Release info

Boulevard 2026 SPANISH AMZN WEB-DL DD 5 1 H 264-playWEB
A Commentary by tedi
Retail AMZN | 1:55:00

Tags

webdl
Published on: 2026-07-10
Downloads: 10
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

ప్రేమ అంత బాధ పెడుతుందని ఎవరూ చెప్పలేదు.

అది ఒక గులాబీ పువ్వు లాంటిదని.

దాని ముళ్లను దాటితేనే, ఆ పువ్వును చేరుకోగలమని.

ఫ్లోర్ ఎం. సాల్వడోర్ రచించిన వాట్‌ప్యాడ్‌ నవల బులేవార్డ్ ఆధారంగా

గుడ్ మార్నింగ్.

ఇవాళ హైస్కూల్ లో నీ మొదటి రోజు. నీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను, కన్నా.

నీకు నచ్చుతుంది, చాలా మంది కొత్త ఫ్రెండ్స్ చేసుకుంటావు.

నేనిప్పటికే హాస్పిటల్‌కు చేరుకున్నాను, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు, సరేనా?

ముద్దులు, కన్నా. ఐ లవ్ యూ.

సారీ, సెకండ్ ఇయర్ విద్యార్థుల క్లాస్ రూమ్ ఎక్కడ?

-అదిగో, అక్కడున్న గది. -థ్యాంక్స్.

సారీ, నేను లేట్ అయ్యాను.

నువ్వు ఎవరు?

వెధవ.

-మన అత్యంత అద్భుతమైన కాలాల్లో ఒకటి… -హాయ్.

సారీ. నేను ఇక్కడికి కొత్త, అందుకే…

ఆలస్యంగా వచ్చావు.

హస్లీ… వెయిజల్?

వైగెల్.

-మా నాన్న జర్మన్. -సరే.

సర్…

నా క్లాస్‌కి ఆలస్యంగా వచ్చేవాళ్ళకి అనుమతి లేదు.

నిజంగానా?

ఇంతకుముందు చెప్పినట్లుగా, ఈ సంవత్సరం మనం స్వర్ణయుగంతో ప్రారంభిద్దాం.

నువ్వు వెధవవి.

-నన్ను బయటకు గెంటేశారు. -టెక్నికల్‌గా, గెంటేయలేదు.

అందుకు ముందు నిన్ను లోపలికి రానియ్యాలి.

నువ్వు ఇక్కడ కూర్చుని గంజాయి ఎందుకు తాగుతున్నావు?

కూల్‌గా కనిపించడానికా?

-నీకు కూడా కావాలా? -ఛీ.

ఏంటది?

ఛీ.

అది టూత్ పేస్ట్, సరేనా?

నువ్వు సరదాగా ఉన్నావు…

హస్లీ.

వైగెల్. హస్లీ వైగెల్. మా నాన్న జర్మన్. చాలా?

"హస్లీ వైగెల్."

హస్లీ అంటే చాలు.

నీ పేరేంటి?

హస్లీ.

-నువ్వు హస్లీ, కదా? -అవును.

మంచిది. నేను ఒలీవియా. ఒలీ అని పిలువు

-క్లాసులో ఉన్నావు కదా? -అవును.

ఇందాక జరిగిన దానికి బాధగా ఉంది.

బాధపడకు. అందరిలోనూ ఆయనే దరిద్రుడు. మిగతా వాళ్ళు ఫరవాలేదు.

-కొద్దిగా. -కొద్దిగా.

హే, మేము బయట మెట్ల పై కూర్చుని ఏదో ఒకటి తాగుతున్నాం.

నువ్వు కూడా మాతో కలుస్తావా?

-నేను రావచ్చా? -హా.

సరే. ఏదైనా తీసుకుని, వెంటనే వస్తాను.

మంచిది. కాసేపట్లో కలుద్దాం.

హస్లీ.

సరే, అందరూ వినండి. నేను పరిచయాలు చేస్తాను. ఈమె హస్లీ.

-తను డిలన్. -హేయ్.

-జెవ్. -హలో.

నైజన్, కార్లా.

-హాయ్. -హాయ్.

ఎలా నడుస్తోంది?

హే, ఒలీ, ఆ రాగి రంగు జుట్టు అబ్బాయి ఎవరు?

అతనా?

తను లూక్ హోలాండ్.

వాడో పనికిమాలిన వాడు. నువ్వు వాడికి దూరంగా ఉంటేనే మంచిది.

-ఎందుకు? -వాడికి పిచ్చి.

వింత వాడు. ఒక్కోసారి, ఊరికే కోపం వస్తుంది.

-మీరు దారుణంగా ఉన్నారు. -ఏంటి?

-దేని గురించి మాట్లాడుకుంటున్నారు? -హే, ఆ మత్తుమందుల బానిస గురించి.

-ఆహ్, లూక్. -సూపర్.

హాయ్. నా పేరు మ్యాట్.

నిన్ను కలవడం సంతోషం.

హస్లీ.

హస్లీ?

ఎంత మంచి పేరు! ఇక్కడికి కొత్తగా వచ్చావు, కదా?

