The Morning Show

The Morning Show

Download Telugu Subtitle

Season 1

Release info

The Morning Show - S01E06 - ATVP WEB-DL - METCON / ION10
A Commentary by bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL from Apple TV - METCON / ION10 / ELiMiNATE

Tags

Web-DL
web-dl
web
WEB-DL
Published on: 2019-11-22
Downloads: 17
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

కాలిఫోర్నియాలో ఒక అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది.

లోస్ ఏంజలీస్ వెలుపల చెలరేగుతున్న అగ్ని వినాశనం సృష్టిస్తూ, గృహాలను నాశనం చేస్తూ

నివాసితులను భద్రత కోసం ఆ ప్రాంతం నుండి తరలి వెళ్ళిపోయేలా చేస్తుంది.

మాలిబు సంపన్న సమాజం వెలుపల రగులుతున్న అతిపెద్ద జ్వాల హంట్లీ మంటలను

ప్రస్తుతం అధికారులు యుద్ధభూమితో పోలుస్తున్నారు.

మూడు వేర్వేరు కౌంటీలలో అగ్నిమాపక సిబ్బంది మంటలతో పోరాడుతున్నారు.

...నివాసితులు తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళలేక కన్నీరు మున్నీరయ్యారు...

దాని మార్గంలో ఉన్న ప్రతిదాన్ని నాశనం చేస్తోంది.

ఇలా జరుగుతుండగా ఆందోళనలు పెరిగి, విషాదం అలుముకుంది.

మాలిబు, సిఏ

హే, ఫ్రెడ్, మనం ఖాళీచేయాలి. ఇది తప్పనిసరి.

వాళ్ళు పశువులన్నిటినీ తెచ్చేలా చూడండి. ఆ గుర్రాలు, చిన్న గాడిద.

ఆ చెత్త పశువుల్ని తీసుకురండి.

ఆ పని మీదే ఉన్నాం, సార్.

దేవుడా.

నాకు కావాల్సింది ఇది కాదు. దీని గురించిన వార్తలకోసం టిఎంఎస్ ఎల్.ఎ కు వెళ్ళాలి.

ఆ చెత్త స్త్రీలను ఒక అయిదు నిమిషాలు మీ టూ గురించి మాట్లాడటం ఆపేలా చేయి.

హే, కోరీ. విను, నాకు ఒక ఆలోచన వచ్చింది.

నువ్వు బ్రాడ్లీ ని సంప్రదించగలవా?

మేము ఒకే హోటల్ లో ఉంటున్నాం, కాబట్టి ఆమెను సంప్రదించగలనేమో చూస్తాను.

సరే, నేను ఎయిర్పోర్ట్ కు వెళ్ళే దారిలో చిప్ కు ఫోన్ చేస్తాను.

ఈ మంటల గురించి వార్తలు చెప్పడానికి ఈ ఆడవాళ్ళని ఎల్.ఎ కు పంపండి.

సరే.

ఇప్పుడు ఏం జరుగుతుంది?

బహుశా, అదృష్టవంతురాలైన లిండీ క్షేమంగా ప్యారిస్ లో ల్యాండ్ అయిందేమో?

అవును, నా మొహాన్ని దగ్గరగా చూస్తే భయంగా ఉంటుందని నాకు తెలుసు.

ఓరి దేవుడా. ఓరి దేవుడా.

నాకు చాలా ఘోరంగా అనిపిస్తుంది.

- నన్ను క్షమించు. నేనొక చెత్త మొహం దాన్ని. - ఓహ్, లేదు. లేదు, లేదు.

దయచేసి, క్షమాపణలు చెప్పకు.

మనం నవ్వుకున్నాం, మనం ఏడ్చాం, మనం గ్రిల్డ్ చీజ్ తిన్నాం.

అదంతా చాలా బాగుంది.

నేను నిజానికి హాల్ లో పడుకున్నాను.

నీ వాంతు నీ గొంతుకి అడ్డం పడుతుందేమో అని నేను కొంచెం కంగారు పడ్డాను.

ఆ గ్రిల్డ్ చీజ్ నా కడుపు పాడుచేసింది.

