Release info

Badrinath Ki Dulhania WEBRip Amazon te-in
A Commentary by indespensible

Tags

webrip
web
BRip
Published on: 2019-10-24
Downloads: 28
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

వరకట్నం ఇవ్వటం లేదా తీసుకోవడం అనేది చట్టం 1961 రీత్యా నేరం

ఈ సినిమాలో కానీ ఈ సినిమాకి సంబంధించిన వ్యక్తులు గాని సామాజానికి హానితలపెట్టే

ఏవిధమైన సలహాలు, సూచనలు చేయడం గాని ప్రోత్సహించడం గాని చెయ్యడంలేదు

అటువంటి హావభావాలు ఈ సినిమాలో ఉపయోగించిన యడల అవి కేవలం కల్పితాలు మాత్రమే.

ఈ సినిమా చిత్రీకరణలో పాత్రలు ఇంకా సన్నివేశాలు పరిశ్రమ సభ్యులు ఏవిధంగానూ

చట్టవిరుద్ధ క్రియలకు ప్రోత్సాహం చేయడంలేదు.

ఏ రూపంలోనైనా పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.

ఝాన్సీ

నమస్కారం, ఝాన్సీ కి స్వాగతం.

ముందుగా నా కుటుంబాన్ని పరిచయం చేస్తాను.

ఈయన మా నాన్న, అంబర్ నాథ్ బన్సల్

అలాగే మా అమ్మ శాంతి బన్సల్.

అమ్మ చాలా వరకు మాట్లాడదు.

నా జీవితంలో అన్నికూడా నాన్నే నిర్ణయాలు తీసుకుంటారు.

ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయం

నాకు పెళ్ళికూతురిగా పొందే అదృష్టవంతులని వెతికే విషయంలో.

ఈయన చాలా కంగారుగా కాలు ఊపుతున్న వ్యక్తి

పెళ్ళి కూతురి తండ్రి.

వాళ్ళు, వాళ్ళ అప్పుతో ఒక పెళ్ళి సంబంధం కోసం ఇక్కడికి వచ్చారు.

మన దేశంలో ప్రతి బిడ్డ, తన పుట్టినప్పుడే

ఒక జమా ఖర్చుల పట్టీని తయారు చేసి ఉంచుతారు.

శుభాకాంక్షలు, అబ్బాయి పుట్టాడు.

ఏం మాట్లాడుతున్నారు, డాక్టర్?

అబ్బాయి అంటే ఆస్తి!

శుభాకాంక్షలు, అమ్మాయి పుట్టింది!

-ఏం మాట్లాడుతున్నారు, డాక్టర్? -ఆపు. ఇదేమన్నా సంబరాలు జరుపుకునే విషయమా?

అమ్మాయి అంటే అప్పు.

ఆస్తి పుట్టినప్పుడు మిఠాయిలతో సంబరాలు చేసుకుంటారు,

అప్పు పుట్టినప్పుడు ఏదో నాసి రకం చాక్లెట్లతో కానిచ్చేస్తారు.

అబ్బాయి ఎంత వెధవ అయినా ఏం పర్లేదు,

అతని విలువ పెరుగుతూ ఉంటుంది.

అమ్మాయి ఎంత తెలివైనది అయినా సరే,

ఆమె ఆస్తిలోకి ఎప్పటికీ రాదు.

అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత,

వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ కోసం చేరుకుంటారు, అది కూడా పెళ్ళి కోసం.

ఆస్తులు విశదీకరించబడతాయి,

వారి ఓ.డి.పి, అదే ఒకే సారి కట్నం ధర చెప్పటం జరుగుతుంది.

ఈ ధరలని సంబంధిత పార్టీలకి

ప్రతినిధుల ద్వారా చెప్పటం జరుగుతుంది.

పార్టీ ఆఖరి ఆఫర్.

నిశ్చితార్థం తర్వాత, మీ గ్యారేజ్ లో ఒక కొత్త బ్రాండ్ ఎస్.యు.వి ఉంచుతారు.

అది కూడా విదేశీది.

