Season 1

Release info

The Completely Made-Up Adventures Of Dick Turpin S01E06 XviD-AFG
A Commentary by sash35

Tags

XviD
web
x264
Web-DL
web-dl
WEB-DL
720p
720
1080
HD
x265
HEVC
480p
480
Published on: 2024-03-29
Downloads: 11
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

డిక్ టర్పిన్ కథని తెలుసుకోండి,

ఎస్సెక్స్ కనీవినీ ఎరుగని అత్యంత "కీర్తిమంతుడైన" దారిదోపిడీ దొంగ.

దొంగల్ని పట్టుకునే అధికారులతో, తెలివితక్కువ మంత్రగత్తెలతో ధైర్యంగా పోరాడి,

అతని పేరు విన్నవారందరికీ హీరో అయ్యాడు. కానీ ఆ తరువాత...

అతను ఒక పెద్ద, మానసిక స్థిమితంలేని పిరికివాడిగా వెల్లడయి

హెంప్ స్టెడ్ నీ, మీ అందరినీ ద్వేషించాడు.

ముఖ్యంగా ఆడవారినీ ఇంకా పిల్లల్నీ.

అవన్నీ పూర్తిగా అబద్ధాలు.

ఆడవారినీ, పిల్లల్నీ డిక్ ప్రేమించేవాడు.

ఇంకా అతను ఎప్పుడూ మా మీద నిలబడలేదు.

నా మీద నిలబడకపోవడాన్ని నేను మిస్ అవుతున్నాను.

కానీ భయపడకండి, ఎందుకంటే నేను, టామీ సిల్వర్ సైడ్స్ ని,

నేనే ఈ ప్రజలకు అసలైన దారిదోపిడీ దొంగని.

నన్ను ముట్టుకోకు.

చూశావా?

టర్పిన్ ని ద్వేషించడానికి వాళ్లకి ఎక్కువ సమయం పట్టలేదు.

వాళ్లు అతనికి వ్యతిరేకంగా లేరు.

కేవలం ఆ మూర్ఖుడు, అందగాడు, ఎదురులేని వెధవ,

ఆ టామీ గాడి మాయలో పడి తికమకపడుతున్నారు.

వాళ్లు అదే మాదిరిగా ఉండేలా చూడటం నీ పని.

నేను అలా చేస్తే, అతడిని చంపనని నాకు ప్రామిస్ చేయి.

- అలాగే. మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. - లేదా అతడిని హింసించకు.

బంగారం, అది హింస పెట్టే స్థావరం.

అక్కడ కొద్దిగా హింస తప్పదు.

నాకు ప్రామిస్ చేయి, అమ్మా.

డిక్ టర్పిన్ ని హింస పెట్టడం గానీ చంపడం గానీ చేయనని ప్రామిస్ చేస్తున్నాను.

- సంతోషమేనా? - సరే, థాంక్యూ.

ఈ తల్లీకూతుళ్ల అనుబంధాన్ని నేను మిస్ అవుతున్నాను.

మనం రోజంతా స్పాలో గడపాలి.

ప్రజలారా, ఆపండి. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇంక చాలు.

మన సాహసవంతుడైన కొత్త దారిదోపిడీ దొంగకి జేజేలు!

- హుర్రే! - మీరు చాలా దయగలవారు.

దూరంగా వెళ్లు. వెనక్కి తిరిగి వెళ్లు. నిజంగా, నాకు ఎవరైనా ముట్టుకుంటే చిరాకు.

కావలెను ఎస్సెక్స్ గ్యాంగ్

సిండికేట్ జైలు అల్పాహారం పూర్తయిన కొద్దిసేపు తరువాత

చూడటానికి బాగానే ఉంది.

ఓహ్, దేవుడా. మళ్లీ వచ్చావు.

జెఫ్రీ, నువ్వే నా మొదటి సందర్శకుడివి.

కేకులో చిన్న రంపాన్ని దాచి నా కోసం తీసుకొచ్చావా?

ఈ ఊచల కోసం కాదు. నా గోళ్లు బాగా పెరిగిపోతున్నాయి.

నేను నీ గార్డ్ ని.

ఆ మంత్రగత్తె వ్యవహారం తరువాత,

నీలాంటి మూర్ఖులకు దూరంగా ఉందామని నేను ప్రైవేటు ఉద్యోగానికి వెళ్లిపోయాను,

కానీ దురదృష్టం కొద్దీ మళ్లీ ఇక్కడ ఉన్నాను.

జెఫ్రీ, నువ్వు ఇక్కడ ఉన్నందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది. నిజంగా ఈ జైలు నా కోసం బుక్ చేశారా?

ఇంకా విశాలమైనది, బాత్ రూమ్ లాంటి సౌకర్యాలతో ఉన్నది లేదా?

