Goliath

Goliath

Download Telugu Subtitle

Season 1

Release info

Goliath - S01 - AMZN WEB-DL
A Commentary by bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL - GASMASK / NTb / DEFLATE / TrollHD / SiGMA / AIDA

Tags

Web-DL
web-dl
web
WEB-DL
Published on: 2019-08-29
Downloads: 37
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

ఈ మంచువల్ల చలికి నేను వణికిపోతున్నాను.

వెచ్చగా అనిపించడానికి ఏమైనా చెయ్యరా వెధవా.

ఇంకా వేగంగా పని చేసి చూడరాదు?

పోనీ ఆ నీళ్ళల్లో దూకు.

అవకాశముంటే అదే చేసేవాడిని.

అబ్బా. ఎంత చల్లగా ఉందో.

అవును నువ్వు బలహీనుడివి కాబట్టి.

- అది అందంగా ఉంది. - ఏది?

లైట్ల చుట్టూ ఉన్న పొగ మంచు.

అది ఒక కళలా ఉంది. చూడు!

- నువ్వొక సుత్తిగాడివి. - ఎప్పుడూ అంతేగా.

- నీకది తెలుసు. - వెధవ.

అబ్బా!

ఏంటిది?

గేబ్రియల్! గేబ్రియల్!

అబ్బా.

గేబ్రియల్. గేబ్రియల్.

స్పృహలో ఉన్నావా? లే.

రెండు సంవత్సరాల తరువాత

ఓషన్ లాడ్జ్ హోటల్ కార్యాలయం

వేకెన్సీ ట్విన్నెట్ టెక్నాలజీ ట్విన్నెట్ డాట్ కాం

చెజ్ జే

ఇలా రా, రా.

ఎలా ఉన్నావు? ఇదుగో తీసుకో.

సారీ, ఆ లావుపాటాయన వెళిపోయాడు, కొద్దిగే దొరికింది.

రేపు బాగా తెస్తాను, సరేనా?

చెజ్ జే

అబ్బా. ఛీ.

వెధవా, అది నీ పేపర్ కాదు!

ధన్యవాదాలు.

చాలా థాంక్స్.

- నువ్వు సిద్దమేనా? - ఆ, థాంక్స్ అమ్మాయ్.

ఆ బాటిల్ వదిలెయ్.

- సరే. - థాంక్స్.

ఎగ్జిట్

నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నువ్విక్కడికి రాకూడదు.

ఎందుకు?

వాళ్ళ లైసెన్స్ పోవడమో, అలాంటిది ఏదో జరగవచ్చు.

నీకు తెలుసు కదా చిన్న విషయాలు.

వారు నాకు మద్యం ఇస్తేనే వారి లైసెన్స్ పోతుంది.

వారు నాకు ఆహారమో, కాఫీనో లేదా కోక్ లాంటివి ఇస్తే అది ఫరవాలేదు.

సరే తెలివైన అమ్మాయి, నీ దగ్గర డబ్బుందా?

నీ దగ్గర ఉంది.

అదీ కాక ఒక మైనర్ బార్ లో కూర్చోవడం కాలిఫోర్నియా రాష్ట్రంలో

చట్టవ్యతిరేకం కాదని చెప్పావు.

ఏంటో తెలుసా? నీకు నేను విషయాలు చెప్పడం మానేస్తాను.

నీకేదైనా చెప్పిన ప్రతిసారీ అది తిరిగి నాకే కొడుతోంది.

అవును నిజం, ఒట్టు.

ఏంటి సంగతులు, హనీ?

సంతకం చెయ్యి.

ముందు చదవ్వా?

లేదు, నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి ఇది మంచిదే అనుకుంటున్నాను.

మీ అమ్మ ఎందుకు సంతకం చేయలేదు?

ఆమెని ఇవాళ పొద్దున్న చూడలేదు.

ఇది తూర్పు వైపు కాలేజీలని చూడడానికి ఒక ట్రిప్పు.

స్కూల్ వాళ్ళు తీసుకువెళుతున్నారు.

ఇంతకీ నువ్వు ఏ క్లాసులో ఉన్నావు హనీ?

పదకొండు, నాన్న.

- అవును... - పదకొండో తరగతి.

