The first 200 lines.
విజ్ఞాపన: ఈ చిత్రంలోని పాత్రలు, సంఘటనలన్నీ కల్పితాలు.
మరణించిన, జీవించి ఉన్న వ్యక్తులతో పోలితే యాదృచ్ఛికమే.
ఏ వ్యక్తిని, మతాన్ని, నమ్మకాన్ని, కులాన్ని,
సంఘాన్ని, వర్గాన్ని కించపరచడం ఈ చిత్రం ఉద్దేశం కాదు.
ఈ చిత్ర నిర్మాణంలో ఏ జంతువుకూ హాని జరగలేదు.
అది 1795వ సంవత్సరం.
హిందుస్తాన్.
ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకుల ముసుగు వేసుకొని ఇక్కడికి వచ్చింది.
కానీ ఇప్పుడు, ఆ కంపెనీయే మనల్ని ఏలుతోంది.
హిందుస్తాన్
ఒక్కొక్కటి చొప్పున అనేక రాజ్యాలను వాళ్ళు హస్తగతం చేసుకున్నారు.
వాటిని బానిస రాజ్యాలుగా మార్చుకున్నారు.
ఇప్పటి వరకూ,
రౌనక్పూర్ మాత్రమే ఇంకా స్వతంత్ర రాజ్యంగా మిగిలి ఉంది.
మాతృభూమిని ఎల్లవేళలా కాపాడుకోవాలి.
ఇదెవరు?
ఊహించి చెప్పు.
రౌనక్పూర్ యొక్క అందమైన...
ఇంకా తుంటరి పుత్రిక అయిన, జఫీరా.
-ఏం చేస్తున్నావు? -తన పళ్ళని పీకేస్తున్నాను.
ఎందుకు?
ఎందుకంటే దసరా సమయంలో నాకు రెండు పళ్ళు ఊడిపోయాయి.
ఇంకా కొత్త పళ్ళు రాలేదు.
-అతనెవరు? -ఖుదాబక్ష్.
మరి నా సంగతేంటి?
మా అమ్మానాన్నలు ఇద్దరూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు, అస్లాం చదువుకుంటున్నాడు.
నేనూ, ఖుదాబక్ష్ కోటకి కాపలాగా ఉన్నాము.
ఇక మనం ఇంటికి వెళ్ళవచ్చా, వీరనారీ?
లేదు.
పదా వెళ్దాం, లేకపోతే మీ అమ్మ నా పళ్ళు రాళ్ళగొడుతుంది.
నీ పెళ్ళానికి నువ్వు భయపడకూడదు.
ఇక పదా పోదాం.
-అది నాకివ్వు. -ఏం చేస్తున్నారు మీరు?
-నాకు కావలసింది నేను తీసుకుంటాను. -సర్!
-నా సరుకులని దయచేసి నాశనం చేయకండి! -పక్కకి తప్పుకో, ముసలి పీనుగా!
-నేను పేదవాడిని అయ్యా. -అయితే నాకేంటి.
-ఇక్కడేం జరుగుతోంది? -అది నాకివ్వు.
ఏంటి ఇక్కడి గొడవ?
ప్రభూ, నాకు ఏ మాత్రం డబ్బులివ్వకుండా నా సరుకులని తీసుకుంటున్నారు.
అడిగితే, కంపెనీ నియమాల ప్రకారం,
వారికి కావలసింది వారు తీసుకోవచ్చని అంటున్నారు.
ఇక్కడ కంపెనీ ఏలుబడి నడవడం లేదు,
ఎప్పటికీ నడవదు కూడా.
ప్రభువులకి జై జై!
-ప్రభువులకి జై జై! -ప్రభువులకి జై జై!
ఇక్కడి నుండి వెళ్లిపోండి.
మళ్లీ రాకండి.
వెళ్లిపోండి ఇక్కడి నుండి!
ప్రభువులను దేవుడు చల్లగా చూడుగాక.
ఏదైనా వర్తమానం అందిందా?
