The first 200 lines.
చంద్రుడి చుట్టూ ప్రయాణం రెండు దశల్లో జరగాలి.
వెర్నర్ వాన్ బ్రాన్
భూ ఉపరితలం నుండి టేక్ ఆఫ్ అవుతున్న రాకెట్ షిప్
కేవలం గురుత్వాకర్షణ ను అధిగమించే వేగాన్ని అందుకోవడానికే
తన వద్ద ఉన్న ఇంధనాన్నంతా దాదాపుగా ఉపయోగించేస్తుంది.
ఇక్కడ మనకి భూమి ఇంకా 240,000 మైళ్ళ దూరాన ఉన్న చంద్రుడి బొమ్మ ఉన్నాయి.
ఇది మన రాకెట్ షిప్ బయటకు వెళ్ళటానికి ఇంకా తిరిగి రావటానికి అనుసరించే
దీర్ఘవృత్తాకార మార్గం.
అప్పుడు మనం విడిపోవడానికి ఇంకా పైకి లేవడానికి పి.జి.ఎన్.సి.ఎస్ కి బదులుగా
దాని ప్రాధమిక వ్యవస్థ ఏజిఎస్ ను వాడుకుంటాము.
మొత్తం అర్ధమైందా, ట్రాన్క్విలిటి బేస్?
గైడెన్స్ కంట్రోల్ ఏజిఎస్. అర్ధమైంది, హ్యుస్టన్.
ఈ వంపు ఉన్న స్థానం నుంచి పైకి లేచే ఇంజెన్ ను మొదలు పెడితే
ఖచ్చితంగా మనం నిలకడ గురించి ఆందోళన పడాలి.
అంతలోపు, అధికంగా ఉన్న బరువు వదిలించుకుంటున్నాం.
మరీ ఇన్ని తేడాలు నాకు నచ్చలేదు, వెర్నర్.
అది మళ్ళీ నిటారుగా అవ్వాలంటే పైకి లేవడానికి అవసరమైన ఇంధనం చాలా ఖర్చవుతుంది.
అంటే, వాళ్ళు బహుశా కొలంబియా ను కలవలేకపోవచ్చు.
ఈ ప్లాన్ బాగానే ఉంది, జీన్.
ట్రాన్క్విలిటి, మీరు పైకి లేవచ్చు.
సరే, బజ్. ఇంజన్ ఆన్ చేయి.
మైక్, కాసేపట్లో మిమ్మల్ని కలుస్తాము.
మాకోసం మా బీర్లు చల్లగా ఉంచండి.
అలాగే, ట్రాన్క్విలిటి బేస్.
అబోర్ట్ స్టేజ్.
ఇంజన్ ఆర్మ్, యాసెంట్.
ఇంజన్ ఆర్మ్, యాసెంట్.
ఇక్కడేమీ జరగదు.
ఇగ్నిషన్.
హ్యూస్టన్, మేము ఖచ్చితంగా కొంత కుదుపులకు లోనవుతున్నాము.
మేము నిలకడగా అవుతున్నాము.
ఈగల్ అదుపులోకి వచ్చింది.
ఆయనే సాటర్న్ V ని తయారు చేసాడు
మానవాళి కోసం
రెండు నెలల తరువాత
సెప్టెంబర్ 5 1969
క్షమించండి...
గుడ్ మార్నింగ్, సర్.
నీకు పచ్చ రంగు బాగుంటుంది, ఎమ్మా.
ఇప్పుడే అడ్మినిస్ట్రేటర్ పెయిన్ వచ్చారు, సర్.
శుభవార్త తెచ్చాడని ఆశిద్దాము.
- అది ఇప్పుడు అవసరం. - డీక్
తరువాత కలుస్తాను.
ఇంకా ఎంతకాలం నేను స్పేస్ క్రాఫ్ట్ నడపకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాలి?
నేను ఇప్పటికే రెండు నెలల నుంచి ఎదురు చూస్తున్నాను.
చూడు, అది నా ఒక్కడి చేతిలో లేదు.
నువ్వు చాలా మందికి కోపం తెప్పించావు.
నేను ఎప్పటికీ పైకి వెళ్ళట్లేదు, కదా?
వాన్ బ్రాన్ డైరెక్టర్ గా ఉన్నంత కాలం వెళ్ళలేవు.
నన్ను క్షమించు. కానీ నీకు నువ్వే చేసుకున్నావు.
