Ride or Die

Ride or Die

Download Telugu Subtitle

Season 1

Release info

Ride or Die S01E07 The Geneva Convention 1080p WEBRip 10Bit DDP5 1 x265-NeoNoir
A Commentary by chargephoton88

Tags

webdl
Published on: 2026-08-21
Downloads: 0
Hearing Impaired: No
FPS: 23.976

Telugu subtitle preview

The first 200 lines.

ప్రీవియస్లీ ఆన్ రైడ్ ఆర్ డై…

నేను రెడ్‌బ్యాక్‌ను.

ఈమె విప్‌టైల్, ఈమె నా ప్రాణ స్నేహితురాలు.

నేను ఉద్యోగానికి దరఖాస్తు చేశా.

- ఏ ఉద్యోగం? - మళ్ళీ న్యాయ రంగంలోకే వెళుతున్నా.

- నిన్ను చూసి గర్విస్తున్నా. - ఉద్యోగం న్యూ యార్క్‌లో.

నేను అత్యంత దారుణమైన పని చేశా.

రెడ్‌బ్యాక్ బతికే ఉంది.

ఆమె బతికే ఉంది!

అయ్యో. అయ్యో.

నువ్వు తర్వాత చేయబోయే దాని గురించి నిన్ను హెచ్చరిస్తున్నా.

నీ హెచ్చరికను ఖాతరు చేయను, ఎందుకంటే ఆమెను చంపేస్తాను.

రా, వెళదాం.

నన్ను తీసుకెళ్ళండి, ప్లీజ్.

ఆమె ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు.

దిగులుపడకు, నాన్నా. ఇది చూసుకుంటా.

హలో. గుడ్…

ఇక్కడి నుండి పారిపోతున్నాం.

- ఆమె ఎవరు? - ఆమె నా మాజీ భార్య.

నీ మాజీ భార్య పోలీసా?

ఈ చోటునంతా చుట్టుముడతారు.

మనం ఇతన్ని నమ్మలేమని చెప్పాగా.

ఆమెను కాపాడటం కోసం, నేను ఏం చేయడానికైనా వెనుకాడను.

ఆమె నిన్ను నమ్మింది.

కాబట్టి నిన్ను నమ్ముతున్నా.

ఆమె జాగ్రత్త.

జ్యూడిత్.

జ్యూడిత్, లే.

డెబ్బీ.

బిల్లీ?

హేయ్, క్షమించు, చాలా సేపు వెళ్ళిపోయా, కానీ రోడ్డు పక్కన

నాకు ఈ క్రొసాంట్స్ అమ్మే బేకరీ కనపడింది.

దేవుడి మీద ఒట్టు, ఇవి నా జీవితంలో తిన్న అత్యుత్తమ…

- నేను వెళ్ళిపోయానని అనుకున్నావు. - లేదు.

అవును.

ఏంటిది.

నీకు కారు ఉంది, నువ్వు…

అవును కదా. నాకు కారు అందుబాటులో ఉంది. నేను అలా…

నేనొక వెధవను.

నేను నీతోనే ఉంటా, పిల్లా.

నేను నీతోనే ఉంటా.

ఈ కాల్ ముఖ్యమైనది కావాలని ఆశిస్తున్నా.

అవునా?

తమాషా చేస్తున్నావు. ఓరి దేవుడా.

సరే, సరే. సరే, ఆగు. ఇప్పుడే రాసుకుంటున్నా.

అవునా?

బాబు, నువ్వు జీవితాలను కాపాడేవాడివి. థాంక్యూ.

సరే, ఉంటాను.

ఇలైహ చేశాడు. డబ్బు దొరికిందంట.

అది జెనీవాలో ఉంది.

బిల్లీ డోనోవన్

అతను నమ్మాడా?

అవును, నమ్మాడు.

మన మధ్య ఒప్పందం ఉంది.

నా కట్లు విప్పు.

అవును. ఒప్పందం.

రైడ్ ఆర్ డై

ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్

నా చెత్త నా భర్త ఎక్కడున్నాడో,

లేదా అతను చోరీ చేసిన డబ్బు ఎక్కడుందో నాకు తెలియదు.