పారిపోవడానికి నీకింకా సమయం ఉంది.

తనని పట్టించుకోకు.

అది కొంచెం కష్టం అవుతుంది. మా అమ్మ ఇక్కడ కొత్త సైకాలజిస్ట్.

-స్కూల్‌లోనా? -అబ్బా.

ఇంకా హాస్పిటల్‌లో కూడా.

మీ అమ్మ స్కూల్ సైకాలజిస్టా?

ఆ పదాన్ని ఎందుకు వాడతావు? నీకు బుర్ర లేదా?

-సారీ. అంత సున్నితంగా ఉండకు. -నీకేంటి సమస్య?

వాళ్ళు మంచి వాళ్లే, ఒట్టు.

వాళ్ళు ఇబ్బంది పెడితే నాకు కాల్ చెయ్, సరేనా? పెట్టకపోయినా, కాల్ చెయ్.

మళ్ళీ బోనులోకి వెళ్ళే సమయం వచ్చింది.

ఈ వీకెండ్ మనకు ప్రాక్టీస్ ఉంది. మీరు వస్తున్నారు కదా?

హా, తప్పకుండా.

నువ్వూ రా, మనం అన్ని విషయాలూ మాట్లాడుకుందాం.

హా, సరే.

నన్ను నిరాశ పరచకు, హస్లీ.

సరే, రోమియో.

మళ్ళీ కలుద్దాం.

ఏమంటావు? బాగుంది కదా?

సరే, ఆ లూక్‌తో సమస్య ఏంటి?

-అతనితో అంతా సమస్యే. -తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి.

-పిచ్చోడు. ఎప్పుడూ గొడవలు చేస్తుంటాడు. -ఆపు, కార్లా.

ఏంటి? వాడి దగ్గరకు వెళ్ళకూడదని తనకి తెలియాలి, కదా?

బంగారం, ఒకవేళ నువ్వు పారిపోవాలని అనుకుంటే,

స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నాకొక ఉత్తరం రాయి.

గుడ్ నైట్.

ఐ లవ్ యూ.

ఛ.

…సెవిల్లెలోని పలాసియో డి డ్యూనాస్‌లోని ముప్పై ఐదు,

అక్కడ చాలా కుటుంబాలు అద్దెకు ఉంటున్నన్నాయి.

అతనికి ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు…

కలలు

వైగెల్.

నువ్వు క్లాస్‌లో ఉండాలి కదా?

నువ్వు చెప్పింది నిజమే, లూక్ హౌలండ్.

నాకు వెళ్ళాలనిపించలేదు.

అయితే, నీకు నా పేరు తెలుసన్నమాట.

ఇంత పొద్దున్నే మత్తుమందా?

అది నా ఒత్తిడిని తగ్గిస్తుంది.

"నక్షత్రాల కింద పడుకోవాలి."

"ప్యారిస్‌కు వెళ్ళాలి."

"ఒక హిప్పీ వ్యాన్‌లో ప్రయాణం చేయాలి…"

హే.

"ఒక చెట్టు నాటాలి."

"ఏదీ పట్టించుకోకుండా, అందరి ముందు డాన్స్ చేయాలి."

"బాణసంచా కాల్చాలి".

చాలు. అది నా వ్యక్తిగత విషయం.

ఏంటది? బకెట్ లిస్టా లేక మరేదైనా?

చనిపోతున్నావా?

అవి కలలు.

కాకపోతే కాస్త విచిత్రమైనవి.

ఒకే చోట ఉండకుండా తిరుగుతూ బతకాల్సిన అవసరం నీకెప్పుడూ రాలేదని అర్థమవుతోంది.

నీ పట్ల నాకు చాలా అసూయగా ఉంది.

కలలు, ఇలాంటివి కలిగి ఉండటం.

అవి నాకు కాదు.

ఏమైనా, చివరికి కలలు కల్లలవుతాయి

లేదు, నేను ఒప్పుకోను.

అవి నాకు భరోసా ఇస్తాయి. ఉదాహరణకు…

జీవించడానికి ఇంకా ఏదో మిగిలి ఉంది అనే ఆశలాంటివి.

ఇంకో మాటలో చెప్పాలంటే మనకి మనం పెట్టుకున్న కలలని అర్ధం కదా?

అబద్ధాల పునాదిపై బతికే జీవితానికి అర్థమేముంది?

నువ్వు వాటిని నెరవేర్చుకోనంత వరకే అవి అబద్ధాలు.

కాస్త శాంతించు, నీకూ ఖచ్చితంగా కలలు ఉండే ఉంటాయి.

సరే, ప్రస్తుతానికైతే ఈ ఉదయాన్ని నెట్టుకొచ్చేందుకు ఒక పాట్ బ్రౌనీ

తిందామని అనుకుంటున్నాను.

-తప్పకుండా, ఇదే ఆలోచిస్తుంటావు, కదా? -లేదు.

డాల్ఫిన్స్‌తో ఈత కొట్టడం గురించి కూడా ఆలోచిస్తుంటాను.