దయచేసి నన్ను చంపెయ్యి.

- హే, బ్రాడ్లీ. బ్రాడ్లీ? - ఏంటి?

- ఏంటి? - బ్రాడ్లీ?

నిజంగా అంతా బాగానే జరిగింది. ఇక్కడ సహాయం చేయగలిగినందుకు నాకు సంతోషంగా ఉంది.

నువ్వు నిన్న రాత్రి ఒంటరిగా ఉండాలని నేను కోరుకోలేదు.

ధన్యవాదాలు, కోరీ.

ఒంటరిగా ఉండటాన్ని చాలా పెద్దదిగా చేసి చూస్తారు.

నువ్వు ఒక నెట్వర్క్ ప్రెసిడెంట్ అయ్యుండి ఇంత మంచిగా ఉన్నావంటే ఆశ్చర్యమేస్తుంది.

అవును, నిజానికి నేను మంచివాడ్ని కాదు. నాకు నువ్వు నచ్చావు అంతే.

ఇదిగో, కొంచెం బ్రెడ్ తిను.

హే, నా కోసం బ్రెడ్ తెచ్చావా?

- కాఫీ కూడా. - కాఫీ ఉంది. దేవుడికి కృతఙ్ఞతలు.

- అవును, ఇదిగో తీసుకో. - ధన్యవాదాలు.

మరొక ఆసక్తికరమైన వార్త ఏంటంటే, మనం ఎల్.ఎలో కార్చిచ్చుల గురించి రిపోర్ట్ చేయబోతున్నాం.

కాబట్టి, నువ్వు వీలైనంత త్వరగా ప్లేన్ ఎక్కాలి. చిప్ నీకు ఫోన్ చేస్తూ ఉన్నాడు.

ఓరి దేవు... ఛ!

అవును. కానీ కంగారు పడకు. నేను ఇక్కడ ఉన్నానని అతనికి తెలియదు.

నువ్వు కార్ ఎక్కాక ఫోన్ చేయొచ్చు.

సరే. నా మనసు బాగోలేకపోయినా, ఇది మంచి వార్తే

ఎందుకంటే నేను క్షేత్రస్థాయికి వెళ్లి రిపోర్ట్ చేయాలి.

నేను అదే బాగా చేయగలను.

నిజానికి నేను తిరిగి ఎల్.ఎ కి వెళ్ళాలి. అంటే, కొన్ని కొత్త కార్యక్రమాల విషయంలో.

అప్ఫ్రంట్ సమయం చాలా దగ్గర పడింది. కాబట్టి నేను అక్కడికి వెళతాను.

నేను సర్దుకొని, నీకు యాడ్విల్ తెస్తాను. నిన్ను నాతో ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్లగలను.

ధన్యవాదాలు. అది చాలా బాగుంది.

కానీ మనం ఎయిర్పోర్ట్ కు ఒకే కార్ లో వెళితే కొంచెం వింతగా ఉండదా?

అవును. అదీ నిజమే.

నేను నీకు యాడ్విల్ తెచ్చి, క్యాబ్ ఎక్కిస్తాను.

- ఎల్.ఎ కి! - ఎల్.ఎ!

ఖాళీ స్థలాలు ఇంకా తీవ్రమైన వడగాలులు ఇంకా కార్చిచ్చులు.

ఏదైనా జారగొచ్చు! మరిముఖ్యంగా అది తగలబడుతున్నప్పుడు!

ఓరి, దేవుడా.

ఇది ఆ గ్రిల్డ్ చీజ్ వల్ల.

ఇవాళ ఆదివారమని నీకు తెలుసు, కదా?

హే, శుభోదయం. మనం ఈ మంటల గురించి రిపోర్ట్ చేయడానికి ఎల్.ఎ కి వెళ్ళాలి.

దీని గురించి వైడిఏ వాళ్ళు జిమ్మీ ఇంకా అతని ఏడుపుగొట్టు నాన్నమ్మలతో బాగా చేస్తున్నారు.

చిప్, దయచేసి. ఇంకా తెల్లవారలేదు. కొంచెం నిదానంగా చెప్పు.