అమ్మాయి ఏమ్.బి.ఎ చదువుతుంది.

పార్టీ యాబై లక్షలు ఇవ్వటానికి సిద్దంగా ఉన్నారు.

అలాగే పెళ్ళి తర్వాత, అతను 10 ఎకరాల భూమి

మరియు నగదు ఇస్తాను అని వాగ్ధానం చేశారు.

కానీ ఆమె అర్హత ధరలో ఎటువంటి మార్పుని తీసుకొని రాదు.

ఇంకా ఆమె వాటితో పాటుగా బంగారం మరియు వజ్రాలని తీసుకొని వస్తుంది.

కాస్త అవును అని చెప్పండి.

ఇంకేమి కావాలి మీకు?

పదార్థాలు బాగున్నాయి!

అలాగే ఏ కట్నం గురించి అయితే వాళ్ళు వేలం వేస్తున్నారో

నా గురించి.

బద్రినాథ్ బన్సల్ అలియాస్ బద్రి.

అలా వంకర నవ్వు నవ్వకు.

నువ్వు షారూఖ్ ఖాన్ కాదు.

ఇప్పుడు బాగా నవ్వు.

ఇంకొద్దిగా.

ఇంకొద్దిగా.

చెయ్యి.

నీ పళ్లని చూపించటం ఆపు.

కాస్త ఆపు.

ఇప్పుడు, నీ శరీరం తిప్పు.

శరీరం మాత్రమే, మొహం కాదు.

ఎలాగైతే బట్టల ప్రకటనలలో ఉంటుందో అలా.

అవును!

నీ కాలుని ఎందుకు ఉపుతున్నావు?

బపూన్ లాగా నన్ను నటింప చేయటం ఆపు!

బపూన్?

త్వరలో, నా కంపెనీ

ఝాన్సీ మరియు యు.పి లోనే అతి పెద్ద మాట్రిమోనియల్ కంపెనీ అవుతుంది.

వెడ్డింగ్స్-ఇన్-ఏ-స్నాప్.కొమ్

వేరేది ఆలోచించు, అది చెత్త పేరు.

కొన్నాళ్లు ఆగి, చూడు.

నేను నీ పెళ్ళి కూడా కుదురుస్తాను.

పర్లేదు, మా నాన్న దాని సంగతి చూసుకుంటారు.

మీ నాన్న నీకు పెళ్ళికూతురిని వెతికేలోపు,

నీకు 50 ఏళ్ళు వచ్చేస్తాయి.

హలో!

హలో!

ఈ కోట పదకొండవ శతాబ్ధంలో కట్టారు.

ఆగు, ప్రకాష్!

బద్రికి ఒక కాల్ వచ్చింది.

నువ్వు ఇక్కడ ఉన్నావు అని అతనికి తెలుసు.

ప్రకాష్, ఆగు.

లేదంటే బద్రి వచ్చి, తన మోటార్ సైకిల్తో నిన్ను పరిగెత్తిస్తాడు!

హే, ఆగు.

ఆగు, నువ్వు...

ప్రకాష్, నా స్నేహితుడిని నీ వెనుక ఎందుకు పరిగెత్తిస్తున్నావు?

నేను సోమ్దేవ్ ని గమనించలేదు.

నువ్వు, అతన్ని చూడకపోతే, అతని నుండి నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు?

-నేను జాగింగ్ చేస్తున్నాను. -ఈ అవతారంతో?

అద్భుతం!

మరి ఈ వ్యాయామం అంతా ఎందుకు?

నేను వచ్చే వారంలో పెళ్ళి చేసుకుంటున్నాను.

కాబట్టి నాకు కాస్త బరువు తగ్గాలని అనిపించింది.

కేవలం జాగింగ్ వల్ల నువ్వు బరువు తగ్గవు.

నీకు తెలుసా? గుంజీలు చేయటం మొదలు పెట్టు.

నేను రేపు మొదలు పెడతాను.

రేపు చేయటం అంటే? ఈ రోజే చేయాలి.

-ఈరోజు చేసేది ఈరోజే చేయాలి. -ఇప్పుడే!