ప్రమాదమని తెలిసి కూడా, ఖుదాబక్ష్ తో పాటు అస్లంని అసలెందుకు పంపించారు?
పంపించక తప్పలేదు.
ఖుదాబక్ష్ ఒక యోధుడు, ఇక అస్లం ఏమో ఇంకా పసివాడే.
వాడు నాకు కూడా కొడుకే.
అంత అవసరమేంటి?
ఇప్పుడు మనం ధైర్యంగా ఉండకుంటే,
మనకి కూడా బానిసత్వం తథ్యమే.
ఖుదాబక్ష్, అస్లం, మద్దతు కోరదామని 20 మందితో దుర్గాపూర్ వెళ్ళారు.
కానీ ఇంతవరకూ రాలేదు.
ఇక వేచి చూసి ప్రయోజనం లేదు.
వినండి, మిత్రులారా.
మనం వీలైనంత త్వరగా
కంపెనీ కోట మీద దాడి చేసి దాన్ని హస్తగతం చేసుకోవాలి.
మనం ఇప్పుడు ఏదోకటి చేయకుండా ఉంటే,
ఇతర రాజ్యాల మాదిరిగా క్లైవ్ మన రాజ్యాన్ని కుడా బానిస రాజ్యంగా మార్చేస్తాడు.
రేపు ఈ పతాకం
కంపెనీ కోట మీద రెపరెపలాడాలి.
ప్రభూ!
త్వరగా రండి.
ఒక అతిథిలాగానే స్వాగతించండి.
కానీ నేను మీకు ఓ సంకేతమివ్వగానే,
అతను అతిథి కాదని, శత్రువని గ్రహించండి.
నమస్కారం, మిర్జా గారూ.
మిమ్మల్ని ఈ పూట ఇబ్బంది పెట్టినందుకు మన్నించండి.
ఇబ్బందేమి లేదు,
క్లైవ్ గారూ.
మీకు ఏ విధంగా సహాయపడగలనో చెప్పండి.
మరి, మాతో స్నేహం చేద్దామని మీకు ఎప్పుడైనా అనిపించిందా?
మీరు స్నేహం మాటున బానిసత్వ వ్యాపారాన్ని చేస్తున్నారు.
మేము వ్యాపారులం, మిర్జా గారూ.
వ్యాపారం చేయడం మా విధి.
ఓ పక్క సింహాసనం మీద కన్నేసి ఉంచుతూనే కదా.
సమీప భవిష్యత్తులో,
పాలకులనందరినీ వ్యాపారులే శాసిస్తారు.
మీకు జ్యోతిష్యం కూడా తెలుసా?
నేను కేవలం అవకాశవాదినే.
అవకాశం వస్తే వదలను,
వాస్తవాన్ని చూడకుండా ఉండనూ లేను.
నిజంగానా?
మీ కవిత్వం మాటున మీరు నిజాన్ని
దాస్తున్నారని నాకు తెలుసు.
ఉదాహరణకి, ఈ టీ కప్పు.
మీ కోటలో తయారవుతూ ఉన్న
ఒక వస్తువుకు
సంబంధించిన వాసన మీ టీ కప్పు నుండి వస్తోంది.
మందుగుండు.
అంతకన్నా పెద్ద నిజం
ఈ కవిత్వంలో దాగి ఉంది.
"రెండు రోజుల తదుపరి వచ్చే మధ్యాహ్న ఘడియన,
చంద్రుడు కానరాని అమావాస్య నాడు,
ఓ ఎర్రచందనపు గుర్రం దూసుకొచ్చిన నాడు,
పాపుల పాపం పండగలదు."
ఇది కవిత్వంలాగా కాకుండా
ఏదో కుట్రపూరితమైనదిగా కనబడుతోంది.
ఈ పుస్తకంలోని ఆఖరి కవితలని నా కొడుకు అస్లం రచించాడు.
అది మీకు వ్యతిరేకంగా రచించిన తిరుగుబాటు ప్రకటన.
ఆ పుస్తకం అతని వద్ద ఉండాలి.