ఓహ్, ఇంకా తెల్లవారలేదా? నన్ను క్షమించు. అవును, మా అందరికీ తాగింది దిగలేదులే.

కానీ నువ్వు కొన్ని గంటల్లో విమానం ఎక్కాలి. తయారవ్వు.

నిజంగానా? ఎల్.ఎ లో మంటలా.

ఇది హడావిడిగా చేస్తున్నట్టుంది. ఇదేమీ 9/11 లాంటిది కాదు కదా.

లేదు, లేదు. నీకు అర్ధం కావట్లేదు. ఇది చాలా పెద్దది, సరేనా?

మనకి ఇక్కడ చాలా చోట్ల మంటలు చెలరేగాయి. ఇళ్ళు తగలబడిపోయి, జనాలు ఖాళీ చేస్తున్నారు.

మంటల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రజలు తమ కార్లలోనే చనిపోతున్నారు.

ఓరి దేవుడా.

దానికితోడు, షో కి కూడా వార్తల్లో ఈ మార్పు ఉపయోగపడుతుంది.

మనం చేద్దాం. ఈ ఆదేశాలు సరాసరి మన చెత్త బాస్ నుంచి వస్తున్నాయి.

చిప్, నేను చెత్త మంటల గురించి రిపోర్ట్ చేయను, సరేనా?

బ్రాడ్లీ ఒక్కదాన్ని పంపు. ఆమెను కొన్ని రోజులు నా నుంచి దూరంగా పంపు.

నేను తనని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ, రా, ఆలెక్స్!

ఇది ఏమంత... ఒక్క క్షణం ఆగు.

ఏంటి నువ్వు...

అవును, ఇక్కడికి అడగకుండా రాకూడదని నాకు తెలుసు. అసలు అది నాకు ఇవ్వు.

హే! ఏంటి...

సరే, నువ్వు మూసుకో.

ఇంకా నేను ఇలా ఉండలేను, ఆలెక్స్.

నన్ను నీ సోది విరాళాలు సమకూర్చే కార్యక్రమం చూసుకోమని వెళ్ళిపోయాక రాత్రంతా ఉన్నాను.

సరే. చూడు, నాకు బాధేసింది...

అవును, కానీ నీకెప్పుడూ బాధ లేదా ఒత్తిడి ఉంటుంది ఇంకా నేను ఇలా ఉండలేను. సరేనా?

నాకు మన కూతురంటే ప్రేమ ఉంది.

కానీ సంవత్సరాల తరబడి ఒక అందమైన స్వార్థపరురాలితో సంబంధం కలిగి

ఉండటం నన్ను కలచివేస్తుంది.

నువ్వు నాతో ప్రేమలో లేవు.

ఇంకా నేను ఎంతమాత్రం నీతో ప్రేమలో లేను.

ఇంకా?

నాకు విడాకులు కావాలి.

అంటే, వద్దు.

నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అది పూర్తిగా నీ ఇష్టం కాదు.

జేసన్, మనం ఇందుకే విడిపోయాం. ఎందుకంటే...

మనం కుటుంబ క్యాలెండర్లు చేయాల్సిన పని లేదు.

ఇంక నువ్వు నా విరాళాలు సమకూర్చే కార్యక్రమాలు చూసుకోవాల్సిన పని లేదు,

లేదు, ఆలెక్స్. మనం ఇలా ఎప్పుడూ వాదించుకుంటూనే ఉంటాం కాబట్టే విడిపోయాం.

అవును, మనం వాదించుకుంటాం.

ఇంకా నిజానికి, నువ్వు నన్ను ఎప్పుడూ లెక్క చేయనందుకు నాకు చాలా కోపంగా ఉంది,

ఇంకా నాకు ఆ విషయంలో కోపంగా ఉన్నందుకు నువ్వు నా మీద కోపంగా ఉంటావు,

ఇంకా ఎప్పుడూ నీకే అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య ఉండేలా దేవుడిచ్చిన ఒక హక్కు

నీకు ఉందని నువ్వు నమ్ముతావు కాబట్టి.