అయితే, నేనేం చేయాలని మీ ఉద్దేశం, కేవలం ఆఫీస్ పని చేస్తూ ఉండాలా?
ఇంకా ఘోరమైనవి ఉన్నాయి.
అవును, నీకే తెలిసుంటుంది, కదా?
జాగ్రత్తగా మాట్లాడు, ఎడ్.
ఇది క్రెమ్లిన్ లో ఉన్న విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం.
ఇది తయారవ్వటానికి కనీసం దగ్గరగా ఉన్నా కూడా...
అవి వట్టి బ్లూప్రింట్స్ మాత్రమే.
నా దగ్గర వందల బ్లూప్రింట్స్ ఉన్నాయి. దానివల్ల ఏమీ జరగదు.
ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండలేము, వెర్నర్.
ఇది ప్రచ్ఛన్న యుద్ధంలో ఒక కొత్త పక్షం.
ఒకవేళ సోవియట్లు అక్కడ లూనార్ మిలిటరీ ఔట్ పోస్ట్ నిర్మిస్తే,
ప్రెసిడెంట్ కూడా ఒకటి కావాలంటున్నాడు. అది కూడా వాళ్ళకంటే ముందు.
అయన సీరియస్ గా అని ఉండరు.
నిజం చెప్పాలంటే, ఆయన్ని అంత సీరియస్ గా ఎప్పుడూ చూడలేదు.
ఇక్కడ మనం మన ప్రాధాన్యతలను చాలా మార్చుకుంటున్నాము.
మనం చంద్రుడి విషయంలో ఓడిపోయి ఉండొచ్చు. కానీ మనం బేస్ కోసం పోటీలో గెలవొచ్చు.
"బేస్ కోసం పోటీ"?
పలకటానికి బాగుంది, కదా?
కమిటి ముందు నువ్వు చెప్పే సాక్ష్యం
నాసా కొత్త ఎత్తులను బహిర్గతం చేయడానికి సరైన సమయం.
అపోలో 12 తో మొదలుకొని,
మనం చంద్రుడిపై ఒక శాశ్వత మిలిటరీ బేస్
ఏర్పాటు చేసే స్థలం కోసం వెతుకుతూ ఉంటాం.
ఖచ్చితంగా కాదు.
మనదొక సైన్సు ప్రోగ్రాం, జి.ఐ.జో ఆడుకునే స్థలం కాదు.
వెర్నర్. ఇది మంచి విషయమే.
నిక్సన్ దీని విషయంలో చాలా పట్టుదలగా ఉన్నాడు.
మన బడ్జెట్లు బాగా పెరుగుతాయి.
మనం మరో మూడు, నాలుగు బ్యాచీల వ్యోమగాములని నియమించ వచ్చు.
నువ్వేమంటావు, డీక్?
అంటే, అదనంగా వచ్చే వాళ్ళనైతే వాడుకుంటాను,
కానీ అపోలో 12 పైకి వెళ్ళటం తొందరలో' ఉందని, నేను అనుకోవడం లేదు.
అవును. మనం దాన్ని ఇంకొంచెం త్వరగా చేయాలి.
థామస్, నా మాట విను.
మనం ఈ అతిక్రమణను అనుమతించలేము.
నేనది ఇంతకముందు చూశాను
నా అగ్రిగట్ ఫోర్, తక్కువ ఎత్తులో ఎగరటానికి రూపొందించబడింది.
దాని సామర్ధ్యాన్ని వెర్మట్ చూసినప్పుడు, అది ఒక ఘోరమైన ఆయుధం, వి-2 అయింది.
మనం అంతరిక్షాన్ని మరొక యుద్ధరంగం కావటానికి అనుమతించలేము.
అది ఇప్పటికే అయిపొయింది.
వాళ్ళు చెప్పింది చేయకపోతే మనం ప్రమాదంలో పడతాము.
నేను నా పనిని ఆయుధాలు పట్టుకున్న మనుషులు మరొకసారి చెడగొడుతుంటే చూడలేను.
ఇది జర్మనీ కాదు, వెర్నర్.
డిక్ నిక్సన్ కమ్యునిస్టులతో 30 ఏళ్ళుగా పోరాడుతూ ఉన్నాడు,
ఇంకా మన దేశం ఒక ఎర్ర చంద్రుడిని అంగీకరించలేదు.
ఎర్ర చంద్రుడు, నీలి చంద్రుడు, పచ్చ చంద్రుడు. ఈ సోది ఇక చాలు.
