Criminal Record

Criminal Record

Download Telugu Subtitle

Season 1

Release info

Criminal Record S01E05 WEB H264-RBB
A Commentary by sash35

Tags

web
x264
Web-DL
web-dl
WEB-DL
720p
720
1080
HD
Published on: 2024-01-31
Downloads: 18
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

మనస్ఫూర్తిగా చెప్తున్నా, వచ్చినందుకు థ్యాంక్స్.

నేనూ మనస్ఫూర్తిగా చెప్తున్నా, అది నా భాగ్యం.

అవును, కానీ ఉత్త పుణ్యానికి ఎవరూ డిన్నరుకు పిలవరు కదా?

- అంతే కదా, జూన్? - లియో.

- సరేనా? - నేను...

ఆఫీసు నుండి ఇంటికి వచ్చేటప్పుడు తనకి విషయం చెప్పా.

లేదు, అది ఆసక్తికరంగానే ఉంది.

సరే మరి. ఆ వ్యక్తి.

చెప్పు మరి.

వైద్య విషయాలను చర్చించేటప్పుడు తాగకూడదు అంటారు, ఎందుకో మరి?

థ్యాంక్యూ. అతను మగవాడే కదా?

మరి, అతను కారు ప్రమాదం తర్వాత...

అతనికి ఏమీ గుర్తు లేదని చెప్పాడు.

ఫ్లాట్ కి వెళ్లినప్పటి నుండి ఆస్పత్రిలో చేరేదాకా ఏం జరిగిందో

అతనికి అస్సలు గుర్తు లేదట.

ఆ తర్వాత, అతనికి గుర్తొచ్చి, నేరాన్ని ఒప్పుకున్నాడు, అంతే కదా?

హా, కానీ నేను తెలుసుకొన్న సమాచారం ప్రకారం, న్యూరలాజికల్ గా అది భలే చిత్రమైన పరిస్థితి అట.

అంటే, హిప్పోక్యాంపస్...

మెదడులో జ్ఞాపకాలన్నీ అక్కడే ఉంటాయి, అక్కడి నుండే మనం గుర్తు తెచ్చుకుంటాం...

అది చిన్ని లెగ్యూమ్ ఆకారంలో ఉంటుంది.

లెగ్యూమ్ అంటే?

చిక్కుడు గింజ ఆకారం, ఏదైనా ఘటన వలన నలిగిపోతున్నప్పుడు అది కుచించుకుపోతుంది,

అప్పుడు జ్ఞాపకాలు సరిగ్గా గుర్తుండవు.

మరి, ఎర్రొల్ కి అవి ఎలా జ్ఞాపకం వచ్చి,

అన్ని వివరాలు చెప్తూ ఒప్పుకున్నాడు?

ఇదే తనకి నిద్ర లేకుండా చేస్తోందని నీకు చెప్పా కదా.

హా.

మనకి జ్ఞాపకాలు ఎలా గుర్తుంటాయి అంటే

మన గతం తాలూకు వీడియోల లాగా అన్నమాట.

కానీ వాటిని పెయింటింగ్స్ తో పోల్చితే ఇంకా అర్థవంతంగా ఉంటుంది.

మనం ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ, పొర మీద పొర పెయింట్ వేస్తూ ఉంటాం.

ఇతరులు కూడా అలా పెయింట్ చేయవచ్చు.

అంటే... ఇతరులు కూడా మన జ్ఞాపకాలను మార్చగలరా?

హా. అవును. దాని గురించి నా పాడ్ కాస్టులో వివరంగా చెప్పాను.

అది అసాధ్యంలా అనిపిస్తోంది.

అవునా, జూన్? సరే.

ఎప్పుడైనా కుదిరినప్పుడు నా ల్యాబ్ కి రా.

నీ జ్ఞాపకాలని హ్యాక్ చేసి చూపిస్తా.

మనం చిన్ననాటి మిత్రులమని నమ్మిస్తా.

మీ బామ్మ ఇంటి పెరట్లో ఉన్న ఊయలలో పాట పాడామని కూడా నమ్మిస్తా.

మా బామ్మ ఇంట్లో ఊయల లేనే లేదు.

అలా అని నీకు ఖచ్చితంగా తెలుసా? ఒకవేళ నీకు ఉన్నట్టు ఫోటో చూపిస్తే?