ఆలెక్స్, దేవుడి మీద ఒట్టు, నువ్వు ఆ ఫోన్ ఎత్తితే, నేను నీతో ఎప్పటికీ మాట్లాడను...

ఎప్పటికీ.

సరే. సరే.

సరే, చూడు.

మనం విడాకులు తీసుకోలేము.

- నాదిప్పటికే అమెరికాలో క్లిష్టమైన స్థితి. - ఓరి దేవుడా.

విడాకులు తీసుకుంటే... అది నన్ను నాశనం చేస్తుంది. ఇంకా నేను...

ఇది జరుగబోతుంది, ఆలెక్స్.

మనం లిజ్జికి చెప్పాలి, నువ్వు నీ పిఆర్ వాళ్లకి చెప్పాలి.

ఎందుకంటే నీ వ్యక్తిగత జీవితంలోని మిగతా అన్నిటిలాగే,

ఇది కూడా వాళ్ళే చూసుకోవాలి.

కానీ అసలు అనుమానమే లేదు, ఇది జరిగి తీరుతుంది.

నేను నా లాయర్ తో మాట్లాడాను. నేను ఇవాళ రాత్రి లిజ్జి దగ్గరకి వెళ్లి చెబుతాను.

నువ్వు రావాలనుకుంటే, తప్పకుండా రావచ్చు.

- లేదు, నేను... లేదు! లేదు! - 5:00 గంటలకు కలుస్తాను. మనం కలిసి వెళదాం.

లేదు, జేసన్, నేనలా చేసినందుకు క్షమించు. నిన్ను పార్టీలో ఒంటరిగా వదిలినందు...

- మనం లిజ్జికి చెప్పలేము. - ఎందుకు?

ఎందుకంటే...

నేను ఇవాళ కాలిఫోర్నియా వెళ్ళాలి.

మేము మంటల మీద రిపోర్ట్ చేస్తున్నాం. అందుకే చిప్ నాకు ఫోన్ చేస్తున్నాడు.

ఆలెక్స్.

దయచేసి. జేసన్, ప్రజల ఇళ్ళు కాలి బూడిదయిపోతున్నాయి.

కార్లలో నుంచి శవాలను తీస్తున్నారు. ఇది ముఖ్యమైనది. జేసన్.

నేను తిరిగొచ్చాక మనం తనకి చెబుదాం.

సరే. నువ్వు తిరిగిరాగానే, మనం తనకి చెబుదాం.

కానీ నేను వేళాకోళం చేయట్లేదు, ఆలెక్స్.

నేను శాంతించబోవట్లేదు ఇంకా హఠాత్తుగా నా మనసు మార్చుకోవడంలేదు.

నేను దాని గురించి ఆలోచించట్లేదు.

నేను ఈ మంటల మీద రిపోర్ట్ చేయాలి.

అది నా తప్పు కాదు. నేనేం వాటిని అంటించలేదు.

చెప్పు?

హే, నన్ను క్షమించు. నేను బాగా నిద్రలో ఉన్నాను.

నువ్వు సరిగ్గానే చెప్పావు.

అది ముఖ్యమైనది. తప్పకుండా, నేను వస్తాను.

బ్రహ్మాండం. ధన్యవాదాలు. ప్లేన్ 11:00 గంటలకు బయల్దేరుతుంది.

సరే, అయితే నేను నిన్ను కలుస్తాను. బ్రాడ్లీ ని తీసుకురావద్దు.

నువ్వు ఇప్పుడే తీసుకురమ్మని చెప్పావు... అయినా నీకొకటి తెలుసా? ఏదైనా జరిగేది ఒకటే.

ఆమె రావడం ఇప్పటికే ఖాయమైంది. ఫ్రెడ్ ఆమెని తీసుకురమ్మన్నాడు. మీరిద్దరూ వస్తున్నారు.

అది బాగా రేటింగులు తెచ్చిపెడుతుంది. కావల్సినవి సర్దుకో. గంటలో కారు వస్తుంది.

సరే, సర్డుకోక చస్తానా!

సరే, నేను వచ్చాను. పదండి.

కాపీ ఇప్పుడే వచ్చింది.

