The Sheep Detectives

The Sheep Detectives

I-download ang Telugu Subtitle

Impormasyon ng release

The Sheep Detectives 2026 AMZN WEB H264-ETHEL
Komentaryo ni tedi
Retail AMZN | 1h 54m

Mga Tag

webdl
Na-publish noong: 2026-06-24
Mga Download: 35
May Kapansanan sa Pandinig: No

Preview ng subtitle na Telugu

Ang unang 200 linya.

ద షీప్ డిటెక్టివ్స్

ప్రియమైన రెబెకా,

నువ్వు ఎన్నో ప్రశ్నలు అడగాలనుకుంటున్నావని తెలుసు.

అలాగే నేను కూడా.

అయినా జీవితం ఒక రహస్యం.

కానీ విశ్వంలోని అన్ని చిక్కు ప్రశ్నలకు ఒక సమాధానం ఉందంటే,

సంతోషానికి ఒక రహస్యం,

నేను మామూలుగా చెప్పేది ఇదే:

గొర్రెలు.

కాదు, నిజంగానే.

నిజంగా గొర్రెలే.

సరే, నేను వస్తున్నాను.

నీ గత ఉత్తరంలో, ఏ గొర్రెలైనా ప్రత్యేకమా అని అడిగావు.

అంటే, అవన్నీ ప్రత్యేకమైనవే. అందుకే ప్రతి ఒక్క దానికీ పేరు పెట్టాను.

ఉదాహరణకు:

తుంటరి కవల పొట్టేళ్లున్నాయి. వాటికి రోనీ, రెజ్జీ అని పేర్లు పెట్టాను.

చాలా గర్వం, హుందాతనం ఉన్న సర్ రిచ్‌ఫీల్డ్.

మరీ దూదిలా ఉండే క్లౌడ్.

దానికి కాస్త టెక్కు ఎక్కువ.

జోరా చాలా కుతూహలం గలది.

మాపుల్ చాలా ఓపిక గలది.

ఇంకా వూల్-ఐస్…

ఊ, ఎందుకంటే దానికి మంచి పేరు దొరకలేదు.

సరే, అవన్నీ ప్రత్యేకమైనవని చెప్పాను,

కానీ అందులో రెండు చాలా ప్రత్యేకమైనవని నేను ఒప్పుకోక తప్పదు.

అది సెబాస్టియన్.

నా అతి పెద్ద పొట్టేలు,

అలాగే, నాలాగే కాస్త ఒంటరిది.

కాస్త ముందో వెనుకో అది తిరగడానికి వెళ్లిపోతుంది.

అలాగే కాస్త ముందో వెనుకో అది తిరిగి వస్తుంది.

ఇక చివరిది లిలీ.

నా తెలివైన గొర్రె.

నా బుర్రలో ఏమాలోచిస్తున్నానో, నా మనసుకు ఏమనిపిస్తుందో,

దానికి ఎల్లప్పుడూ తెలిసేటట్లుగా ఉంది.

అది అన్నిటికంటే ఎక్కువగా గొర్రెల కాపరులకు మాత్రమే తెలిసే శాంతిని చేకూరుస్తుంది.

భూమిపై జీవించే

అత్యంత దయగల జీవులను సంరక్షించడం ద్వారా లభించే శాంతి అది.

ప్రతిరోజు వాటి ఆరోగ్యం చూడడంతో మొదలవుతుంది.

గొర్రెల దాణా

వాటిని బాగా మేపుతాను…

శుభ్రంగా ఉంచుతాను.

నాకు చేతనైనంతగా వాటికి వినోదం కలిగిస్తాను.

నేను లేవగానే నాకు తెలుసు నేను చేస్తానని

మీ పక్కన లేచే ఆ మనిషిని నేనవుతాను

ఆ తర్వాత వాటికి మందులు ఇస్తాను. వాటికి మాటలు వచ్చుంటే…

అవి చాలా బాగున్నాయని అనేవేమో.