కొండ పైనుంచి దూకడం గురించి. గమ్యం లేకుండా డ్రైవింగ్ చేయడం గురించి.

ఆమ్స్టర్‌డామ్‌కు వెళ్ళడం గురించి. అది కూడా.

బ్రౌనీలు తినడం, అవునా?

అవును.

ఏయ్, నీ టీషర్ట్ మీద ఉన్నది కాంతి విక్షేపణమేనా?

జోక్ చేస్తున్నావు.

నీకు పింక్ ఫ్లాయిడ్ గురించి తెలియదా?

హా, ఆ పేరు ఎక్కడో విన్నట్టు గుర్తు.

తెలియకుండా ఎలా ఉంటుంది? చరిత్రలోనే అది ఒక అత్యుత్తమ రాక్ బ్యాండ్.

రేడియోహెడ్.

ది ఆఫ్‌స్ప్రింగ్. ది డోర్స్.

అంటే, నేనెప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పాటలు వినే ఉంటాను.

కనీసం గ్రీన్ డే?

సరే ఇక చాలు. నన్ను వదిలేయ్. నేను నా ఫోన్ తీసి…

ఏంటి? వద్దు, ఆగు.

ఇది నీకు మొదటిసారి అయితే, దీన్ని సరిగ్గా చేయాలి.

అదెలా చేస్తావు?

వినైల్ రికార్డ్ మీద.

నీ వయస్సెంత, 80 ఏళ్లా?

గొప్ప సంగీతం ఎలా పుట్టిందనేది నీకు చూపించాలి.

నువ్వొక వింత మనిషివి.

ఒక దమ్ము కొడతావా? కొన్నిసార్లు నియమాలు ఉల్లంఘించడం కూడా మంచిదే.

ఆ జాయింట్‌ని నా నోటి దగ్గరకు కూడా రానివ్వను.

హేయ్, మీ ఇద్దరూ! ఏం చేస్తున్నారు అక్కడ? నిలబడండి.

ప్రిన్సిపాల్ ఆఫీస్‌కి పదండి.

-అది నాది. -ఇప్పుడే.

తనెవరో కూడా నాకు తెలియదు.

నువ్వు, ప్రిన్సిపాల్ ఆఫీస్‌కి. నువ్వు, క్లాసుకి.

అది… నేను కావాలని క్లాస్ మానేయలేదు, ఏదో అప్రయత్నంగా అలా జరిగిపోయింది.

నిజంగా. మళ్ళీ లేట్ అయింది,

ఆయన నన్ను లోపలికి రానివ్వరని, చేసేదేం లేక క్లాస్ మానేశాను.

అవునులే, "దాదాపు" అప్రయత్నంగానే! నీకు ధైర్యం ఎక్కువే.

కంగారు పడకు, సరేనా? మెల్లగా ఈ షెడ్యూల్‌కి నువ్వు అలవాటు పడిపోతావు.

హస్లీ, తర్వాతేమైనా పని ఉందా?

లేదు, ఎందుకు?

వెళ్లి ఏదైనా తాగుదామా?

హా, తప్పకుండా.

సూపర్. మళ్ళీ కలుద్దాం మరి.

సరే, మీ మీ సీట్లలో కూర్చోండి.

మ్యాట్, నీకు ఇక్కడేం పని? క్లాస్‌కి వెళ్ళు, లేట్ అయింది.

మంచి కారణం కోసమే ఉన్నాను.

ఇల్లు మారడం, ఆ పనులన్నీ ఎలా సాగుతున్నాయి?

అంటే, నాకు సాధారణంగా ఆ బాక్సులన్నీ విప్పి సర్దేంత ఓపిక ఉండదు.

ఎందుకు అలా?

నేను అవి సర్దేలోపే మేం మళ్ళీ వేరే చోటికి మారిపోతుంటాం.

నేను పుట్టినప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాను, కానీ టీమ్‌తో కలిసి ఊళ్లు తిరుగుతుంటాను.

బాస్కెట్‌బాల్ కదా?

మామూలు ప్లేయర్‌ని కాదు, టీమ్ కెప్టెన్‌ని!

అసలు ఇక్కడ జీవితం ఎలా ఉంటుంది?

అంటే, చిన్న ఊళ్లలో లైఫ్ ఒక్కోసారి నరకంలా ఉంటుంది.

కానీ నువ్వేం భయపడకు. నీకు ఈ ఊరిని ఒక స్వర్గంలా చేస్తాను.

నాకు చాలా సంతోషంగా ఉంది.

కొత్త ఆరంభాల కోసం.

నన్ను ఇంటి వరకు దింపినందుకు థాంక్స్.

నాకూ సంతోషమే. ఆ సాకుతో నీతో ఇంకొంత సమయం గడిపే అవకాశం దొరికింది.

వచ్చేశాం.

ఈరోజు బాగా గడిచింది. హాస్.

నాకు కూడా.

నేను ఊహించిన దానికంటే ఇది వెయ్యి రెట్లు బాగుంది.

హస్లీ, బంగారం.

అమ్మ, ఏంటి సంగతి?

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left