ఓహ్, ధన్యవాదాలు.

మనం కొన్ని రోజులు నగరం నుంచి బయటికి వెళుతున్నందుకు ఆనందంగా ఉంది.

అది ప్రాణాంతకమైన అగ్ని అయినా కూడా కొద్దిగా మార్పుని మనమంతా కొద్దిగా వాడుకోవచ్చు.

అది ఒక విషయాన్ని చెబుతుంది.

నిన్న రాత్రి నువ్వు ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది.

- అవునా? - అవును.

నన్ను సగం మంది సిబ్బంది నమ్మరని కూడా నాకు తెలియదు.

నా దగ్గర టకీలా వాసన వస్తుందా?

వాసన చూడనివ్వు.

ఓహ్, అబ్బో. లేదు, నేను ఊరికే సరదాగా అన్నాను. నువ్వు బాగానే ఉన్నావు.

చూడు, నీ గురించి మన సిబ్బందికి అంతగా తెలియదు. ఒక్క వారమే అయింది.

నీ గురించి తెలుసుకోవడానికి వాళ్లకి కొంత సమయమివ్వు. సరేనా? నిన్ను అందరూ ఇష్టపడతారు.

ధన్యవాదాలు.

నాకు కొంచెం కాఫీ కావాలి. నీకు?

లేదు, ఫర్వాలేదు.

ట్రావెల్ ఏజెంట్ ఫోన్ చేశాడు.

ఏంటి?

అత్యవసర తరలింపు కారణంగా మంటల దగ్గర ఉన్న హోటళ్లలో చాలా వరకు ఖాళీ లేవు.

అందుబాటులో ఉన్న ఒకే ఒక్కదానిలో సూట్ రూములు లేవు.

అయితే, వాళ్ళు కొందరు వలస వచ్చిన కుటుంబాలను బయటకు గెంటేయలేరా?

నాకు నా వజ్రాలు పెట్టుకోవడానికి చోటు కావాలి.

- అయితే సూట్ అవసరం లేదన్నమాట. అర్ధమైంది. - దేవుడా.

నాకు ఇవన్నీ అవసరమని వీళ్ళకి ఎవరు చెబుతున్నారు?

ఇందుకే ప్రముఖ వ్యక్తులకు చాలా చెడ్డ పేరు వస్తుంది.

ఇంకా వాళ్ళతో పని చేయడం కష్టంగా ఉండటం వల్ల కూడా.

యాష్లీ బ్రౌన్ ఇంటర్వ్యూ జరిగి రెండు రోజులు అవుతుంది.

నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు?

మనం ఏం చేస్తున్నాం? నువ్వు ఎప్పుడోకప్పుడు బ్రాడ్లీతో మాట్లాడాలి.

లేదా కనీసం తన కళ్ళలోకి చూడాలి.

చిప్, నాకేం అవసరం లేదు. ఆ విషయంలో నన్ను వదిలేయి. సరేనా?

నేను ఎదుర్కోవాల్సిన మరొక ప్రకృతి విపత్తు కూడా ఉంది.

సరే. నన్ను క్షమించు. నేను ఊరికే...

ప్రయాణికులందరికీ, ఇంకొక గంట సేపట్లో

మనం బర్బాంక్ లో ల్యాండ్ అవుతాం.

వెనక మీరంతా మీ సమయాన్ని బాగా ఆస్వాదిస్తున్నారని ఆశిస్తున్నాను.

మీకు సేవలందించడం చాలా సంతోషం.

మమ్మీ!

బర్బాంక్, సిఏ

సఫారి ఇన్

పద. నా చెయ్యి పట్టుకో. వదలకు.

నీళ్ళు... మీకు కావాలంటే ఇక్కడున్నాయి.

అమెరికన్ రెడ్ క్రాస్

ఇది చాలా ఆలస్యమైనందుకు క్షమించండి.

దేవుడా.

ఏ హోటల్ అయినా ఫర్వాలేదు, కదా?

నువ్వు ఖచ్చితంగా చెబుతున్నావా?

More Telugu subtitles for The Morning Show

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left