The first 200 lines.
జాన్ ట్రవోల్టా రూపొందించిన చిత్రం
జాన్ ట్రవోల్టా రాసిన నవల ఆధారంగా రూపొందించిన చిత్రం
జాన్ ట్రవోల్టా దర్శకత్వం
డిెసెంబరు 28, 1962
ఐడల్ వైల్డ్ ఎయిర్ పోర్ట్, న్యూ యార్క్
అది అర్ధరాత్రి వేళ,
టెర్మినల్ దాదాపు నిర్మానుష్యంగా ఉంది.
త్వరలో విడుదల కాబోతున్న మూవీలో నటి లిజ్ టేలర్ ఫోటోని మా అమ్మ చూసింది.
ఆ మూవీ పేరు 'ద వి.ఐ.పి.స్'
సరిగ్గా అలాంటి కోటునే కొనాలని అనుకుంది,
అయితే ఆ కోటుని చర్చ్ బేస్మెంట్ సేల్ లో కొనుక్కుంది
బాగా డబున్న వాళ్లు తమ సెకండ్ హ్యాండ్ దుస్తుల్ని అక్కడ అమ్ముతుంటారు.
- గుడ్ బై, అమ్మమ్మ. - గుడ్ బై, బంగారం.
- మ్వాహ్. - నిన్ను మిస్ అవుతాను.
గుడ్ బై, అమ్మా.
గుడ్ బై, హనీ.
ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్ నుండి చివరి కాల్,
లండన్ వెళ్లే ఫ్లయిట్ 700 రాయల్ ఎంబాసిడర్ సూపర్ జెట్ సర్వీస్.
ఇప్పుడు మూడవ గేట్ లో బోర్డింగ్ అవుతోంది.
అందరూ దయచేసి బోర్డింగ్ కాగలరు.
స్పీకర్లలో వినిపిస్తున్న గొంతు మృదుమధురంగా వినబడుతోంది.
ఆ గొంతు ఎవరిదో కానీ వాళ్లు చాలా అందంగా ఉంటారని నేను ఊహించుకున్నాను,
బహుశా ఎవరైనా ఒక నటి అయి ఉంటుంది అనుకున్నాను.
బహుశా నేను మార్లిన్ మాన్రో మాదిరిగా యాక్ట్ చేస్తే,
ఆ టికెట్ ఏజెంట్ మనల్ని ఫస్ట్ క్లాస్ లో కూర్చోపెడతాడేమో.
ఆ విధంగా విమానంలో ప్రయాణిస్తే
మాకు అన్ని డ్రింక్స్ ఉచితంగా ఇస్తారని కూడా ఆమె చెప్పింది.
కానీ నేను ఆ మాటలేవీ పట్టించుకోలేదు, ఎందుకంటే మేము విమానంలో వెళ్లడమే ముఖ్యం అనుకున్నాను.
ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్, ఫ్లయిట్ 393
పిట్స్ బర్గ్ కి సూపర్ కాన్ స్టిలేషన్ సర్వీస్,
డేటన్, షికాగో, కన్సాస్ సిటీ,
డెన్వర్ ఇంకా లాస్ ఏంజెలెస్.
ఇప్పుడు వెస్ట్ ఆర్కేడ్ లో బోర్డింగ్ జరుగుతోంది.
అందరూ విమానంలో బోర్డింగ్ కావాల్సిందిగా మనవి.
నా వొళ్లంతా ఉత్సాహంతో నిండిపోయింది
కారణం ఇలాంటి అనుభూతి నాకు ఇంతకుముందెప్పుడూ కలగలేదు.
ఇంకా కొద్ది నిమిషాల్లోనే నేను మొదటిసారి గాలిలోకి ఎగరబోతున్నానని తెలిసినప్పుడు కలిగిన ఆ ఫీలింగ్
దేనితోనూ పోల్చలేము,
మా వీధిలో పిల్లలతో కలిసి ఆడే 'డాక్టర్-పేషెంట్' ఆట కూడా దాని ముందు తక్కువే.
ఎనిమిదేళ్ల వయసులో నాకు, ఆ ఆట కంటే పెద్ద విషయం ఇంకేం ఉంటుంది.