హోటల్ సూట్ సౌకర్యం ఒకటి ఉంది. అదిగో అక్కడ బకెట్ ఉంది. చూడు.

వాన పడినప్పుడు, పైకప్పు లీక్ అవుతుంది, కదా, అది నీకు షవర్ అవుతుంది.

- షవర్, కేవలం నా కోసమేనా? - లేదు. మిగతా అందరు ఖైదీలకి వస్తుంది.

భోజనం ఎలా ఉంటుంది?

ఆ గోడ మీద కొద్దిగా ఎండిన నాచు ఉంది, నీకు ఇష్టమైతే తినచ్చు.

మంచిది. నేను తరువాత దాన్ని నాకుతాను.

అయితే, నా గ్యాంగ్ నన్ను కాపాడటానికి బయలుదేరి ఉంటారు,

కానీ అనుకోనిది ఏదైనా జరిగితే, తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా?

లేదు. లేదు, తప్పించుకునే ప్రసక్తి లేదు, టర్పిన్.

అందుకే ఈ ప్రదేశాన్ని వాళ్లు ఏమని పిలుస్తారంటే, "నీకు ఇష్టం లేని రెండో కజిన్ పెళ్లి" అని.

ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడి ప్రయత్నించినా, నువ్వు దాని నుండి బయటపడలేవు.

- ఉంటాను, మిత్రమా. - ఎక్కడికి వెళ్తున్నావు?

విచిత్రంగా, నిజంగానే మా రెండో కజిన్ పెళ్లి ఉంది.

కాబట్టి...

ఇది టామీ టైమ్!

మీ మొదటి పనితీరు సమీక్ష సమావేశానికి స్వాగతం.

మీ అందరికీ కొత్త యూనిఫారాలు వచ్చాయని తెలుస్తోంది.

మీరు నా వెనుక చాలా గొప్పగా కనిపించబోతున్నారు. ముఖ్యంగా నువ్వు, నెల్.

ఇంక ఆపు, టామీ.

నీ ఇష్టం వచ్చినట్లు నన్ను పొగడచ్చు.

అవును, నీ అందమైన కళ్లతో కొంటెగా చూడచ్చు.

నువ్వు కావాలంటే నన్ను ముద్దు కూడా పెట్టుకోవచ్చు.

కానీ ఏదీ పని చేయదు.

నీకు దమ్ముంటే నన్ను ముద్దు పెట్టుకోమని సవాలు చేస్తాను.

నన్ను ముద్దు పెట్టుకో, ప్లీజ్.

- ముద్దు పెట్టుకో. ఇక్కడ. - నెల్, ఇది పిచ్చితనంగా ఉంది.

మిస్టర్ సిల్వర్ సైడ్స్. టామీ.

మిస్టర్ సిల్వర్ సైడ్స్.

ఈ యూనిఫారాలు గొప్పగా లేవని కాదు...

...కానీ కాస్త లూజుగా ఉండే దుస్తులు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా?

దుస్తులు అనేవి మన వ్యక్తిత్వాన్ని ప్రకటిస్తాయని డిక్ ఎప్పుడూ అంటూ ఉంటాడు, కదా?

మీ వ్యక్తిత్వాన్ని ప్రకటించాల్సిన అవసరం నాకు ఎందుకు ఉంటుంది? కుదరదు.

మీకు కేటాయించిన విధుల్ని మీరు నిర్వర్తించాలి.

మూస్, భారీ హింస.

హానెస్టీ, తెలివిలేని సైకో.

ఇంకా నెల్, మహిళ.

సరే, నేను తెలివిలేని వాడిని కాను ఇంకా నెల్ ఒక మహిళ కాదు.

కానీ, నేను ఒక మహిళనే.

కానీ అందరిలాంటి ఆడదాన్ని కాదు.

మీకు తెలుసా... అంటే, సరే, వాస్తవంగా చూస్తే, ఇక్కడ నేను మాత్రమే ఆడదాన్ని.

కాబట్టి, ఒక రకంగా, నేను మహిళని, కానీ నేను... అసలు దాని ఉద్దేశం ఏంటి?

దాని అర్థం అబ్బాయిలు వెర్రిగా, నవ్వించే మాటలు చెబితే నువ్వు విసుగ్గా కళ్లు గిరగిరా తిప్పుతావు.

కానీ, నేను మరీ అంతగా కళ్లు తిప్పను.

అవును, కళ్లు తిప్పుతావు, కాబట్టి ఒకసారి ప్రయత్నిద్దాం.

ఆహ్... ఆహ్. ఇంకా.

లేదు. మరింత తిప్పాలి. పూర్తిగా గుండ్రంగా తిప్పాలి.

నేను ఇంతకన్నా ఎక్కువ తిప్పితే, నా కనుగుడ్లు ఊడి బయటకొస్తాయి.

