The first 200 lines.
పెట్రీషియా డాయల్ ఒక మంచి పైలట్ మరియు ఒక మంచి స్త్రీ.
ఆమె ఎప్పటికీ నాసా కుటుంబంలో ఒక భాగం.
నాలుగు రోజుల తరువాత
ఈ శోకతప్త సమయంలో ఆమె ప్రియమైన వారికి బాధపడడానికి సమయం ఇవ్వమని కోరుతున్నాము
పెట్రీషియా డాయల్ 1932-1970
ఆమె చిత్తశుద్ధి మరియు ఆమె పట్టుదల... అందరికీ గుర్తు ఉంటుంది.
నాసా మానవీయంగా నిర్వహించే అంతరిక్షయాన కేంద్రంలో జెండాలు అవనతం చెయ్యబడ్డాయి,
మరియు ఒక చిన్న స్మారక సేవ తరువాత,
వ్యోమగామి అభ్యర్థి పెట్రీషియా డాయల్ యొక్క అవశేషాలు...
నువ్వు ఇక్కడ ఉంటావని అనుకున్నాము.
నువ్వు ఒక మంచి స్మారక సేవను చూడలేదు.
ఇది కష్టమని నాకు తెలుసు,
అందుకని, నీకు కావాలంటే...
నువ్విది టప్పర్ వేర్ పార్టీ కోసం ఉంచుకోవచ్చు.
మంచిది.
ధన్యవాదాలు, పామ్.
పాటీ కోసం.
- పాటీ కోసం. - పాటీ కోసం.
అక్కడేమి జరిగిందో మనకి తెలిస్తే బాగుండు అని నాకనిపిస్తుంది.
ఆమె చాలా మంచి పైలట్.
ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ.
ఆ బెడ్ స్టెడ్ ఒక ప్రమాదకరమైన విమానం.
ఆమె హెలికాప్టర్లు నడిపేది. ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఇజెక్ట్ అవడానికి శిక్షణ పొందలేదు.
వాటిలో ఇజెక్షన్ సీట్లు కూడా ఉండవు, అందుకని వారు ఎప్పుడూ...
ఆమె పెద్ద పొరపాటు చేసింది. విషయం దానికే వస్తుంది.
ఆమె పెద్ద పొరపాటు చేసింది.
ఆమె ఇజెక్ట్ అవ్వాల్సిన సమయంలో ఎయిర్ క్రాఫ్ట్ లోనే ఉంది,
విషయం అంతే.
ఇప్పుడు ఆమె ఇక లేదు.
మనం చేస్తున్న ప్రతిదీ...
అంతా అయిపోయింది.
వాళ్ళు ప్రోగ్రాం రద్దు చేస్తారు. అది తప్పదు.
హే.
వారు అలసిపోయారు.
అవును. నేను వారికి ఇది చదివి వినిపించాను.
ఒక్క నిమిషంలో పడుకున్నారు.
స్మారక సేవ ఎలా జరిగింది?
నువ్వు బాగానే ఉన్నావా?
బాగానే ఉన్నాను.
కొన్నిసార్లు, నేను...
నేను ఈ అబ్బాయిలకు న్యాయం చేస్తున్నానా అనిపిస్తోంది.
హే...
ఈ అబ్బాయిలు నువ్వు చంద్రుడిని వెలాడేసావనుకుంటున్నారు.
ఎంత మంది తల్లులు అంతరిక్షంలోకి వెళ్ళడానికి శిక్షణ పొందుతూ
వారి పిల్లలకు హోమ్ వర్క్ లో సహాయం చేయడానికి సమయం తీసుకుంటారని అనుకుంటావు?
నువ్వది చేయలేదా?
చేయలేదు.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను.
లేదు, సర్. నేను ఆ రోజు ఆమె శిక్షకుడిని.
అంత్యక్రియల సమయంలో మీతో మాట్లాడడానికి నాకు అవకాశం దొరకలేదు...
ఎవరైనా ఉన్నారు అంటే...
నేను మీకు చెప్పాలనుకుంటున్నాను...
- లేదు, లేదు, సర్... - ఎందుకంటే వారు భయపడుతున్నారు...
క్షమించండి, సర్. నా మాట వినండి. నేను...