ఆ రాత్రి జరిగినదంతా నాకు గుర్తుంది.
టెర్మినల్ లో లైట్లు మసకగా ఉన్నాయి,
వెస్ట్ ఆర్కేడ్ లో గేట్ వైపు మేము వేగంగా వెళ్తుంటే
ఆ విమానం గుర్తు రంగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆఖరికి మా అమ్మ కూడా ఉద్వేగంగా కనిపించింది,
కానీ దానికి పూర్తిగా వేరే కారణాలు ఉన్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలను.
బహుశా తనకి ఉచితంగా డ్రింక్స్ ఇస్తారన్న ఉత్సాహం కావచ్చు,
లేదా విమానంలో ఒక అందమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉందన్న ఉత్సాహం కావచ్చు.
మా అమ్మకి అప్పుడు సుమారు 49 ఏళ్లు ఉండచ్చు, తను చాలా అందంగా ఉండేది.
నీలి కళ్లు, చక్కని జుట్టు,
ఆ వయసుకి తగ్గట్టుగా మంచి ఫిగర్ మెయింటైన్ చేసేదాన్ని అని తనే నాకు చెప్పేది.
నన్ను అంత ఆలస్యంగా కని ఉండకపోతే తన ఫిగర్ ఇంకా బాగుండేదని తనే అంటుండేది.
పైగా తనకి కొంచెం పొట్ట ఉన్నా కూడా చాలామంది మగవాళ్ళకి పెద్దగా అభ్యంతరం ఉండదని తన ఫీలింగ్.
కొందరు మగవాళ్లకి అదే చాలా సెక్సీగా అనిపిస్తుందని ఆమె అనుకునేది.
బహుశా విమానం నడిపే కెప్టెన్ తోనో లేదా మరెవరైనా
ఒక మంచి వ్యక్తితో ప్రేమలో పడాలని తను కోరుకునేది.
ఐడల్ వైల్డ్ ఎయిర్ పోర్ట్ గుండా వెళ్లడం చాలా సరదాగా అనిపించింది.
ఈసారి మేము నిజంగానే విమానంలో ప్రయాణిస్తున్నామంటే, నేను నమ్మలేకపోయాను.
మేము ఎక్కువసార్లు వేరేవాళ్లకి వీడ్కోలు చెప్పడానికే ఎయిర్ పోర్ట్ కి వచ్చేవాళ్లం.
ఒకసారి వేసవి సెలవుల్లో మా అమ్మ ఒక థియేటర్ లో ఏదో నాటకం వేసే పని మీద
విమానంలో వెళ్లాల్సి వచ్చింది.
కానీ ఈసారి నేను కూడా తనతో వెళ్తున్నాను.
అదంతా ఒక భ్రాంతిలా అనిపించింది.
ఒక ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను.
ప్రతి కదలిక స్లో మోషన్ లో జరుగుతున్నట్లు అనిపించింది.
అది చాలా అందంగా ఉంది.
వెండి ఇంకా తెలుపు రంగు, దాని మీద రెండు ఎర్రని అసెంట్ చారలు
ఇంకా పక్కన టి.డబ్ల్యు.ఏ. అనే అక్షరాలు ముద్రించి ఉన్నాయి.
ఓహ్, ఎంత కనువిందుగా ఉంది.
చల్ల గాలి నా ముఖాన్ని తాకుతూ వీచింది, కానీ నా మొదటి ప్రేమకి అది అంతరాయం కలిగించలేకపోయింది.
చూడటానికి గంభీరంగా, బలీయంగా ఇంకా పవర్ ఫుల్ గా కనిపించింది.
నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక అనుభూతి అక్కడ మొదలైంది.
మేము విమానం మెట్టు ఎక్కుతుండగా,
ఒక విచిత్రమైన దానిని నేను గమనించాను.
మాతో పాటు విమానం ఎక్కేవాళ్లు ఎక్కువ మంది లేరు.
చాలా తక్కువ మంది ఉన్నారు.
ఆ విమానం కేవలం నా కోసం ఇంకా మా అమ్మ కోసం అని నేను మనసులో అనుకున్నాను,
అది ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ కదా?