అయితే వాటిని ఊడనివ్వు.

- ఏంటి? - ప్లీజ్, మిస్టర్ సిల్వర్ సైడ్స్.

డిక్ తో మేము ఇలాంటి పనులు చేసేవాళ్లం కాదు.

మేము మంచిగా ఇంకా స్వేచ్ఛగా, మేము మేముగా ఉండేలా అతను మాకు నేర్పాడు.

అవును, కానీ మిమ్మల్ని మీరుగా నేను ద్వేషిస్తాను.

- నా ఉద్దేశం, అందులో దురుద్దేశం లేదు. - అది వ్యక్తిగత దూషణగానే అనిపిస్తోంది.

ఊఫ్. మీరు అతడిని మిస్ అవుతున్నారా?

- అవును. - మీకు వెళ్లిపోవాలని ఉందా?

- కొద్దిగా. - సరే. అయితే వెళ్లిపోండి.

కానీ నీలాంటి ఒక మూర్ఖుడు బయట ఒంటరిగా ఎంతకాలం బతుకుతాడు

ఇంకా చివరికి చనిపోయి పందులకు ఆహారం కాకుండా ఎలా ఉంటాడు?

నేను మూర్ఖుడినా?

చూడు, నెల్, ఏదైనా మాట్లాడు.

అతను చెప్పింది చేయండి, చాలు.

టామీ ఇప్పుడు మన నాయకుడు, కాబట్టి...

థాంక్యూ, మహిళా.

ఇప్పుడు కళ్లు బాగా తిప్పావు, నెల్.

సరే, కళ్ల మీద దృష్టిని ఉంచండి.

ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది.

గుండ్రంగా తిప్పండి! తుంటి భాగాన్ని కదిలించండి. నొప్పిని ఫీల్ అవ్వండి.

కిందికి వంగుతూ ఉండండి.

ముందుకి. వెనక్కి. ముందుకి. వెనక్కి.

ఒకటి. రెండుసార్లు.

వేగంగా, వేగంగా, వేగంగా, వేగంగా, వేగంగా.

- చేతులు పైకెత్తండి. - కదలద్దు!

- ఇది దారిదోపిడీ. - నిలబడండి ఇంకా ఇవ్వండి.

చూడండి! ఇంకా తీవ్రంగా! స్పష్టంగా!

ఇది ప్రదర్శన.

దీనికి కొద్దిగా మెరుగులు జోడించండి.

అతను టామీ టామీ, టామీ, టామీ సిల్వర్ సైడ్స్

ఇది పేలవంగా ఉంది. పేలవంగా ఉంది!

ఇది పేలవంగా ఉంది.

మీరు పాడేది మీకయినా వినిపిస్తోందా?

మళ్లీ పాడండి.

ఏం చేస్తున్నారు? ఆపండి.

ఏం చేస్తున్నారు? మీరు నన్ను మళ్లీ దోచుకోవడం లేదు, కదా?

హేయ్! మనం ఫ్రెండ్స్ అనుకున్నాను!

సారీ, క్రెయిగ్. మా బాస్ ఆదేశాలు.

హేయ్, ఆ డ్రాయర్ ని తెరిచి చూడద్దు! అది నా వ్యక్తిగతమైన అర!

- అది నా వ్యక్తిగతం! - ఇంక ఇప్పుడు కాదు.

లైసెన్సు లేకుండా మంత్రప్రయోగాలు చేస్తున్నందుకు మంత్రగాళ్ల మండలికి నీ మీద ఫిర్యాదు చేశాను.

ఓహ్, అవునా? నాకేం భయం లేదు.

గుడ్ నైట్ చెప్పు, మిత్రమా.

నిద్ర బాంబు!

ఒక నిమిషం టైమ్ ఇవ్వు. అది పని చేయచ్చు.

- వీడిని బయటకి తీసుకుపోండి. - మూస్! హానెస్టీ!

డబ్బు సంపాదించడానికి నేను ఇంకేం చేయాలి?

మీరు ఇలా చేయలేదు. డిక్ ఎక్కడున్నాడు?

సాహసోపేతంగా తప్పించుకున్న డిక్

ఇక అంతా టామీ గురించే!

వచ్చినందుకు థాంక్యూ.

మీలాంటి జనాన్ని దోచుకోవడానికి మీలాంటి జనం నాకు ప్రేరణ ఇస్తుంటారు.

నా తరువాత లక్ష్యం ఎవరో నేను ఇప్పుడే తెలుసుకున్నాను.

నువ్వు దారిదోపిడీ దొంగవి అయినప్పుడే, జైలుకి వెళతావని నేను ఊహించి ఉండాల్సింది.

నాన్నా, నేను నిజంగా ఇక్కడ ఉన్నానా?

లేదా నేను భ్రమపడుతున్నానా?