ఇది జరుగుతుంది.
నిన్ను వాళ్ళేమీ చేయకముందే నువ్వు ఒప్పుకుంటే మంచిది.
యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ కి,
"కుదరదు" అని చెప్పటానికి అతని గురించి అతను ఏమనుకుంటున్నాడు?
నేను చంద్రుడి మీద మిలిటరీ బేస్ పెట్టమని చెప్పానంటే, అంతే.
కథ ముగిసింది.
ఆ చెత్త వెధవని తీసేయండి.
అతన్ని ఏమీ చేయలేము అనుకుంటా, ప్రెసిడెంట్ గారు.
హెన్రీ కిస్సింజర్ దేశ భద్రతా సలహాదారుడు
అతను మంచి పేరున్న వ్యక్తి... దేశానికి అంతరిక్షయానం గురించి నేర్పినవాడు.
సరే, అయితే,
మనమిప్పుడు సృజనాత్మకంగా ఆలోచించాలి, కదా?
నేను హంట్స్ విల్ లోని బార్బెక్యు ని మిస్ అవుతున్నాను.
బహుశా ఇది రిటైర్ అయ్యి అలబామాకు వెళ్ళాల్సిన సమయమేమో.
అవును. నువ్వు నీ వరండాలో కూర్చోవచ్చు.
పైప్ కాల్చొచ్చు.
బహుశా పెయింటింగ్ మొదలు పెట్టొచ్చు?
కాకపొతే, నేను ఎవరితో కలిసి భోజనం చేయాలి?
నాకు తెలియదు.
బహుశా ఒక అందమైన ప్రియుడితో?
మనమిది మళ్ళీ చేస్తున్నామా? నీకు తెలుసు నాకు సమయం లేదని.
అవును. నువ్వు చాలా బిజీగా ఉండే అమ్మాయివి.
నేను జీన్ తో నీ ఇంటర్వ్యూ గురించి విన్నాను.
నేను నీకు చెప్పబోతున్నాను. నేను కేవలం...
నీ సొంతగా చేద్దాం అనుకున్నావు. నాకు తెలుసు.
ఇతరులు ఏమనుకుంటారో అని నువ్వు ఎక్కువ కంగారు పడతావు, మార్గో.
నువ్వు ఎప్పుడూ అంతే.
ఔట్ పోస్ట్ టావెర్న్
జనాలు ఆ అపోలో 11 ల్యాండింగ్ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు.
పాతకాలంలో లాగా పిచ్చిగా ల్యాండ్ అయింది.
అవును, నీల్ ఒక మంచి పైలట్.
అయినా నాకు ఇప్పటికీ డచ్ రోల్ తో నీ కియర్సాజ్ ల్యాండింగ్,
చాలా అద్భుతమైనదని అనిపిస్తుంది.
అయితే నువ్వు మళ్ళీ పైకి ఎప్పుడు వెళుతున్నావు, ఎడ్? అపోలో 15, కదా?
అంటే, ఇప్పటికి అది ఇంకా తెలియదు.
అందుకే నిన్ను వచ్చి బీర్ తాగమని అడిగాను.
నేను తిరిగి నేవీ వైపు వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాను.
ఓహ్, అలాగా.
ఇప్పుడు అసలు అలా ఎందుకు చేయాలని అనుకుంటున్నావు?
పైలట్లు వ్యోమగాములు అవుతారు, ఎడ్. వెనక్కి వెళ్లరు.
నేను ఈ మధ్య కాలంలో చేస్తున్న పని అంతా ఆఫీసులో కూర్చొని చేసేదే.
ఇది ఆ ఆర్టికల్ గురించా?
అవును.
నువ్వెప్పుడూ నీ పై అధికారులకు కోపం తెప్పించే పనులే చేస్తావు.
నాతో సహా.
కానీ నేను చూసిన వారిలో అత్యుత్తమ పైలట్లలో నువ్వు ఒకడివి.
"ఒకడినా"?
అతితెలివి ప్రదర్శించకు.
కానీ నీ లాంటి వాడిని తిరిగి తీసుకోవడానికి నేవీ వాళ్ళు సంబరపడిపోతారు.
ప్రాముఖ్యంగా ఇప్పుడు. మనం వియత్నాంలో చాలా ప్రయత్నిస్తున్నాం.
అది యుద్ధానికే ఒక కీలక మలుపు కావొచ్చు.
అంటే దానర్ధం ఒక స్క్వాడ్రన్ కు నాయకత్వం వహించడమా లేక...