ఇప్పుడు నువ్వు మందులు వేసుకునే సమయం. ఇదిగో.

నా పనులన్నీ ముగిసేసరికి ఆకాశాన సూర్యుడు అస్తమిస్తుంటాడు.

వాటికోసం చదవడానికి పుస్తకం ఎంచుకుంటా.

డిటెక్టివ్, మిస్టరీ నవలలు, నేర పరిశోధన కథలు. నాకిష్టమైనవన్నీ.

"రాడ్నీ హాలింగ్స్‌హెడ్ హత్యకు గురైనప్పుడు నాకు తెలుసు,

ఇంకా అసలైన హంతకుడెవరో నాకు తెలుసు."

ఈ కథ వాటికర్థం అవుతున్నట్లు నటించడమంటే నాకిష్టం.

కానీ నా మనసుకు తెలుసు, అవి ఎంత ప్రత్యేకమైనా, ఇంకనూ అవి…

గొర్రెలే.

చాలు, ఇక చాలు.

అందరూ మీ పనులు చూసుకోండి.

నేను ముగింపు రేపు చదువుతాను.

అతను అక్కడ ఎందుకు ఆపాడు?!

అతను ఆ హంతకుడు ఎవరో చెప్పేముందు!

ఇది చిత్రహింసకు గురి చేయడం! అది పనిమనిషి, కదా?

అవును, అది ఆ పనిమనిషే.

కాదు, కాదు, కాదు, అది ఆ తోటమాలే.

ఎల్లప్పుడూ గడ్డి కోస్తాడు, కానీ ఏమీ తినకపోవడమా?

అవును. అనుమానాస్పదంగా ఉంది.

నీకు పిచ్చా? అది ఆ డాక్టరే చేశాడు.

అది అసాధ్యం. అది ఆ భయపెట్టే అత్తనే.

ఆ భయపెట్టే అత్త మూడు కథల క్రితం ఉంది, మేధావి.

ఒకే తల్లిదండ్రులకు మనం ఎలా పుట్టాం?!

అబ్బా, మళ్లీ మొదలైంది.

నిజమే.

అబ్బా, అవి మళ్లీ మొదలుపెట్టాయి.

మీరంతా తప్పు.

నేను రెండు అధ్యాయాల క్రితమే కనిపెట్టాను.

ఆ పనిమనిషే, కదా?

ఆ పనిమనిషి కాదు.

తోబుట్టువు కొడుకు, బర్టీ హాలింగ్స్‌హెడ్.

లిలీ, కానీ బర్టీ హాలింగ్స్‌హెడ్‌కున్న వ్యతిరేక సాక్ష్యమంతా నకిలీదని,

నిజమైన హంతకుడే సృష్టించాడని డిటెక్టివ్ నిరూపించలేదా?

సరిగ్గా.

అర్థం కావడం లేదా?

శిక్ష నుండి తప్పించుకోవడానికి, అతనే నకిలీ సాక్ష్యాన్ని సృష్టించాడు.

అసలైన హంతకుడు బర్టీ హాలింగ్స్‌హెడ్.

అలా ఎందుకు చేశావు?

జార్జ్ ఆ కథను రేపు ముగిస్తాడు. నువ్వే చూడు.

నేను ఇంకా ఆ పనిమనిషే అనుకుంటాను.

"ఒక వ్యక్తిని ఒకే నేరానికి

రెండుసార్లు విచారించకూడదనే చట్టం గురించి బర్టీకి అంతా తెలుసు.

అందుకనే శిక్షను తప్పించుకోవడానికి అతనే నకిలీ సాక్ష్యాన్ని సృష్టించాడు.

అసలైన హంతకుడు బర్టీ హాలింగ్స్‌హెడ్."

ఇప్పుడు నా గొర్రెల్లో చాలా వరకు తింటూనో, తినడం గురించి ఆలోచిస్తూనో

రోజంతా సమయాన్ని గడిపేస్తాయి.