వారం రోజులుగా కేవలం నాచు మాత్రమే తింటున్నాను.

నువ్వు కలగంటున్నావు, బాబు.

నీ ఊహలో నేను కేవలం ఒక చిన్న భాగాన్ని.

అవును, ఇది కల కావచ్చు.

నిజజీవితంలో నువ్వు క్యారెట్ తినే అవకాశమే లేదు.

కీర్తి నీకు తలకెక్కింది, బాబు.

ప్రమాదం గురించి నీకు హెచ్చరించినా నువ్వు నీ గ్యాంగ్ మాట వినలేదు,

ఇంకా ఇప్పుడు వాళ్లు బయట ఒంటరివాళ్లయ్యారు.

- నాకు తెలుసు. వాళ్ల గురించి ఆందోళనగా ఉంది. - నాకు లేదు.

వాళ్లు నీ గురించి పట్టించుకుంటే, ఈపాటికి నిన్ను కాపాడి ఉండేవాళ్లు.

కానీ అది అంత తేలిక కాదు. నేను ఎక్కడ ఉన్నానో వాళ్లకి తెలియదు.

వాళ్లకి నిజంగా నీ మీద శ్రద్ధ ఉంటే, నువ్వు ఎక్కడున్నావో తెలుసుకునేవారు.

సరే, మనం వాళ్లకి మరికాస్త సమయం ఇవ్వాలేమో?

- అవును, కానీ వాళ్లకి నిజంగా శ్రద్ధ ఉంటే... - సరే, అలాగే.

వాళ్లకి శ్రద్ధ లేదు. నాకు అర్థం అవుతోంది.

విను, నా గ్యాంగ్ నా ఆచూకీ తెలుసుకుంటారు, ఇంకా నన్ను కాపాడతారు,

ఆ తరువాత డిక్ టర్పిన్ మళ్లీ విజృంభిస్తాడు.

నా ఉద్దేశం, ఈసారి కాస్త కఠినంగా ఉంటుంది.

ఇప్పుడు తల మాత్రమే వచ్చింది, కానీ ఏదో ఒక మార్గం కనిపెడతా.

కారోల్ ఇంకా స్యూ.

బెన్నీ, ఇక్కడ ఏం చేస్తున్నావు?

నువ్వు మేలుకొనేలోపు ఒక విచిత్రమైన పని చేస్తున్నాం.

రూయిన్. హెంప్ స్టెడ్ ఆర్థిక లావాదేవీల కేంద్రం.

ఇది పక్కా లక్ష్యం.

ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు, రకరకాల ఆదాయ మార్గాలు, ఒక చిన్నపిల్ల నడుపుతోంది.

అవును, నా ఉద్దేశం, మనం రూయిన్ పబ్ ని దోచుకోలేము. ఈ చుట్టుపక్కల అదొక్కటే మంచి పబ్.

పైగా, చిన్నారి కారెన్ మా ఫ్రెండ్.

కదా, మిత్రులారా?

ఇదివరకు అయితే నువ్వు చెప్పింది నిజం, నెల్.

మనం కేవలం టామీ చెప్పింది వినాలి.

టామీ వివేకం ఉన్న నాయకుడు.

వీళ్లని నువ్వు ఏం చేశావు?

నా సమ్మోహనమైన నాయకత్వంతో నేను వాళ్ల మనసులు గెలిచాను.

ఇంకా నేను వాళ్లని నిద్రపోనివ్వలేదు.

కానీ మూస్ పని చేయాలంటే పదహారు గంటలు పడుకోవాలి.

అతను బాసెట్ హౌండ్ కుక్కలా నిద్రపోతాడు.

లేదు, అతను నేను ఏం చెబితే అదే చేయాలి.

ఇది ఏంటి, మూసీ? అది గుడ్ బాయ్ లక్షణం. అదీ.

మెల్లగా. అదీ సంగతి.

చూశావా? నేను ఈ పెద్ద అబ్బాయి నాయకుడిని.

నెంబర్ వన్. మళ్లీ ఫ్రెంచ్ లో చెప్పా.

ఇలా చూడు, ఒప్పుకో, సరేనా?

నా నాయకత్వానికి దాసోహం అవ్వు.

లేదు.

నేను దాసోహం కాను.

మేము నైపుణ్యం ఉన్న మంచి దారిదోపిడీ దొంగలం.

తక్కువ హింస, ఎక్కువ రాబడి.

ఓహ్, దేవుడా. నేను ఇలా మారిపోయాను ఏంటి?

నీకు మన ఒప్పందం తెలుసు, నెల్.

నీకు ఏదైనా సమస్య ఉంటే, మీ అమ్మతో మాట్లాడు.

అమ్మా, నేను నీతో మాట్లాడాలి.

More Telugu subtitles for The Completely Made-Up Adventures of Dick Turpin

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left