- గుర్తొచ్చింది. అర్థమైంది. - దేవుడా, నిజంగానా?

అవును, నాకు తెలుసు, నాకు తెలుసు.

ఇది పదకొండు. సారీ చాలా ముందు.

అదీ కాక నువ్వు కాలేజీకి ఎక్కడికెళతావో మనకు తెలుసు కదా.

నువ్వు వీటిని చూడడానికి వెళ్ళనవసరం లేదు.

నేను ఇండియానాకి వెళ్ళట్లేదు.

- నువ్వు వెళ్తున్నావు. - లేదు.

మనం మాట్లాడుకున్నాము, మయామి వెళ్ళడం లేదు,

అది మాత్రం నేను చెప్పగలను.

నువ్వు మామూలు కాలేజీకి వెళ్తేనే సరిగ్గా చదువుకుంటావు. సరేనా?

- నేనేమీ పిట్స్... - నేను వెళ్ళాలి.

- కానీ నేను అనేది... - నాకు ఆలస్యం అవుతోంది.

నువ్వు ఇండియానాలోనే చదువుకుంటావు.

- లేదునాన్నా - ఆక్కడ చదువుకున్నవారు తెలుసా?

ప్రసిధ్ధులు కాకుండా.

ఎర్నీ పైల్, హోగీ కార్మైకేల్...

- తెలిసింది వాళ్ళే. - లీ మేజర్స్.

- ఇంకెవరు? - అలాంటి వాళ్ళు.

- బాబీ నైట్. - మాట్లాడడం బాగుంది.

డేవిడ్ ఆన్స్ బాబ్. ఇంకా చాలా చెప్పగలను.

- డిక్ ఎన్బర్గ్. - చెప్పగవులే.

- జో బక్... - నువ్వు చెప్తావు.

జేన్ పాలీ.

జేన్ పాలీ ఇండియానాకి వెళ్ళింది. ఆమె బానే ఉంది.

నువ్వు ఎక్కడ చదువుకున్నావు?

నేను నార్త్ వెస్టర్న్ కి వెళ్లాను.

నార్త్ వెస్టర్నా?

- అవును. - అయితే ఇక్కడేం చేస్తున్నావు?

- అది పని చేయలేదు. - అనుకుంటాను.

మార్విన్ బ్రాడ్ సాన్ ఫెర్నాండో వాలీ నియోజక సేవా కేంద్రం

కానీ ఆ మాదక ద్రవ్యాలు తనవి కావన్నాడు.

మేడం వారందరూ అదే అంటారు. అంటే, చుట్టూ చూడండి.

ఇక్కడున్నవారందరూ ఆ మాదక ద్రవ్యాలు తమవి కాదంటారు.

కానీ వాడు నాతో అబద్ధం చెప్పడు. అవి తనవి కావన్నాడు.

మేడం మీ అబ్బాయి మంచి వాడని నాకు తెలుసు, నాకు నిజంగా తెలుసు.

అతను చిన్నవాడు. ఇరవైలలో ఉన్నాడు.

అతనికి ఒక భవిష్యత్తు ఉంది, మనం ఆ భవిష్యత్తుని రక్షించాలి.

అవునా?

- అతని పేరేంటి? - ఏమన్నారు?

- నాకొడుకు పేరేంటి మిస్టర్ మెక్ బ్రైడ్? - వినండి, అతను విచారణకి వెళితే...

అతనికి 15 సంవత్సరాల జైలు శిక్ష పడచ్చు ఒకవేళ జడ్జి

- ఎక్కువ ఇవ్వాలి అనుకుంటే, అప్పుడు... - మిమ్మల్ని నా కొడుకు పేరు అడిగాను.

మీకు కోపంగా ఉందని నాకు తెలుసు, మీకు కోపం ఎందుకు రాకూడదు?

- అది సహజం. - మీకు అస్సలు తెలియదు.

తన మీద నేరం మోపిన తరువాత మీరు తనిని కలవలేదు కూడా.

వాడిని మీరు ఐదేళ్ళు జైలుకి పంపాలనుకుంటున్నారు,

కానీ కనీసం అతని పేరు కూడా గుర్తు పెట్టుకోలేరా?