సరే.

మరి దీని సంగతేంటి?

నకిలీ పాస్‌పోర్ట్.

ఈ దేశంలోని ప్రతి మోసాల దర్యాప్తు శాఖతో దీన్ని చెక్ చేయించాం.

వాళ్ళు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు.

బొత్తిగా అమాయకురాలైన ఒక ఎంపీ భార్య చేతికి

ఇలాంటిది రావాలంటే ఆమెకు ఎవరెవరు తెలుసుండాలి?

లెస్టర్ స్క్వేర్‌కు వెళ్ళాను. "ఇది నగరంలో దొంగపనులు జరిగే చోటు," అనుకున్నా.

చుట్టూ ఉన్న వాళ్ళను అడిగా.

ఎమ్ & ఎమ్ వరల్డ్ బయట ఉన్న ఒక వ్యక్తిని జనాలు నాకు చూపించారు,

అతను ముఖచిత్రాలు, పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తాడన్నారు.

నాకు మంచి ధరకే దొరికింది, ఎందుకంటే నా ముఖచిత్రం కోసం కూర్చున్నా.

నా చిత్రం పేలవంగా వచ్చింది, నిజంగా. తల చాలా పెద్దగా వచ్చింది.

మిసెస్ క్లేబార్న్, నా ముందు అతితెలివి ప్రదర్శించకు.

నువ్వు చాలా పెద్ద సమస్యలో చిక్కుకున్నావు.

మా మధ్య ఒప్పందం ఉంది.

నువ్వు నాకు సాయం చేస్తే, అల్బేనియా ముఠాను ఆపడానికి నేను సాయం చేస్తా. ఇక్కడున్నా.

నా మాట నిలబెట్టుకుంటున్నా. మనం సమయం వృధా చేస్తున్నాం.

ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నావా?

అల్బేనియా ముఠా డ్రగ్స్ రవాణా ఎలా చేస్తోందో తెలుసని చెప్పింది.

నీ కళ్ళుగప్పిన నేరస్తురాలు చెప్పిన మాటపై

మన మొత్తం పరువును ముప్పులో పెడుతున్నాం. చెప్పు!

విను, డెబ్బీ. నేను నీకు సాయం చేయాలని చూస్తున్నా.

కానీ నువ్వు నాతో నిజాయితీగా మాట్లాడటం మొదలుపెట్టాలి.

ఈమె ఎవరు?

ఆమె అనామకురాలు.

పరిచయస్తురాలు. ఆమె గురించి కొద్దిగానే తెలుసు. ఆమెకు దీంతో ఏ సంబంధం లేదు.

ఆమె ఆర్థిక నేరాల దర్యాప్తు అధికారి.

ఆర్థిక నేరాల దర్యాప్తు అధికారా?

ఎవరినైతే కాపాడటానికి నువ్వు జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్నావో?

నీ కథ అసంబద్ధంగా ఉంది, డెబ్బీ. ఏంటిది.

నువ్వు నాకు చెప్పని విషయం ఏంటి?

చూడండి, మిసెస్ క్లేబార్న్.

మేము డబ్బును కనుగొన్నాం.

ఏంటి?

ఎక్కడుంది?

మొనాకో ఖాతా నుండి ఖాళీ అయ్యాక దాని జాడ పసిగట్టాం.

అదిప్పుడు జెనీవాలో ఉంది. ఒక భాగస్వామ్య బ్యాంకు ఖాతాలో.

నీ పేరు మీద.

నేనొక ఫోన్ కాల్ చేసుకోవాలి.

జెనీవా

అయితే ఇది సురక్షితమైన ఇల్లా?

నేను అద్దెకు తీసుకున్న అపార్ట్‌మెంట్.

మరీ సౌకర్యంగా ఉండకు.

మనం వెళతాం, డబ్బు తీసుకుంటాం, అల్బేనియా ముఠాకు చెల్లిస్తాం, డెబ్బీని కాపాడుతాం.

ఆ తర్వాత ఏం జరుగుతుంది?