స్క్వాడ్రన్?
బహుశా నీకొక పూర్తి వాయు దళానికే నాయకత్వం వహించే అవకాశం రావొచ్చు.
ఇంకా నువ్వు ఈ కొత్త ఫాంటమ్ విమానాన్ని నడిపే దాకా ఆగు.
మనం కొరియాలో నడిపిన ఆ ప్యాంతర్ విమానాలు సిగ్గు పడేలా చేయాలి.
అది ఒక నిప్పులు-కక్కే విమానం, ఎడ్.
నన్ను క్షమించు, ఎడ్.
నేనిక, నేను ఉండలేను.
ఎడ్. నాకు నీ విమానాన్ని కూల్చేసారని మరొక ఫోన్ కాల్ వస్తే నేను తట్టుకోలేను.
అంటే, ఫోన్ మోగిన ప్రతి సారి, నా గుండె జారిపోయేది.
నేను ఊరికే అపోలో 10 లో వెళ్ళినప్పుడు చనిపోయి ఉండేవాడిని.
అవును. కానీ, కనీసం నిన్ను ఎవరూ కాల్చట్లేదు కదా.
నేను ఒప్పుకున్నది దానికే, కేరెన్.
లేదు, ఎడ్. అది మనం ఒప్పుకున్నది.
గుర్తుందా?
దేవుడా, నువ్వు ఆపుతావా...
ఇంక ఆపు. నువ్వు అన్నీ గందరగోళం చేస్తున్నావు.
అంతరిక్ష కార్యక్రమానికి సంబంధించిన వైఫల్యాలను
ఒక జాయింట్ కాంగ్రెషనల్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుండగా,
వాషింగ్టన్ లో సోవియట్ చంద్రుడి ల్యాండింగ్ వల్ల కలిగిన రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది.
ప్రెసిడెంట్ నిక్సన్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న కమిటీలో ప్రధానమైన వ్యక్తిగా
తక్కువ సమయంలోనే అవతరించిన మసాచుసెట్స్ సెనేటర్ టెడ్ కెన్నెడీ,
అడ్మినిస్ట్రేటర్ థామస్ పెయిన్ ను తీవ్రంగా విచారించారు.
ఇంకా, సాటర్న్ V రాకెట్ నిర్మాణాన్ని అపోలో 11 కంటే ఒక సంవత్సరం ముందే
రద్దు చేయడాన్ని ఎలా సమర్ధిస్తారు సర్?
అది మరింత విస్తృతమైన...
ఇవి నాసా కు అందుతున్న నిధుల్లో ప్రెసిడెంట్ నిక్సన్ పెట్టిన తీవ్రమైన కోతలు.
సెన్. కెన్నెడీ
క్షమించండి. అది సరైనది కాదు, సెనేటర్.
రెప్. సాండ్ మాన్
ప్రెసిడెంట్ గారు అంతరిక్ష కార్యక్రమం పట్ల పూర్తి నిబద్ధత కలిగి ఉన్నారు.
కోకో బీచ్, ఫ్లోరిడా
చెప్పు.
హే.
ఆ వ్యాక్యూమ్ ట్యూబులు ఎక్కడ పెట్టావు? టీవి మళ్ళీ సరిగ్గా పని చేయటం లేదు.
దేవుడా.
నాకు తెలియదు. బహుశా...
ఇప్పుడు టైం ఎంత?
నువ్వు ఇంకా తాగి లేవని చెప్పు.
హే, లేదు, బంగారం, నేను... అలిసిపోయాను, అంతే.
ఇక్కడ వీళ్ళు మాతో బాగా పని చేయిస్తున్నారు.
నీకు ఇంకా పిల్లలకు దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదని నీకు తెలుసుగా.
అవును. నాకు తెలుసు అది నరకమని.
నాది, నాకు తిరిగి ఇచ్చేయి!
హే! డేనియల్, జిమ్మీ!
ఏదైనా వస్తువు కింద పడేస్తే అది మీరే తీయాలి. అర్ధమైందా?
హే, నేను డానీ కి చెప్పానని చెప్పు...
అమ్మ మాట వినమని. నేను అది చెప్పానని చెప్పు, బంగారం.
సరే.
నిన్ను తొందరలోనే కలుస్తాను అనుకుంటా.
హే, ట్రేస్.
ఐ లవ్ యు.
మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ కేంద్రం
No comments yet. Be the first to leave one.