కానీ నా దగ్గర అంతులేని శక్తి ఉన్న మూడు అల్లరి గొర్రెపిల్లలున్నాయి.

ఇవి వసంతకాలంలో పుట్టిన సంతోషంగా, నిశ్చింతగా ఉండే చిన్నిజీవులు.

నిజానికి, దాదాపు అన్ని గొర్రెపిల్లలు వసంతకాలంలోనే పుడతాయి.

కానీ ఒక గొర్రెపిల్ల శీతకాలంలో పుట్టింది.

ఓ. హలో.

-నేను డెయిసీని. -నేను ఆలివర్‌ను.

-నేను పికిల్స్‌ను. -నీ పేరేంటి?

నాకు పేరు లేదు.

నువ్వు మాతో ఆడుకుంటావా?

వద్దు! వెళ్లు!

మీరు ఆ శీతకాలపు గొర్రెపిల్లతో ఆడకూడదు.

దానికి ఈ మందలో చోటు లేదు.

గొర్రెలకు మాత్రమే అర్థమయ్యే కారణాల వల్ల,

తరచుగా అవి చలికాలంలో పుట్టిన గొర్రెపిల్లను తిరస్కరిస్తాయి.

పరవాలేదు.

ఎందుకంటే శీతకాలపు గొర్రెపిల్ల భిన్నంగా ఉంటుంది.

ఓ, అంతే. బాగుంది.

ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను.

జార్జ్ ఎల్లప్పుడూ ఆ గొర్రెపిల్లను ఎందుకంత ప్రేమగా చూస్తాడు?

జార్జ్ గొర్రె కాదు.

అతనికి శీతకాలపు గొర్రెపిల్లల గురించి ఎవరూ నేర్పించలేదు.

ఓ, చివరిగా మరొక విషయం, ఒకవేళ నువ్వు నా ఆహ్వానాన్ని స్వీకరిస్తే,

నేను డెన్‌బ్రూక్‌లో ఉంటాను.

దాని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి.

ఉదాహరణకు…

నమస్కారం, కేలబ్.

కేలబ్ కూడా గొర్రెలకాపరి.

నమస్కారమండీ.

అతను నాకు నచ్చడు.

కసాయివాడు హ్యామ్.

నిజంగా అతనంటే నాకిష్టం లేదు.

సత్రం యజమానురాలు బెత్.

ఆమెకు నేనంటే నచ్చదు.

వాడిని చంపేసేదాన్ని.

పోలీసు టిమ్.

టీ-ఎస్ఆర్ షాక్

తెలివితక్కువవాడు.

రెవెరెండ్ రెవెరెండ్ హిల్కోట్ తనను తాను మనుషులకాపరి అనుకుంటాడు.

మాది సంక్లిష్టమైన సంబంధం.

ఈరోజు చదవబోయే కథ: పారబుల్ ఆఫ్ ద లాస్ట్ షీప్.

జార్జ్, మాతో పాటు ఉండడానికి వచ్చావా?

ప్రభువు గృహానికి అందరూ ఆహ్వానితులే.

కసాయివాళ్లు కూడానా, హ్మ్?

నేను మీతో పాటు ఉండడానికి రాలేదు.

రుణం తీర్చుకోవడానికి వచ్చాను.

అదే పాత జార్జ్.

అదే పాత జార్జ్.

కానీ ఇక జనాల గురించి చాలు.

నువ్వు నా మందను కలవాలనుకుంటున్నాను.

అవి నిన్ను చూడాలని తహతహలాడుతున్నాయి.

అలాగే నేను కూడా.

దయచేసి తొందరగా రా.

ప్రేమతో, జార్జ్.

క్లౌడ్?

ఒక ప్రశ్న అడుగుతాను.

డ్యాండిలయన్ పూలు తింటే నా కనురెప్పలు నీవాటిలా అందంగా అవుతాయా?

లేదు, అవి కనురెప్పలను ప్రభావితం చేయవు.

కానీ ‌ఉన్నిపై అద్భుతమైన ప్రభావం చూపుతాయి.