ఆ తర్వాత…

ఏం జరిగితే అది.

నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు.

నీ సంగతేంటి? ఎక్కడికి వెళుతున్నావు?

ఆనాను కనుక్కోవడానికి వెళతాను.

నేను ఆమెను చంపేస్తాను.

ఇక్కడేం చేస్తున్నావు?

దరిద్రపుగొట్టు డేవిడ్.

ఇక్కడేం చేస్తూన్నావురా?

అతన్ని చంపకండి! అతన్ని చంపకండి!

నా అపార్ట్‌మెంట్‌లో మీరేం చేస్తున్నారు?

- హేయ్. ఎమిలియా నాకు తాళాలు ఇచ్చింది. - ఎవరు?

నీ పనిమనిషి.

- నాకు పనిమనిషి లేదు. - మ్యాజిక్‌తో ఇల్లు శుభ్రమవుతోందా?

నీ సురక్షితమైన ఇళ్ళకు పనిమనుషుల ఏర్పాటు నా పనే.

నిజానికి, ఎమిలియాకు, నాకు మంచి అనుబంధం ఉంది.

ఆమె మోకాలి పరిస్థితి ఇప్పుడు బాగోలేదు.

ఆగు. ఇంతకీ నువ్వెవరు,

ఈ దరిద్రపుగొట్టు సన్నాసితో నువ్వేం చేస్తున్నావు?

అతన్ని చంపకు! అంటే, కావాలంటే తర్వాత చంపుకో.

ఆనా ఆచూకీ ఇతని ద్వారానే మాకు తెలిసింది.

ఎక్కడ? ఆమె ఎక్కడుంది, క్వీనీ?

అంటే, అతని డబ్బు కోసం చూస్తోంది. అందుకే మేము ఇక్కడున్నాం.

ఆమె తీసుకునే లోపే మేము తీసేసుకుంటాం.

ఆమె నా పన్ను పీకేసింది.

నోర్మూసుకుని చావరా.

ఆమె శృంగారంతో నన్ను మోసం చేసింది.

అవును, ఆమె…

సరే, ఏది ఏమైనా…

మేము ఆమెను చంపేస్తాం, కనుక…

ఆగు.

నాకు శరీర స్పర్శ బొత్తిగా ఇష్టం లేదు.

నీకు నేనున్నా.

సరేనా? ఇక్కడున్నాను. దిగులుపడకు.

మనం ఆమెను చంపుదాం.

నా దుస్తులు ఎలా ఉన్నాయో మీకు చూపించాలనుకున్నా.

ఇది సాధారణంగా ఉన్నా, సొగసుగా ఉంది.

ఓరి దేవుడా.

ఇతను ఆకాశం నుండి కిందపడ్డాడు. మనం కట్ చేయాలి…

లండన్ క్రానికల్ కిటికీలో నుండి శవం పడటంతో భయాందోళనలు

టెన్నిస్ పాఠాలు

పవిత్ర బైబిలు

అపోస్తలుల కార్యములు 15:23

పౌలు, తిమోతి భేటీ

13 విశ్రాంతి దినమున మేము పట్టణపు గవిని దాటి, నదీతీరమునకు వెళ్లి,

నిన్న రాత్రి సంఘటన అదుపులో ఉంది.

తొలిపేజీ వార్తను నేను "అదుపులో ఉంది" అని అంటాననుకోను.

నగరంలో సగం మంది ఫోన్లలో ఆ వీడియో ఉంది,

ఏడంతస్తుల భవనం నుండి శవం కిందపడిన వీడియో.

- అది ఒంటరి ఘటన. - అవునా?

మీవాళ్ళల్లో ఒకరు అల్బేనియా ముఠాకు చెందిన ముగ్గురిని ఈమధ్యే కాల్చి చంపారు.

సెంట్రల్ లండన్‌లో శవం కిందపడింది, ఇంటర్‌పోల్ దగ్గర ఒక శవం ఉంది.

వేలిముద్రల జాడలేని శవాల మధ్యనున్న

లంకెను కనిపెట్టడానికి ఎంత సమయం పడుతుంది?

- వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. - ఇంకా లేవు.

జాక్, నీ సంస్థ ఉనికిలో ఉండటానికి కారణం

అది ఉనికిలో ఉండదని నువ్వు నాకు ఇచ్చిన హామీల వల్లే.

మన మధ్య పరస్పర లాభదాయక బంధం ఉండటానికి కారణం,

నువ్వు చీకటి నీడల్లో జీవిస్తే, నేను ప్రశ్నలు అడగకపోవడం.

కానీ ఇప్పుడు నువ్వు వెలుగులోకి రావడంతో, నేను అడగక తప్పదు.

ఇంతకీ ఏం జరుగుతోంది?

దీని వెనుక ఎవరున్నారు?

ఆమె ఒక మాజీ ఏజెంట్. ఆమె చనిపోయిందని అనుకున్నాం.

శిక్షణ నువ్వు ఇచ్చావా?

మంచిదే.

అంటే, అత్యున్నత ప్రతిభకల ఒక అంతర్జాతీయ హంతకురాలు

మీ సంస్థ వైపు అందరి దృష్టిని మరల్చడానికి చురుకుగా పని చేస్తోంది.

నీ చేతుల్లో టైం బాంబ్ ఉంది.

నీ ఇల్లు చక్కబెట్టుకో, జాక్, లేదంటే మేము చక్కబెడతాం.

నన్ను చెక్కతో కొట్టావంటే నమ్మలేకపోతున్నాను.

అది అడుగున పెట్టే పాత్ర.

మీరిద్దరూ నిశ్శబ్దంగా ఉండండి. శాంతించండి.

రైలులో మాకు నువ్వు డబ్బు గురించి చెప్పిన విషయాలు వాళ్ళకు చెప్పకూడదా?

మీకు తెలుసుగా, అల్బేనియా ముఠాతో కొన్ని లావాదేవీలు చేశా,

రవాణా బిల్లు పరిస్థితిని వారికి అనుకూలం చేయడానికి.

ఆపై డెబ్బీ దాన్ని చెడగొట్టడం మొదలుపెట్టింది,

- అది… - నిన్ను చంపమంటావా?

ఎందుకంటే చంపగలను.

ఆమె నిన్ను విజేతను చేసింది. కాసింత మర్యాద చూపించు.

డెబ్బీ అంత అద్భుతమైన పని చేసే సరికి,

నేను డబ్బు తిరిగి ఇచ్చేయాల్సి వస్తుందని నాకు స్పష్టమైంది.

దాంతో, ఏమని ఆలోచించానంటే, డబ్బు చేతిలో ఉండగా, దానిని పనిలో ఎందుకు పెట్టకూడదు?

దాంతో ఆ డబ్బును, ఒక చక్కని వడ్డీ రేటుతో స్విస్ బ్యాంక్ ఖాతాలో వేశాను.

నా ప్రణాళిక ఏంటంటే, ఒక వేళ బిల్లు విఫలమైతే నా వాటా డబ్బు నేను పెట్టుకోవచ్చు.

కానీ అది ఆమోదం పొందితే, నేను డబ్బు తిరిగివ్వాల్సి వస్తే, అప్పుడు…

నేను వడ్డీనైనా అలాగే పెట్టుకోవచ్చు.

- ఈ విషయమై నాకు గర్వంగా లేదు. - తెగ గర్వపడుతున్నట్టు కనపడుతున్నావు.

ఏమంటున్నానంటే, ఆ పరిస్థితుల్లో,

అదొక సాపేక్షమైన సహేతుకమైన ఆర్థిక నిర్ణయం.

అపజయం అన్నది సమయం అయిపోయిన విజయమే.

- ఏంటి ఈ సోది? - నేను అపహరణకు

గురవుతానని నాకు కచ్చితంగా తెలియదు.

డెబ్బీ ఇది కనుక్కుంటుందని లేదా అల్బేనియా ముఠా

ఆమెను వెంబడిస్తుందని లేదా ఇంకేదీ నాకు తెలియదు.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left