ఆ పుస్తకం నీ దగ్గర ఉందంటే,
నా బిడ్డ వీరమరణం పొందాడని అర్థం.
నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది, మిర్జా గారూ.
నా ప్రాణం మీ చేతుల్లో ఉంది.
అందుకని, నేను మీకు ఖచ్చితంగా ఒకటి చూపించాలి.
అస్లం.
నాన్నా.
మిత్రులుగా ఉందాం, మిర్జా గారూ.
మాతో శత్రుత్వం మీకు అంత మంచిది కాదు.
సికందర్ బేగ్
నీకు కావలసింది నీకు దక్కింది కదా.
ఇక నా కొడుకును విడిచిపెట్టు.
తప్పకుండా.
స్వాతంత్య్రం.
ఖుదాబక్ష్!
జఫీరా!
నాన్నా!
11 ఏళ్ళ తరువాత
-రాం ఖిలావన్, ప్రవేశ ద్వారాన్ని మూసేయ్. -అలాగే.
-నేను చెప్పేవరకూ తెరవవద్దు. -అలాగే.
ఈ దారి ఇప్పుడు కంపెనీ ఆధీనంలో ఉంది.
ఈ దారిలో వెళ్ళాలంటే, ఒక్కొక్కరికీ ఒక అణా చొప్పున చెల్లించాలి.
ఒక్కొక్కరికీ ఒక అణా. ఎంత మంది ఉన్నారు?
నలభై. నలభై అణాలు చెల్లించు.
ఓయ్. ఓయ్, ఆగక్కడ!
ఓయ్! ఆగు!
ఇది అధికారిక చెక్ పోస్టు, కళ్ళు కనబడటం లేదా?
ముందుకు పోవాలంటే పన్ను కట్టి పోవాలి.
పన్నా?
ఈ దారి ఇప్పుడు కంపెనీ ఆధీనంలో ఉంది. ముందుకు వెళ్ళాలంటే పన్ను కట్టాలి.
ఒక్కొక్కరికీ ఒక అణా చెల్లించాలి.
-ఎవరు కట్టాలి? యజామానా, సేవకుడా? -ఏంటి?
యజమాని, సేవకుడు కలిసి ప్రయాణం చేస్తున్నట్లయితే,
ఇద్దరిలో ఎవరు కట్టాలి?
అలా అయితే, యజమాని కట్టాలి.
అయ్యా, అయితే నా యజమాని నుండి డబ్బులు కట్టించుకోండి.
నీ యజమాని ఎవరు?
గవర్నర్లలోకెల్లా అత్యుత్తముడు, సర్వోత్తమమూర్తి,
నవాబ్ ఫిద్రుద్దిన్ హకీముద్దిన్, అరివీర భయంకర ఖాన్.
అయ్యా, వీడికి కట్టాల్సింది కట్టేసి వీడి పీడ తొలగించుకుందాం.
వెటకారమా? గాడిదని పట్టుకొని యజమాని అని అంటున్నావా?
ఒక్కటిస్తా! వేళాకోళమాడకు.
ఇన్స్పెక్టర్ గారూ!
ఒక్కోసారి, నమ్మశక్యంగా ఉండదు కానీ, అదే నిజం.
ఇతడిని చూడండి.
ఇతను నా యజమాని. గవర్నర్ కూడా. నేనేమో ఇతని సేవకుడిని.
నమ్మడం కష్టంగానే ఉంటుందేమో కానీ, ఇతను గవర్నరే.
కంపెనీ భారతదేశంలో అడుగుపెట్టినప్పటి నుండి,
అనేక మంది రాజులని గాడిదల మాదిరిగానే చూస్తోంది.
వాళ్ళు గాడిదల్లాగానే వ్యవహరిస్తుండవచ్చు, కానీ అలా కనబడరు కదా.
ఇన్స్పెక్టర్, ఇతనెవడో మాటకారి లాగున్నాడు!