విమానంలోకి స్వాగతం. ఇక్కడ కాస్త వెచ్చగా ఉంటుంది.
మెట్ల పైన ఒక స్టివార్డెస్ సన్నగా, పొడవుగా
ఆత్మీయమైన చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉంది.
మీకు ఎమర్జెన్సీ మ్యాప్ కూడా అందిస్తున్నాం.
ఆమెలో ఏదో తెలియని ప్రత్యేకత ఉంది.
అదేమిటన్నది స్పష్టంగా చెప్పడం కష్టం.
కానీ తరువాత ఆమె గురించి మా అమ్మ ఎక్కువ తెలుసుకుంది.
వాళ్లు దాదాపు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు.
మిగతా అందరికన్నా లిజ్ ఎందుకు చాలా ప్రత్యేకంగా ఉందని మా అమ్మని అడిగాను,
ఆమె కాన్సన్ ట్రేషన్ క్యాంప్ నుంచి ప్రాణాలతో బయటపడిందని
అందుకే ఆమె జీవితంలో చాలా కష్టాలు ఇంకా విషాదం ఉన్నాయని మా అమ్మ నాకు చెప్పింది.
ఒక్కొక్కటిగా, ఇంజన్లు స్టార్ట్ అవుతుండగా,
నేను ఒక పెద్ద, మెత్తని, సౌకర్యవంతమైన కుర్చీలో కూర్చున్నాను.
ఆ ఇంజన్ల శబ్దాలు నాకు పెద్దగా వినబడలేదు.
ఆ భారీ ప్రొపెల్లర్లు గిర్రున తిరుగుతుంటే వెనుక నుండి మంటలు బయటకు వచ్చాయి.
అది జెట్ ఇంజన్ల యుగమని నాకు తెలుసు,
కానీ ఒక జెట్ విమానంతో పోలిస్తే రెండింతలు ఎక్కువ సమయం తీసుకునే
ఇలాంటి విమానంలో ప్రయాణించడంలో ఒక విధమైన మజా ఉంది,
ముఖ్యంగా ఇది నా మొదటి విమానప్రయాణం కాబట్టి.
ఒక నల్లని పూల పర్సులో నేను చిల్లర నాణేలు దాచుకోవడం నాకు గుర్తుంది.
నీ అమ్మమ్మ, అంటే మా అమ్మ,
డబ్బులు దాచుకోవడానికి నాకు ఈ పూల పర్సు ఇచ్చింది.
ఇక ఇప్పటి నుండి నువ్వు ఇందులో డబ్బులు దాచుకో,
ఆ తరువాత బహుశా మనిద్దరం ఒక చిన్న టూర్ కి వెళ్లచ్చు.
మనం ఫిలడెల్ఫియా, హార్ట్ ఫోర్డ్ కి వెళ్లచ్చు.
మనం బోస్టన్ వెళ్లచ్చు!
అవును.
మా అమ్మ దేని గురించయినా ఎగ్జయిట్ అయిందంటే, ఆ ఫీలింగ్ వేరేలా ఉండేది.
మొత్తం ప్రపంచమంతా వెలుగు, ఆశలతో అందంగా కనిపించేది.
సరే.
సరే.
నిన్ను సర్ ప్రైజ్ చేద్దామని ఈ విషయాన్ని దాచాను,
కానీ మనం లాస్ ఏంజెలెస్ కి మారిపోతున్నాం.
నిజం… నిజంగానా?
ఫిబ్రవరి నెలలోగా మనం పశ్చిమం వైపు మారిపోగలిగితే
తను తీయబోయే సినిమాలో పని చేసే అవకాశం ఇస్తానని
అలెన్ టౌన్ ప్లేహౌస్ లో నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఫ్రెండ్ చెప్పాడు.
నిజంగానా?
నేను ఇది నమ్మలేకపోతున్నాను.
అమ్మ ఇప్పటికే జూనియర్ ఆర్టిస్టుగా
కొన్ని సినిమాల్లో నటించింది,
కాబట్టి ఆ అవకాశం రావడం పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు.