అవును. మొదలెట్టు.

అన్నట్టు మా నాన్న నుండి తీసుకున్న

పదిహేను లక్షలు తిరిగి ఇచ్చే ఉద్దేశ్యం ఏమన్నా ఉందా?

నేను మొన్న అలోక్ని కలిశాను.

పెళ్ళి తర్వాత మొత్తంలో సగం ఇస్తాను అని వాగ్ధానం చేశాను

అలాగే మిగతాది వాయిదాల్లో చెల్లిస్తాను.

ఒట్టు?

మా అమ్మ మీద ఒట్టు.

అధ్భుతం, ఇతని ఇంగ్లిష్ ని ఎవరో బాగా ఆచరణలో పెడుతున్నారు.

అన్న, అది ఏంటంటే,

నా కాబోయే భార్య,

పట్టభద్రురాలు.

నువ్వు బాగా సిగ్గు పడుతున్నావు!

"గ్రాడ్యూయేట్" ని ఎలా పలుకుతావు?

చెప్పు.

సరే, సోమ్దేవ్ మీకు చెప్తాడు.

జి, ఆర్ తో పలికి, దాని వెనుక ఏ వస్తుంది,

తర్వాత డి వస్తుంది మరియు యూ, అలాగే ఇంకో ఏ, అప్పుడు టి, ఈ వస్తాయి.

"గ్రాడ్యూయేట్!"

అధ్భుతం.

నువ్వు నన్ను ఇంగ్లిష్ లో అడుగుతావు అని భావించాను.

ఎక్కువ ఆలోచించకు.

ఇదిగో నువ్వు ఒక పని చెయ్యి.

నీ అతిధుల పేర్లలో మా నలుగురివి కూడా కలుపు.

మీ మామగారు నీకు డబ్బులు ఇవ్వగానే,

తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టేయి.

లేదంటే, కట్నం అడిగావు అని నిన్ను జైల్లో వేయించి ఊసలు లెక్క పెట్టిస్తాను.

ఒకసారి అక్కడికి నువ్వు వెళ్తే,

బరువు తగ్గించుకోవటానికి నువ్వు పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు.

అర్థం అయ్యిందా?

నీకు ఈ రోజు బాగుండాలి.

-ఈ పరుగు వల్ల నీకు లాభం లేదు. -నువ్వు కూడా వ్యాయామం చేయాలి.

లేదు, నేను ఏ బరువు తగ్గాల్సిన పని లేదు.

ఆమె జాతకం ఏం చెప్తుంది అంటే

ఆమె కేవలం ఆడపిల్లలకే జన్మనిస్తుంది.

మా అమ్మాయి ఇప్పటికే బి.ఎడ్ పూర్తి చేసింది.

పెళ్ళి తర్వాత తన పిల్లలకి తానే చదువు చెప్పాలని ఆశపడుతుంది.

పెళ్ళి తర్వాత ఏం జరగాలన్నది కూడా

మీరే నిర్ణయిస్తారా?

అంబర్ నాథ్ గారు నా ఉద్దేశ్యం అది కాదు.

ఈమె మా పెద్ద కోడలు.

మీ అమ్మాయి కన్నా ఎక్కువ చదువుకుంది.

కానీ ఎప్పుడు కూడా ఉద్యోగం చేయాలన్న పిచ్చి ఆలోచన చేయలేదు.

మేము దీని గురించి ఆలోచించి, మీకు కబురు చేస్తాము.

మీ అబ్బాయి, మా అమ్మాయి కలిస్తే...

చాలు!

ఇక వెళ్ళండి.

ప్రపంచంలో నాన్న ఒక్కడే అనుకుంటా

తన గుండె పరిస్థితి కోసం ఆక్సిజన్ సిలిండర్ ని వాడేది.

కానీ ఈ ఆక్సిజన్ సిలిండర్ ఆయనకి బలమే తప్ప,

కానీ బలహీనత కాదు.

నిజానికి, మా అన్న అలోక్ ప్రేమలో పడ్డాడు.