ఎంతైనా, చూస్తేనే తెలుస్తుంది. వాస్తవాన్ని ప్రత్యేకంగా వర్ణించనవసరం లేదు.
ఇతను చాలా తెలివైనవాడు.
-మరతను ఏ రాష్ట్రానికి గవర్నరు? -చమన్పూర్ కి.
కంపెనీని బాగా నమ్మాడు,
కానీ తన దారిలో తనే వెళ్తూంటే, అదేదో పన్ను చెల్లించాలంట.
అతను పన్ను చెల్లించాలట.
ఇన్స్పెక్టర్ గారు, ఇక వదిలేయండి.
మాకు కూడా ఆలస్యమవుతోంది. అతనికి కూడా నేనే చెల్లిస్తాను.
అయ్యా!
మీ విరాళాన్ని నేను స్వీకరించలేను.
మీ ఋణం ఖచ్చితంగా తీర్చుకుంటాను.
నేను కూడా మీతో పాటు వస్తాను, మీకు కావలసినంత వినోదాన్ని అందిస్తాను.
మీరు మార్గమంతా ఆస్వాదిస్తూనే ఉంటారు.
ఇతను భలే చమత్కారిలా ఉన్నాడు. నీ పేరేంటి?
ఫిరంగి మల్లా.
మాది గోపాల్పూర్ గ్రామం, కాన్పూర్ జిల్లా, అవధ్.
శంభోశివశంకరా.
మీరు ఎన్నడూ రుచిచూడనటువంటి రుచికరమైన భోజనాన్ని ఈరోజు మీకు వడ్డిస్తాను.
భోజనం సంగతి సరే, ఫిరంగీ.
అంతకంటే రసవత్తరమైనది ఇంకేమీ లేదా?
నేను ఈ వేణువును వాయిస్తే, దేవతలైతే ఖచ్చితంగా దిగివస్తారు,
మీకు అదృష్టముంటే, గంధర్వ కన్యలు కూడా వస్తారు.
వీడిని చంపనవసరం లేదులే బాబూ, దోచుకొని వదిలేసేయ్.
ఈ దొంగలు ఎంత అజాగ్రత్తగా ఉన్నారు!
వీడి ఉంగరాలని తీసుకోవడం మరిచిపోయారే.
చచ్చినట్టే నటించు, లేకపోతే నిన్ను నిజంగానే చంపేస్తారు.
వదిలేయండయ్యా.
మొత్తం ఏడుగురు ప్రయాణికులు.
ఒక్కొక్కరికి అయిదు రూపాయల చొప్పున 35 రూపాయలు నాకు ఇవ్వు.
ఆ 35 అందమైన వెండి నాణాలను చూపించు.
ఇంకా అదనంగా దారి పన్ను కింద ఒక అణా కూడా ఇవ్వు.
మమ్మల్ని వెర్రివాళ్ళని చేయాలని చూస్తున్నావా?
ఇదంతా నేను పడిన కష్టానికి అడుగుతున్నాను. ఎంతో దూరం నుండి వాళ్ళని వెంబడించాను.
-నీకు ఇరవై ఇస్తా. -ముప్పై రెండు ఇవ్వు.
ఇరవై రెండు ఇస్తా.
చాలా ప్రమాదకరమైన పని ఇది, భూరేలాల్. అలా మొండిగా ప్రవర్తించకు.
ఇరవై ఎనిమిది రూపాయల కంటే ఎక్కువ ఇచ్చేది లేదు. అంతే.
ముప్పై రూపాయలు ఇవ్వు. దానితో పాటు ఆ రెండు ఇత్తడి కూజాలు, ఇంకా కంచాలు కూడా నాకే.
బాగా చూసుకోండి, సర్. మీరు అడిగినంత మందిని మీకిస్తున్నాను కదా?
అవునులే.
నేను మాట తప్పే మనిషిని కాదు.
ఇరవై మంది దొంగలని మీకు ఇస్తానని చెప్పా. కానీ 21 మందిని ఇస్తున్నా.
No comments yet. Be the first to leave one.