేను...

ఈ రోజు నిన్ను నేను పికప్ చేసుకుంటాను.

అమ్మ ఎందుకు రాదు? ఈరోజు సిటీ నుండి వచ్చేస్తామని చెప్పింది, కదా?

అంటే...

-తను రాలేదు. -సరే, తనకి మెసేజ్ చేస్తాను.

-సరే. -సరే, బై.

నేనంటే నీకు ఇష్టమని చెప్పు.

నువ్వంటే నాకు ఇష్టం, తాత.

నాకు కూడా నువ్వంటే ఇష్టం.

-బై. -బై.

అమ్మా, నా తల బాగా నొప్పిపెడుతోంది.

నా తలలో ఎంత నొప్పి ఉందో చెప్పలేను.

-మార్ఫిన్పై మళ్లీ క్లిక్ చేస్తావా? -క్లిక్ చేస్తూనే ఉన్నా.

క్లిక్ చేస్తున్నా, కానీ ఏం జరగడం లేదు.

అయ్యో, నువ్వన్నది నిజమే, ఇది ఖాళీ అయింది. ఇంకా తీసుకురావాలి.

-నర్సును పిలవాలి… -నన్ను ఎందుకలా చూస్తున్నావు?

ఎలా?

-బాగా గాయపడ్డానా? అంత పెద్ద ప్రమాదమా? -లేదు, కొంచెం కలత చెందాడు, తల్లీ.

మేం రాత్రంతా చాలా ఆందోళన చెందడంతో అతను కంగారు పడ్డాడు.

సరే. ఈ బుల్డోజర్ హఠాత్తుగా రోడ్డు మధ్యలోకి వచ్చేసింది.

-నాకు తెలుసు. -ఏం చేయాలో నాకు తెలియలేదు.

తెలుసు, కానీ దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన పనిలేదు.

-కదా నాథన్? -అవును.

నువ్వు కోలుకోవడం మీద దృష్టి పెట్టాలి. నువ్వు ఆలోచించాల్సింది అదొక్కటే, సరేనా?

-కదా, నాథన్? -అవును.

అంతరాయానికి క్షమించండి. రక్త నమూనా సేకరించేందుకు పోలీసులొచ్చారు.

లేదు, అస్సలు వద్దు. ఇప్పుడు సరైన సమయం కాదు.

-తనకు చాలా నొప్పిగా ఉంది, వద్దు. -మళ్ళీ రండి, తనకిప్పుడే మెలుకువ వచ్చింది.

-పోలీసులు ఎందుకు వచ్చారు? -దురదృష్టవశాత్తూ, నేనలా చేయలేను.

చట్టబద్ధంగా, నమూనాను వీలైనంత త్వరగా తీసుకోవాలి.

తను కుదుట పడేవరకు ఆగాం, కానీ ఇలాంటి ప్రమాదం విషయంలో,

-మేము పరీక్షించడం తప్పనిసరి… -ఆయన ఏం మాట్లాడుతున్నాడు?

-అది నా తప్పు కాదు. -ఆఫీసర్, తనకు తెలియదు.

అది తన తప్పు కాదు.

ప్రాణనష్టం జరిగిన ఇంత పెద్ద ప్రమాదం విషయంలో, మేము…

తనకి విషయం చెప్పలేదు.

-ప్రాణనష్టమా? -తనకు చెప్పలేదు.

-చెత్త వెధవ! -ఛ.

-తనకు తెలియదు. -అమ్మా, ఏం జరుగుతోంది?

-క్షమించు, బంగారం. -అయన ఏమంటున్నాడు?

క్షమించండి.

నాథన్?

నాథన్, ఏం జరుగుతోంది?

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left