విషయం ఏంటంటే, మన జ్ఞాపకాల మీద ఓ పొర పెయింట్ చేయబడినప్పుడు...

ఈ వారపు స్టార్

...మనకి ఆ తాజా వెర్షనే గుర్తు ఉంటుంది.

అసలైన జ్ఞాపకం గుర్తు ఉండదు.

ఈ వారపు స్టార్ అభినందనలు

చాలినంత వేదనకు ఎవరైనా గురైతే,

జనాలు తమ జ్ఞాపకాలను పూర్తిగా కోల్పోతారు.

అయితే, ఎర్రొల్ బుర్రలో ఎవరైనా తప్పుడు జ్ఞాపకాన్ని చొప్పించారా అనేదే నీ సందేహమైతే,

అవును. సిద్ధాంతపరంగా అది సాధ్యమే.

అది చాలా అంటే చాలా తేలిక.

నువ్వంటే తనకి భలే ఇష్టం.

నాకు కూడా.

- నువ్వునుకునే ఇష్టం కాదు. ఆకర్షణ. - ఏంటి?

నీ ఆలోచనలన్నీ చాలా పాతవి.

నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అర్థమైంది. నేను ఉబ్బితబ్బిబైపోతున్నాలే.

- నువ్వు డిటెక్టివ్ అనుకున్నానే. - పంచులు ఆపు.

హా, తను ఆకర్షితురాలు అయిపోయింది. తన టేస్ట్ బాగానే ఉంది అనుకో.

జూన్.

నువ్వు నాకు కూడా విషయాలు చెప్పవచ్చు, అవును కదా?

నాది ఎప్పుడూ నీ పక్షమే. పైకి అలా కనిపించనేమో, అంతే.

తెలుసు.

ప్రొబేషన్ లో ఉంచబడుతున్న మెట్రోపాలిటన్ పోలీసుల సంఖ్య పెరుగుతోంది

యూకేలోని పోలీసులలో పెరుగుతున్న విపరీతమైన ఛాందసవాదం

మెట్రోపాలిటన్ పోలీసును తీసివేయాలని, విచారణ చేపట్టాలని డిమాండ్

విపరీత ఛాందసవాద వర్గంతో అనైతికపరమైన సంబంధాల విషయంలో ఇంకా ఉన్న సందేహాలు

సందర్శన హాలు

నీ గురించి కొంచెం ఆలోచించాను.

అవునా?

నా గురించి... కొంచెం ఆలోచించావా?

- క్లైవ్. - హా?

నిన్ను ఒకటి అడగవచ్చా?

కానీ అది మన మధ్య రహస్యంగా ఉండాలి.

సరే.

విపరీత ఛాందసవాద వర్గం.

నువ్వు టీనేజీలో ఉండగా అందులో చేరావు కదా? హా?

నేను నీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను,

ఆ ఫోటోల్లో ఉన్నవాళ్లు ఎవరైనా

ఆ వర్గంలో సభ్యులుగా ఉన్నారో లేదో నువ్వు చెప్పాలి.

అర్థమైందా?

పోలీసు.

- ఏం చేస్తున్నావు? - చెప్పు.

కాదు.

నీకు ఖచ్చితంగా తెలుసా?

హా, ఖచ్చితంగా తెలుసు.

ఆ వర్గంలో ఇతడినైతే ఎప్పుడూ నేను చూడలేదు.

మరి ఇతను?

ఇతను?

నీకు ఇతను తెలుసు.

తెలుసు.

టోనీ గురించి మా అందరికీ తెలుసు.

టోనీ గిల్ఫోయిల్.

నేను డిటెక్టివ్ సార్జెంట్ జూన్ లెంకర్ ని. డాల్స్టన్ లేన్ సిఐడిని.

దయచేసి ఓ పెట్టెని కారులో పెట్టగలరా?

హా. ఇబ్బంది పెడుతున్నందుకు మన్నించండి.

మీరు కాస్త సాయపడగలరా? కానీ అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.

- ఇది కూడా. - అది...

ఒక దర్యాప్తులో భాగంగా ఒక సాక్షి

మీ పేరును వెల్లడించారు.

దీన్ని దాని పైన పెట్టగలరా? నేను లోపలికి వెళ్లి చక్రాల కుర్చీ తెస్తాను.