మీతో నాకు పని అయిపోయింది.

కాస్త పట్టించుకునే వారిని ఎవరినైనా వెతుక్కుంటాను.

హే.

హే. హాయ్.

పాటీ సోలిస్-పెపేజియన్. నేను మీకు ఇది ఇవ్వచ్చా?

- లేదు. ఫరవాలేదు. - మిస్టర్ మెక్ బ్రైడ్?

అవునా? నువ్వు బిల్లీ మెక్ బ్రైడ్ కదా?

నువ్వు ఆ బిల్లీ మెక్ బ్రైడే. అబ్బా.

ఇది చాలా ఉత్తేజంగా ఉంది. పాటీ సోలిస్-పెపేజియన్.

నా ఆఫీస్ వీధి చివర ఉంది.

మెక్సికన్ చోటు, లా ఫగాడా పైన ఉంది,

నేనెక్కువ క్రిమినల్ కేసులు తీసుకుంటాను, కానీ...

ఇది మంచి సమయమేనా? మనం ఒక కప్పు కాఫీ తాగచ్చు.

నా ఆఫీస్ వీధి చివర ఉంది లేదా...

- ఒక డ్రింక్ తీసుకోవచ్చు. - చూడు, నాకు చాలా పనుంది, సరేనా?

నా దగ్గర ఒక సివిల్ కేసు ఉంది.

నా స్నేహితురాలి తమ్ముడు బార్న్స్ టెక్నాలజీలో పని చేసేవాడు,

అతను వారి పడవలలో ఒక దానిలో చచ్చిపోయాడు.

నేను ఏం చెప్పబోతున్నానో నీకు తెలుసు అది నీ పాత సంస్థకి పెద్ద క్లైంట్.

వారి మీద దావా వేయబోతున్నాను, నేనా సివిల్ చేయను, నా స్నేహితురాలికి

సహాయం కావాలి అందుకని నేను ఒక డిమాండ్ లెటర్ పంపాను,

వారు నాకు తిరిగి కాల్ కూడా చేయలేదు, వారిని వదలకూడదు కదా?

నువ్వు నాతో ఏకీభవిస్తావనుకుంటా, వారిని వదలకూడదు.

ఆమె తమ్ముడు వారి పడవల్లో ఒక దాని మీద ఆత్మహత్య చేసుకున్నాడని వాళ్ళన్నారు,

అతను ఆత్మహత్య చేసుకోలేదని ఆమె నమ్ముతోంది.

ఆ పడవకి బీమా ఉంది, అందుకని

వారు నన్ను పట్టించుకునేలా చేస్తే ఇది సెటిల్ అవుతుంది.

ఇప్పటి వరకు నేను అలా చేయలేకపోయాను.

ఇది ఎంతకు సెటిల్ అవుతుంది? ముప్పై? నలభై వేలు?

నేను నీకు ఐదు ఇస్తాను

నాకు లోపలికి వెళ్ళే దారి చూపిస్తే, ఆలోచించుకో.

నువ్వది చేయగలనని అనుకుంటున్నావా?

లేదు, నేనది చేయలేను.

కానీ నా దగ్గర పేపర్ వర్క్ అంతా ఉంది.

నువ్వు చేయాల్సిందల్లా నింపడం.

అబ్బా.

విను తల్లీ, నేనిప్పటికే కంగారుగా ఉన్నా నువ్వేమో వాగుడుకాయలా ఉన్నావు.

వాగే వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేను, అందుకే...

నీకు నీ పాత సంస్థ దుంప తెంచాలని లేదా?

నిజంగా?

నేనైతే చేస్తాను.

మనం కూపర్మాన్ మరియు మెక్ బ్రైడ్ గా ఎంత పెద్దగా, శక్తివంతంగా ఎదిగినా,

ఒక్క విషయం మటుకు మారలేదు.

మనం మన క్లైంట్లు మరియు సమాజానికి సేవ చేయడానికి బద్ధులమై ఉన్నాము.

ఉన్న ఒక్క తేడా మన సమాజం యొక్క పరిమాణం.

నేను కూపర్మాన్ మరియు మెక్ బ్రైడ్ లో ప్రారంభించినప్పుడు,

మనం స్థానికంగా పని చేస్తున్నాము.