నేను మీ భావాలను అర్థం చేసుకోగలను.
లేదు, అది కాదు నేను చెప్పాలనుకున్న... సర్? మిస్టర్ డాయల్.
క్షమించండి.
దాని గురించి మర్చిపోండి.
అది కేవలం ఒక ఫోన్.
ఆయన వినడం లేదు.
కొన్ని సార్లు బాధపడుతున్నప్పుడు,
వారు వివరణలు వినాలని అనుకోరు.
ఆయనకి ఆ హక్కు ఉంది.
ఎడ్, ఇది నీ తప్పు కాదు, సరేనా?
నేను ఆమె శిక్షకుడిని.
ఆమెని సిద్ధం చేయడం నా బాధ్యత.
ఆమె సిద్ధంగా ఉందని నిర్ధారించుకోవడం.
నేనందులో విఫలం అయ్యాను.
తప్పు జరిగే ప్రతి దానికి కారణం నువ్వే అని నిన్ను నువ్వు నిందించుకోలేవు.
ఆమెకి ఆ ప్రమాదాలు తెలుసు, సరేనా?
ఆమె ఎన్నో ఏళ్లుగా విమానం నడుపుతోంది.
ఆమెకి తెలుసు... హే, ఆపు, ఆపు.
వెళ్లి గడ్డి కోయి.
ఎడ్!
ఇది నిజంగా అవసరం లేదు.
ఇక్కడ నేను ఇంకా ఇక్కడికి వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళగలనని అనుకుంటాను.
అది సమస్యేమీ కాదు, మిస్టర్ గ్లెన్.
ఆయన జాన్ గ్లెన్.
గస్ ను చూడు. స్కాట్ ను. ఎలా ఉన్నారో.
మనం ప్రపంచం మన చుట్టూనే తిరుగుతుందని అనుకునేవాళ్ళం కదా?
అవును. ఉత్సాహం, కోరికతో ఉండేవాళ్ళం.
- ఏమీ మారలేదనుకుంటాను, కదా? - అవును.
టై బాగుంది.
సరే.
అయితే, ఏంటి విషయం?
బెడ్ స్టెడ్ ను కూల్చిన అమ్మాయి.
పెట్రీషియా డాయల్.
ఆమె తన శక్తికి మించి చేసింది.
నువ్వలా ఎందుకు అంటున్నావు?
ఈ ఉద్యోగం కోసం టెస్ట్ పైలట్ అవ్వవలసిన అవసరం ఉండడానికి ఒక కారణం ఉంది.
ఇక్కడ అనుభవం చాలా ముఖ్యం.
నువ్వు నిజాలను చూడాలి, డీక్.
పురుషులు వెళ్లి, యుద్ధాలు చేసి, విమానాలు నడుపుతారు.
మనం చేసేది స్త్రీలు చేయలేరు.
అది మన సామాజిక క్రమం యొక్క సత్యం.
నువ్వు విన్నావో లేదో నాకు తెలీదు కానీ ఒక స్త్రీ చంద్రుడి మీద కాలు పెట్టింది.
వారు ఇందు కోసం చాలా కష్టపడ్డారు, జాన్.
ఇప్పుడది వారి నుండి తీసుకోవడం...
మెర్క్యురీలో నువ్వు ఎదుర్కొన్న దాని తరువాత...
ఈ స్త్రీల పట్ల నీకు జాలి ఉన్నందుకు నిన్ను నిందించను, నిజంగా.
దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు.
డీక్, నువ్వు నాకు చాలా కాలంగా తెలుసు.
ఆ ఫ్లైట్ సర్జన్ నీవు విమానం నడపకూడదని అన్నప్పుడు నేనక్కడే ఉన్నాను...
వారు దాన్ని ఏమన్నారు?
ఏట్రియల్ ఫిబ్రిలేషన్.
నీ పట్ల చాలా అన్యాయం జరిగింది.
మనం ఇక్కడ నాసా యొక్క విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాము.
అది నీ ఆలోచన కాదని అందరికీ తెలుసు. అది నీ మీద బలవంతంగా పెట్టబడింది.
ఎవరూ నన్ను ఏమీ చేయమని బలవంతపెట్టలేదు.