తను సాక్షిని పెళ్లాడాలని, ఆమెని నాకు వదిన చేయాలని అనుకున్నాడు.

కానీ నాన్న అప్పటికే ఊర్మిళతో పెళ్ళిని నిశ్చయం చేశారు.

అన్నయ్య ఎదురుతిరిగాడు, నాన్న చెంప పగలకొట్టాడు,

అన్నయ్య ఇల్లు వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

అన్నయ్య దాదాపు వెళ్లినంత పని అయ్యింది

అప్పుడు నాన్న తన గుండె పట్టుకొని, సోఫాలో కుప్పకూలి పోయారు.

అన్నయ్య ధైర్యం దిగిపోయింది,

చివరికి సాక్షికి బదులుగా ఊర్మిళని పెళ్ళి చేసుకున్నాడు.

ప్రపంచంలోనే భారతీయ తండ్రులకి బలహీనమైన గుండె ఉంటుంది.

దేవుడు దానిని ఒక గుండె నొప్పి బటన్ తో బాగా తయారు చేశాడు.

విషయాలు ఎప్పుడైతే అదుపు తప్పుతాయో,

ఆయన బటన్ నొక్కి, ఆ పరిస్థితులని ఆధీనంలోకి తీసుకొస్తాడు.

ఇప్పుడు, మా అన్న తన పనితో తీరిక లేకుండా ఉన్నాడు.

అతని మామ గారి నుండి వచ్చిన షో రూమ్ ని

కేవలం రెండు సంవత్సరాలలో మూడింతలు చేశాడు.

ఇంకా మా నాన్న వ్యాపారాలు కూడా తానే చూసుకుంటున్నాడు.

రాత్రి పూట, ఒంటరిగా పైన కూర్చొని కొద్దిగా మద్యం తీసుకుంటాడు,

ఒకోసారి అక్కడే పడుకుండి పోతాడు.

మా అన్న నవ్వటం చూసి చాలా రోజులు అయ్యింది.

నేను దేవుడిని కోరుకుంటున్న

నా కథ మాత్రం ఇలా ముగించకూడదు అని.

కోట

నమస్కారం! స్వాగతం!

దివేది గారి కుటుంబంకి మరియు అతని కుమారుడు ప్రకాష్ కి స్వాగతం,

అలాగే కోటా ఇంటర్నేషనల్ బాండ్ వారి నుండి మిగతా అతిధులకి స్వాగతం పలుకుతున్నాము.

భోజనాలు సిద్దంగా ఉన్నవి.

అయ్యో, దేవుడా!

అతిధులు ఇంకా మొదలు పెట్టలేదు,

మీరు ఇద్దరు తింటం మొదలుపెట్టేసారు,

-ఇక చాలు -ఎందుకు?

ఈ అతిధులు ఏమన్నా దేవుళ్ళా?

మనం తినక ముందే వారిని మనం తినమని అడగాల్సిన అవసరం ఉందా?

-అయితే, విను. -అమ్మ.

బఫ్ఫెట్ అంటే ప్రతిఒక్కరూ, వారికి వారే సహాయం చేసుకోవటం.

బఫ్ఫెట్ అంటే ఏంటో నాకు తెలుసు.

ఇప్పుడు వెళ్ళండి.వెళ్ళి, అతిధులని ఆహ్వానించండి.

ఆహారం ఇంకా వేడిగా ఉంది.

వారికి, వారినే సహాయం చేసుకోమని వాళ్ళకి చెప్పండి. వెళ్ళండి.

మనమే తినిపించాల, లేదా వాళ్ళే సొంతంగా తింటారా?

అయ్యో.

ఏర్పాట్లు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.

మా అతిధులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.

నేను ఏం చెప్పగలను?

నేను అది చేసి తీరాలి.

అన్నీ పక్కన పెడితే, ఇది నా ఏకైక కూతురి పెళ్ళి.

-దయచేసి దీన్ని అంగీకరించండి. -మీరు ఇది చేయాల్సిన అవసరం లేదు.

-మేము డబ్బుకి ఆశపడటం లేదు. -తివారీ గారు.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left