మనది న్యాయ సంస్థల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటిది అని నవ్వుకునేవాళ్ళం.

గొప్ప ఉత్పత్తి, మెరుగైన సేవ మరియు తక్కువ ధరలు.

నేడు మనకి దేశ మరియు ప్రపంచ వ్యాప్తంగా,

1,000 కన్నా ఎక్కువ మంది లాయర్లు పని చేస్తున్నారు,

మరియు గత సంవత్సరం మన ఆదాయం 2.1 బిలియన్ డాలర్లు.

మనం చాలా తక్కువ సమయంలో చాలా దూరం వచ్చాము.

ఇంత గొప్ప భవిష్యత్తు మనం ఎన్నడూ చూడలేదు.

మన వ్యాప్తి ఇంత కన్నా గొప్పగా ఏన్నడూ లేదు.

అందులో కటార్ లో మన కొత్త బ్రాంచ్ ఆఫీసు కూడా ఉంది.

నేను మన స్థాపకుడు డోనాల్డ్ కూపర్మాన్ తరఫున అంటున్నాను...

సంస్థలోకి స్వాగతం. స్వాగతం.

కూపర్మాన్ మెక్ బ్రైడ్

సగం మనిషి, సగం గుర్రం, ఏంటో చెప్పుకో ఫ్రాంకీ?

- సరే, ఓడిపోయాను. - సెంటార్.

అది సెంటార్.

హే. తను నిన్న రాత్రి ఇక్కడికి వచ్చిందా?

- ఎవరది? - మన అమ్మాయి?

పదహారేళ్ళు, 5'6" ఎత్తు, మద్యస్థంగా ఉంటుంది.

తెలివైన అమ్మాయి. లేదు, ఆమె రాలేదు.

నిన్న రాత్రి ఆమె స్నేహితురాలి ఇంట్లో ఉంటున్నానని చెప్పింది,

ఇవాళ ఉదయం ఆ అమ్మాయితో మాట్లాడితే ఆ అమ్మాయి తనకేమీ తేలీదంది.

అయితే ఆమె కనిపించట్లేదన్న మాట.

ఆమె స్కూల్ కి వెళ్ళింది, ఆమె బానే ఉంది.

- అయితే, ఆమె నీతో లేదా? - లేదు.

సరే.

నా కాల్స్ బ్లాక్ చేయకుంటే మంచిదేమో, తను మళ్ళీ కనపడకుండా పోతే.

నేను నీ కాల్స్ అన్ బ్లాక్ చేయకుంటే ఇందులో నా ప్రమేయం ఉన్నట్టా.

దాని అర్థం ఏంటి?

నువ్వు సరిగా చూడక, ఆమె కనిపించకపోతే లేదా ఏదో అయితే,

- ఏదో ఒక విధంగా... - నీకు దీనితో విసుగు రాదా?

- నాకు విసుగ్గా ఉంది. - దేనితో విసుగు?

దీనితో.

కాదు, దీనితో కాదు.

అతను అప్పటికే తాగి ఉన్నాడు.

నువ్వు ఊరికే అనడం లేదు కదా.

ఇది నేను నా మాజీని అవమానించడం కాదు,

ఇతను అత్యుత్తమ విచారణ న్యాయవాదుల్లో ఒకరు.

అతను ఎలా ఉన్నాడు? ఎంత శాతం చెత్తగా ఉన్నాడు?

- నిజానికి అంత ఘోరంగా ఏమీ లేడు. - క్షమించండి కౌన్సిలర్.

మీరు చెప్పేది ఏమైనా ఉందా?

నేను నా క్లైంట్ తో మాట్లాడుతున్నాను, యువర్ ఆనర్.

అవును నేను మాట్లాడుతున్నప్పుడు, అది అమర్యాదగా ఆనిపించింది.

- ఉద్దేశ్యపూర్వకంగా ఆమర్యదగా ఉన్నావా? - లేదు.

లేదు, యువర్ ఆనర్.

అబ్బా!

ఆమెకి అది అధిగమించింది అనుకున్నాను.

నేను కూడా అనుకున్నాను.

More Telugu subtitles for Goliath

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left