ఎవరు వెళతారు, ఎవరు వెళ్లరు అని నిర్ణయించేది నేనే.
నాకు తెలుసు.
నీ మాటకి ఇక్కడ చాలా విలువ ఉంది.
మనం దీనికి చాలా ప్రయత్నించామని,
ఈ అమ్మాయిలు ప్రమాణాలను చేరుకోలేకపోయారని నువ్వు చెపితే
ఎవరూ నిన్ను ఆ విషయం మీద ప్రశ్నించరు.
ఎవరూ.
ఆ ప్రమాదం దేని వల్ల సంభవించిందో మనకు తెలియదు,
కానీ ఒక వ్యొమగామిని కోల్పోయామన్నది స్పష్టంగా కనిపిస్తున్న నిజం.
ఒక మనిషి చంద్రుడి మీద మరణిస్తే వారు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు.
రష్యన్ లకు వారి వైఫల్యాలను బహిరంగ పరచడం నచ్చదు.
మనలా కాదు.
ఒక స్వేచ్చా ప్రపంచంలో జీవిస్తున్నందుకు నువ్వు చెల్లించే మూల్యం అదే, గోర్డో.
ప్రభావ బిలం గురించి అర్బిటార్ ఆరు అందించగల ఉత్తమమైన వీక్షణ ఇదే.
ఉన్న ఆందోళన దాన్ని పథం గురించే,
వారు ఒక సంభావ్య నీటి ప్రాంతం వద్ద దిగడానికి ప్రయత్నించారేమో.
అయితే వారికి కూడా మనకి తెలిసిన విషయమే తెలిసినట్టు ఉంది.
ఆ సిలిండర్లు ఏమిటి?
జెపిఎల్ వద్ద వారు వీటిని ప్రెజరైజ్డ్ మాడ్యూల్స్ అనుకుంటున్నారు.
నివాస మాడ్యూళ్ళలో లానా?
అవును.
- అబ్బా. - దేవుడా.
వారు మనకన్నా ముందు ఉన్నారు. మళ్ళీ.
మనం స్థావరాన్ని త్వరపరచాలి.
వారికి మనకన్నా ముందుగా అక్కడికి చేరుకుంటే,
వారు అక్కడ మిసైల్ రేడార్ వ్యవస్థలు, నిఘా...
ఇప్పుడు మనం షెడ్యూల్ లో వెనుకపడ్డాము. మనం ఇంకా ఒక సైట్ ను కూడా ఎంచుకోలేదు.
ఎందుకు ఎంచుకోలేదు? ఏదో ఒక దాన్ని ఎంచుకో.
సర్, ప్రాధమిక డిజైన్లు వాటర్ ఐస్ కి దగ్గరగా అంచనా వేయబడ్డాయి.
మనకి అది లేకపోతే, మనకి ఒక స్థావరం ఉండదు,
- ఇంకా అది ఎక్కడ ఉందో మనం గుర్తించాలి... - మళ్ళీ, నువ్వెవరు?
నేను మార్గో మాడిసన్, సర్.
అవును. నువ్వు వెర్నర్ అమ్మాయివి.
ఆమె ఒక ఫ్లైట్ డైనమిక్స్ ఆఫీసర్.
ఆమె మంచి విషయం చెప్పింది.
మనం ఎక్కడికైనా ఒక పుల్ల విసిరి, ఎక్కడ పడితే అక్కడ దిగలేము.
అది ఎక్కడుందో నాకు అనవసరం.
మనం ముందు చేసామని చెప్పడానికి అది ఒక టెంటు, క్యాంప్ ఫైర్ అయినా నాకు అనవసరం.
మనకి ఒక విజయం కావాలి.
స్పుట్నిక్, గగారిన్, లియోనోవ్, బెలికోవా.
ప్రెసిడెంటుకి మరో సారి రెండో స్థానంలో రావడంలో ఆసక్తి లేదు.
మన అమ్మాయి ప్రమాదం పేపర్లలో అంతా రావడం అంత మంచి విషయం ఏమీ కాదు.
ఎన్నికలు రాబోతున్నాయి,
చూడబోతే టెడ్ కెన్నెడీ మన ప్రత్యర్ధి అయ్యేలా ఉన్నాడు.