స్కూలులో ఆమె డ్రామా పాఠాలు కూడా బోధించింది,
ఇంకా దానికంటే ముందు ఆమె పూర్తిస్థాయిలో నటనా వృత్తిలో కొనసాగింది.
ఆమెకు పని లేనప్పుడు, తన అత్యుత్తమ ప్రేక్షకుడిని నేనే.
నేను ఇప్పుడే వస్తాను.
నేను వెంటనే నా షెడ్యూల్స్ చూసుకోవాలి.
నేను దాదాపుగా మెట్ల మీద ఎగురుకుంటూ నా గదిలోకి వెళ్లాను,
అక్కడ నా ఎయిర్ లైన్ షెడ్యూల్స్ ఉన్నాయి.
యునైటెడ్, అమెరికన్, టి.డబ్ల్యు.ఏ.
ఇదిగో ఇక్కడ ఉంది. "ప్రొపెలర్ వన్-వే నైట్ కోచ్.
పూర్తి ధర 95 డాలర్లు, పిల్లలకి హాఫ్ టికెట్."
ఇదే!
ఇప్పుడు విమానం వేళలు చూద్దాం.
"ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్, ఫ్లయిట్ 393
ఐడల్ వైల్డ్ ఎయిర్ పోర్ట్ లో రాత్రి 9 గంటలకి బయలుదేరుతుంది.
లాస్ ఏంజెలెస్ కి సూపర్ కాన్ స్టిలేషన్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి
ఇంకా మధ్యలో పిట్స్ బర్గ్,
డేటన్, షికాగో, కన్సాస్ సిటీ, డెన్వర్ నగరాలలో ఆగి లాస్ ఏంజెలెస్ చేరుకుంటుంది.
మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటలకి చేరుకుంటుంది."
కేవలం ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్ మాత్రమే
అమెరికాలోని 70 నగరాలలో, ఇంకా విదేశాలలోని 15 ప్రపంచ కేంద్రాలలో సర్వీసులు అందిస్తోంది.
దేశమంతటా, ప్రపంచమంతటా
ఆధారపడతారు…
టి.డబ్ల్యు.ఏ.
టి.డబ్ల్యు.ఏ. ఒక్కటే మార్గం
నేను తిరిగి కిందకి వచ్చేసరికి,
లివింగ్ రూమ్ లో లైట్లు ఆఫ్ చేసి ఉన్నాయి.
ఇంకా స్టీరియోలో రేడియో నుండి పాట మంద్రంగా ప్లే అవుతోంది,
అది జాక్ జోన్స్ పాడిన "వైవ్స్ అండ్ లవర్స్" పాట.
చీకటిలో ఆమె తాగుతున్న సిగరెట్ మండుతోంది, ఆమె పక్కన గ్లాసులో వైట్ వైన్ ఉంది.
అప్పుడు నేను కంగారుపడ్డాను, లాస్ ఏంజెలెస్ కి మారిపోతున్నామని ఆమె చెప్పింది
అబద్ధం కావచ్చని అనుమానం కలిగింది.
అది ఆమె కనే పగటి కలల్లో ఒకటి కావచ్చు.
ఓహ్, సరే.
డబ్బు ఆదా చేసి ఒక చిన్న ట్రిప్ కి వెళ్లచ్చులే అనుకున్నాను.
బహుశా నేను… నేను నా షెడ్యూల్స్ ని మళ్లీ చూసుకోవాలి.
మా అమ్మమ్మకి 57 మోడలు ప్లిమత్ బెల్వడెర్ కారు ఉండేది.
ఎట్టకేలకి మేము బయలుదేరాము, 1962 డిసెంబరులో,
ఐడల్ వైల్డ్ ఎయిర్ పోర్ట్ వైపు వెళ్తున్నాం, నా మనసులో ఫ్లయిట్ 393 మెదులుతోంది.
మనం అక్కడికి ఎంతసేపట్లో వెళతాం?
బుజ్జీ, మన ఓడోమీటరు 62 కి చేరినప్పుడు,
మనం అక్కడికి చేరుకుంటాం.