చూడండి, మీరు ఒక రాజకీయ పార్టీలో

ఒకప్పుడు సభ్యులుగా ఉన్నారని ఆరోపించారు.

పోలీసులకు ఏ రాజకీయ పార్టీలో కూడా

సభ్యత్వం ఉండకూడదు, పైగా ఇది విపరీత ఛాందస వర్గం.

అది నాజీజానికి వత్తాసు పలికే వర్గం. బ్లడ్ లైన్ అని కూడా అంటారు కదా?

కాబట్టి, ఆ వర్గంలో ఎప్పుడైనా మీరు సభ్యునిగా ఉన్నారా?

డాల్స్టన్ లేన్ స్టేషన్ కి ఇప్పుడు కూడా రాయ్ చాంబర్సే కదా ఇన్ ఛార్జీ?

అతనికి ఫోన్ చేసి మాట్లాడనా?

ఎర్రొల్ మ్యాథిస్ నేరాంగీకారం గురించి చెప్పండి.

అదే అడుగుతావు అనుకున్నా.

అది చెప్పండి చాలు, నేను మీ గురించి విన్నదంతా మర్చిపోతా.

హా, నువ్వు బెదిరింపులకు దిగుతావని కూడా విన్నా.

అలా బెదిరింపులకు పాల్పడే వారి గురించి

మా అమ్మ ఏం చెప్పేదో తెలుసా... వారితో వాదనలకు దిగి వృథా అట.

నేరుగా వారి కళ్లలోకి చూసి, "మూసుకొని దొబ్బేయ్," అని చెప్పాలట.

చూడు.

నువ్వేమనుకున్నా నాకు అనవసరం. బై-బై.

- హా, హలో. - హాయ్, గురూ. చెప్పేది విను.

పరిస్థితి ఏమంత బాగాలేదు.

బాబోయ్. తను టోనీ ఇంటికి వెళ్లింది. తను చాలా...

పద. బయలుదేరు.

బాస్, తను మనపై కయ్యానికి కాలు దువ్వుతోంది.

ఇందులో నీకు ఏంటి సంబంధం?

అతనికి ఆరోగ్యం బాగాలేదు, కదా? అతను చాలా ఏళ్లు పోలీసుగా పని చేశాడు. ఇలాగేనా అతనితో వ్యవహరించేది?

కిమ్, దీన్ని నేను చూసుకుంటా. నిజంగానే చెప్తున్నా.

టోనీకి మన మద్దతు ఉంటుంది.

మనం దీనికి ధీటుగా ప్రతిస్పందించాలి, అతనికి అండగా నిలవాలి.

చూడు, నువ్వూ, టోనీ ఎప్పుడూ ఇలాగే చేస్తారు.

ఒకరినొకరు ఊరికే కంగారుపెట్టుకుంటారు.

హాయ్, హా.

- ఇక్కడ ఉన్నావా! - ఒకరిని అరెస్ట్ చేశారని విన్నాను.

మరి, సమస్య ఏంటి?

సమస్య ఏమీ లేదు. ఫ్లాట్ గురించి వచ్చాను.

నా మిత్రుడు ఒకరికి సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కావాలి. అతని పేరు పాట్రిక్.

డిపాజిట్ గా అది ఉంచుకో.

- రేపు అయితే పర్లేదు కదా. - హా.

పోయిన వారం, హెగర్టీ ఈ చోటికి వెళ్లాడు, ఆ ఫోటోలు కూడా నేను తీశాను.

అక్కడున్న ఒక ఏటీఎమ్ కి వెళ్లి, చాలా డబ్బులు తీశాడు.

బాబోయ్, సోనియా, అతడిపై నిఘా పెట్టారా మీరు?

ఎందుకంత భయపడుతున్నావు?

- సహోద్యోగిపై నేను నిఘా పెట్టలేను. - కానీ మేము పెట్టవచ్చు కదా?

మరి టోనీ గిల్ఫోయిల్ సంగతేంటి?

- నాకు తెలిసి మనం... - చూడు, హెగర్టీ తీరు అనుమానాస్పదంగా ఉంది.

అది మనిద్దరికీ తెలుసు కదా. డ్రైవరుగా ఎందుకు చేస్తున్నాడు?