అది చక్కని, మంచి పోరాటంలా ఉంటుంది.
ప్రెసిడెంటు అమెరికన్ ప్రజలకు
ఒక సంతోష సమాచారాన్ని ఇవ్వాలనుకుంటున్నారు.
కెన్నెడీని ఓడించేది.
ఎంత కావాలంటే అంత నవ్వుకో, కానీ ఈ ప్రోగ్రాం నిక్సన్ కారణంగా మాత్రమే ఇంకా ఉనికిలో ఉంది.
అపోలో 15 ఒక వినియోగించుకోగల సైట్ ను వెతుకుతుంది.
చంద్రుడి మీద మానవీయంగా నిర్వహించబడే మొట్ట మొదటి స్థావరం
అమెరికా జండాను ఎగరవేస్తుందని ప్రెసిడెంటు ప్రకటిస్తారు.
అభినందనలు, జెంటిల్ మెన్, మీరు చరిత్ర సృష్టించబోతున్నారు.
...వియత్నాం మరియు ఆగ్నేయ ఆసియాలో యుద్ధం ముగించి
గౌరవం మరియు శాంతిని తీసుకురావాలన్న ఒప్పందాన్ని పూర్తి చేసారు.
కాల్పుల విరమణ అమలులోకి వస్తుంది, 2400 గ్రీన్విచ్ మీన్ టైంలో,
నవంబర్ 16, 1970న.
యునైటెడ్ స్టేట్స్ మరియు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం
ఈ ఒప్పందం వియత్నాంలో స్థిరమైన శాంతిని నిర్ధారిస్తుందని మరియు పరిరక్షణకు
దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు...
ఒక నిమిషం ఉందా?
తప్పకుండా. కూర్చో.
నీకోసం ముందుగానే పుట్టిన రోజు బహుమతి తెచ్చాను.
ఏంటది?
- ఆయన ఇది ఆపేస్తున్నారు. - అవును, నాకు తెలుసు. నేనది చూస్తున్నాను.
కాదు. వియత్నాం కాదు. వేరేది.
ఇప్పుడా?
వారు శిక్షణ దాదాపు పూర్తి చేసేసారు.
శాంతి ఒప్పందం అందరి దృష్టిని బాగా తప్పిస్తుంది.
అందరికీ ఆశగా ఉండడానికి ఒక మంచి కారణాన్ని ఇస్తుంది.
నువ్వు సంతోషపడతావని అనుకున్నాను.
నన్ను అటూ ఇటూ తిప్పుతూ ఉంటే నాకది నచ్చదు.
ఈ మహిళలను సిద్దం చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా?
వారు ఎంత కష్టపడుతున్నారో, నేను అడిగిన ప్రతిదీ చేస్తున్నారు.
ఆయన విషయం అర్థం చేసుకున్నారు.
నేను ఏం చెప్పగలను?
సోవియట్లు మన వెనుక ఉంటే, ఆయనకు ఎటువంటి పరధ్యాస ఇప్పుడు నచ్చదు.
ఎన్నికలు సహాయం కూడా చేయలేదు.
అమెరికన్లకు స్త్రీలు భయంకరమైన విమాన ప్రమాదాలలో చనిపోవడం నచ్చదని తెలిసింది.
చూడు, సర్కస్ అయిపోయింది.
ఇప్పుడు నువ్వు నీ దృష్టినంతా పెట్టవలసిన లూనార్ స్థావరం మీద పెట్టవచ్చు.
27 అక్టోబర్ 1970
హే, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు?
నేను నిన్ను అడగడానికే వచ్చాను. ఇది నువ్వు ఏర్పాటు చేయలేదా?
నేను నువ్వు ఏర్పాటు చేసావనుకున్నాను.
వారు నాసాకి అవసరమైన శిక్షణను
పూర్తి చేసిన మొదటి మహిళలు.
ఇప్పుడు మీకు పరిచయం చేయడం నాకు అత్యంత గౌరవప్రదమైన విషయం...
అబ్బా.
ట్రేసీ స్టీవెన్స్.
No comments yet. Be the first to leave one.