ప్రయాణికులకి అనేక సదుపాయాలు ఉన్నాయని చాటుతూ
రోడ్డు పక్కన ఉన్న పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ ని చూడటం మజాగా ఉంది,
"పాన్ ఆమ్ లో ప్రయాణించండి, పారిస్ కి ఏడు గంటల్లో చేరండి."
లేదా "టి.డబ్ల్యు.ఏ., కారిఫోర్నియాకి చేరుకోవడానికి ఇదే మేలైన ఎయిర్ లైన్."
ఇంక ఇదిగో నేను ఈ విమానంలో కూర్చున్నాను
ఈ ఎయిర్ లైన్ అందించే సుదీర్ఘమైన ట్రిప్స్ ఒకదానిలో ప్రయాణిస్తున్నాను.
ఈ విమానం మొదటి సెగ్మెంట్ లో మొత్తం 15 మంది ప్రయాణికులు ఉన్నారు.
నేను హంటర్స్ క్యాప్ పెట్టుకుని ఉన్నాను, దాన్ని తీయడం మర్చిపోయాను,
బహుశా చలి వాతావరణం నుండి లోపలికి రావడం వల్ల కావచ్చు.
ఏది ఏమైనా, టేకాఫ్ సమయానికి, నా లుక్ ఇలా ఉండింది.
నా విషయంలో అమ్మ చాలా ఎగ్జయిట్ అయిందని చెప్పగలను,
కానీ ఆమె ప్రస్తుతం చాలా అసహనంగా ఎదురుచూస్తోంది
ఎందుకంటే విమానం గాలిలోకి తేలగానే తను సిగరెట్ ఇంకా డ్రింక్ తాగచ్చని చూస్తోంది.
ఇంజన్ల వెనుక భాగం నుండి మంటలు ఎగజిమ్మడాన్ని చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను.
విమానంలో ఇచ్చే మ్యాగజీన్ లో రాసిన వివరాల ప్రకారం
ప్రొపెల్లర్ ఇంజన్లలో అది ప్రత్యేకమైనదట.
వచ్చి నాతో పాటు ఎగురు
మనం ఎగిరిపోదాం, దూరంగా ఎగిరిపోదాం
మంచి విదేశీ మద్యం తాగాలి అనుకుంటే
దూరంగా బాంబేలో ఒక బార్ ఉంది…
మేము రన్ వే మీద వేగంగా దూసుకెళ్తుంటే, మళ్ళీ ఆ వింత అనుభూతి నన్ను ఆవహించింది.
ఇంకా ఆ క్షణం, విమానం నేలను విడిచి గాలిలోకి తేలింది.
నేను విమానంలో వెళ్తున్నానంటే నమ్మలేకపోతున్నాను.
మా అమ్మ నేరుగా చూసింది,
తరువాత తల తిప్పి నన్ను చూసి నవ్వింది.
అలా నవ్వే మా అమ్మని నేనెప్పుడూ గుర్తుపెట్టుకుంటాను.
నేను ఊహించుకున్నదాని కంటే టేకాఫ్ చాలా సాఫీగా జరిగింది.
ఎందుకో గానీ, ఆ రాత్రి ప్రతీదీ చాలా చక్కగా
సంతృప్తిగా జరిగినట్లు అనిపించింది.
ఎన్ని ఏళ్లయినా సరే, నా జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా గానీ,
నేను ఎయిర్ పోర్ట్ కి బయలుదేరినప్పటి నుండి
నా గమ్యాన్ని చేరుకునే వరకూ,
నా జీవితమంతా సురక్షితంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో నేను చాలా సంతోషంగా ఉంటాను.
మా అమ్మ మన్హాటన్స్ ని ఇష్టపడేది,
కానీ నాకు కోకా కోలా అంటే ఇష్టం.
లిజ్ మా సీట్స్ పక్కకు వచ్చింది.
ఇప్పుడు మీకు ఏ డ్రింక్ తీసుకురమ్మంటారు?
- నాకు కోక్ ఇస్తారా? - తప్పకుండా.
- నాకు మన్హాటన్ నచ్చుతుంది. - తప్పకుండా.
No comments yet. Be the first to leave one.