వూల్-ఐస్ వైపు చూడు.

అది డ్యాండిలయన్ పూలు తప్ప మరేమీ తినదు.

ఓ, అవి ఇవేనా? సరే.

కొన్ని డ్యాండిలయన్ పూలను సెబాస్టియన్ కోసం ఉంచాలి. అది వెళ్లి చాలా రోజులైంది.

ఎవరు లెక్క చేస్తారు? జార్జ్ దాన్ని ఎక్కడి నుండో తీసుకొచ్చినప్పటి నుండి

అది పట్టణంలో ఎక్కడెక్కడో తిరుగుతుంది.

అది ఆకలితో ఉండనీ.

అది మనల్ని పట్టించుకోనంత మాత్రాన మనం కూడా దాన్ని పట్టించుకోకూడదని లేదు.

సెబాస్టియన్ మన మందలో ఒక భాగం.

ఓ, ఓ, చూడండి! తను కేలబ్!

కుక్కలు!

కుక్కలు, కుక్కలు, కుక్కలు, కుక్కలు, కుక్కలు.

కేలబ్! ఇక్కడ!

ఓ, నాకు అతని వాసన ఎల్లప్పుడూ నచ్చుతుంది.

అది అతని ఉన్ని స్వెటర్లది.

చాలా అందంగా రంగులు అద్దారు.

-నేను లోపలికి రావచ్చా? -వెళ్లిపో!

లోపలికి వస్తున్నాను.

అది చాలా కొత్తగా, అందంగా, మెరుస్తూ ఉంది.

నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తున్నావా?

-దాన్ని గుద్దుతాను! -దాన్ని బాగా గుద్దుతాను!

రెజ్జీ! రోనీ!

మనం ముందే చర్చించుకున్నాం. మనం దేన్నీ గుద్ధబోము, ఏదైనా…?

ఏదైనా సరైన కారణం ఉంటే తప్ప గుద్ధబోము.

అది నిజమే.

ఈ నెలలో కేలబ్ రావడం ఇది మూడోసారి.

వాళ్లు అక్కడ మాట్లాడుకునేది ఒకే ఒక విషయం అయ్యుంటుంది.

మందలను కలిపేయడం.

-మందలను కలిపేయడం! -కొత్త గొర్రెలు.

-కొత్త పొలాలు! -కుక్కలు?

దాని గురించి ఆలోచిస్తున్నాను!

నేను నీకు ఒక అవకాశం ఇస్తే నాతో అబద్ధమాడావు, కేలబ్!

తిరిగి రాకు.

అయ్యో, అయితే మన మందలను కలిపేయడం లేదన్నమాట.

నేను చాలా సంతోషించాను.

ఇప్పుడు నాకు బాధగా, కలతగా ఉంది.

ఇలా జరిగిందనేది మర్చిపోవాలనుకుంటున్నాను!

నువ్వు చెప్పింది నిజమే. ఇది చాలా నిరాశాజనకమైనది.

సరే, అందరూ?

నేను మూడు లెక్క పెట్టేసరికి కేలబ్ వచ్చిన సంగతి అందరం మర్చిపోవాలి.

ఒకటి. రెండు…

కానీ మాపుల్ సంగతేంటి? ఏదీ మర్చిపోడు.

ఎందుకు మర్చిపోడు?

పాపం మాపుల్.

అది భయంకరమైన లోపంతో జన్మించాడు.

అది మనందరిలా సంగతులను మర్చిపోలేడు.

అవును, నిజమే.

మాపుల్, మేము ఇది మర్చిపోయాక, ఇది జరిగిన సంగతి మళ్లీ మాకు గుర్తు చేయకు.

అయినా కచ్చితంగానే అంటున్నావా? అది అంత ఘోరంగా ఏమీ లేదు.

లేదు. అది అంత బాగా కూడా లేదు. అందుకని అది పట్టించుకోవడం ఎందుకు?

Mga Komento

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left