అలా వచ్చిన డబ్బుతో ఏం చేస్తున్నాడు? వీటికి సమాధానం మనకి ఇప్పటికి తెలిసింది కదా.

ఏంటి? అతను తివాచీల దుకాణానికి వెళ్తున్నాడా?

జూన్, అది డ్రగ్స్ దుకాణం, తివాచీల దుకాణం కాదు.

దాన్ని మిరాస్ మన్సూర్ అనే వ్యక్తి నడిపిస్తున్నాడు.

వారు డ్రగ్స్ అమ్ముతారు. హోల్ సేల్ గా భారీ మొత్తాల్లో హెరాయిన్ ని అమ్ముతారు.

హెగర్టీ అక్కడికి తరచుగా వెళ్తుంటాడు.

నేను ఆఫీసుకు వెళ్లాలి.

నీకు అర్థంచేసుకోవాలని లేదా?

అతడిని ఎవరో బెదిరిస్తున్నారు,

లేదా డ్రగ్స్ వర్తకంలో అతనికి కూడా భాగం ఏమో.

నువ్వే కదా చెప్పావు, జూన్. అతను ఏమైనా చేయగల నేర్పరి అని.

- హేయ్. - వచ్చి తీసుకో. తీసుకో.

- హేయ్, నాకొక చాక్లెట్ ఇవ్వు. - నాక్కూడా.

ఇక్కడున్నారు.

ఈ పిల్లాడు భలే వింత మనిషి అబ్బా.

దరిద్రంగా ఉంది.

నీ నోటికి అలానే ఉంటుంది.

అసలు నువ్వు పళ్ళు తోముకోవు కదా!

నీ నోటి నుండి కంపు...

మేము పోలీసులం.

- చేతులు పక్కకి పెట్టండి. - పెట్టండి.

బ్యాగులు కింద పెట్టేసి, వెనక్కి తిరగండి.

ఏంటిది?

ఏంటిది?

- బాబోయ్. - అది నాది కాదు.

మరి నీ బ్యాగులోకి ఎలా వచ్చింది?

సరే. మీ ఇద్దరూ వెళ్లిపోవచ్చు.

- పద. - పద.

జేకబ్? మన ఏడవ నంబర్ ఆటగాడు ఎక్కడ? జేకబ్?

జేకబ్, దాన్ని పక్కకు పెట్టేయ్,

- ఏంటి సంగతి? - హార్ప్స్ లేన్ లో పట్టుకున్నాం ఇతడిని.

లైన్ వెనుక నిలబడాలి.

- నేరం ఏంటి? - సరఫరా చేయాలనే ఉద్దేశంతో డ్రగ్స్ ఉంచుకున్నాడు.

సరే.

సరే మరి.

పేరు ఏంటి?

జేకబ్ టేలర్.

ముందుకు రా.

నువ్వు ఎవరికైతే కాల్ చేయాలనుకుంటున్నావో,

వారి పేర్లు, ఫోన్ నంబర్లు రాయి, ముగ్గురివే రాయాలి.

నీ ఫోన్ తో కాల్ చేయవచ్చు.

త్వరగా.

సరే.

ఎత్తు, అమ్మా.

మీరు డయల్ చేస్తున్న నంబరుకు కనెక్ట్ చేయడం సాధ్యపడలేదు.

దయచేసి కాసేపాగి ప్రయత్నించండి.

మీరు డయల్ చేస్తున్న నంబరుకు కనెక్ట్ చేయడం సాధ్యపడలేదు. దయచేసి కాసేపాగి ప్రయత్నించండి.

ఇంకెవరికైనా కాల్ చేయగలవా?

నా ఫోన్ ఎక్కడ ఉంది? ఎక్కడ? దేవుడా.

ఎక్కడ ఉంది రా నాయనా?

- హలో. - బామ్మా, నన్ను అరెస్ట్ చేశారు.

- ఏంటి? - వచ్చి నన్ను తీసుకెళ్లగలవా?

ఎక్కడ ఉన్నావు, డార్లింగ్? ఎక్కడ?

పోలీసు స్టేషనులో ఉన్నా.

చిరునామా చెప్పు. వస్తున్నాను. నీ కోసం వస్తున్నా.

More Telugu subtitles for Criminal Record

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left